పెద్దితో నిర్మాతలు, ఎగ్జిబిటర్ల పర్సెంటేజ్ గేమ్.. బంతి చిరంజీవి కోర్టులో

తెలుగు సినిమా పరిశ్రమలో నిర్మాతలు, డిస్టిబ్యూటర్లు, ఎగ్జిబిటర్ల మధ్య పర్సెంటేజ్, రెంట్ గేమ్ జోరుగా సాగుతున్నది. సింగిల్ థియేటర్లలో ప్రదర్శించే సినిమాలకు నిర్మాతలు రెంట్ విధానంలో కాకుండా పర్సంటేజ్ పద్దతిలో ప్రతిఫలాన్ని చెల్లించాలని ఎగ్జిబిటర్లు డిమాండ్ స్తున్నారు. అయితే నిర్మాతలు మాత్రం తాము రెంట్ పద్దతిలోనే కొనసాగుతాం. ఇప్పట్లో పర్సంటేజ్ విధానాన్ని అమలు చేయలేమని చేతులెత్తేశారు. దాంతో ప్రస్తుతం ఈ అంశం వివాదంగా మారింది. దాంతో పెద్ది మూవీని తెలంగాణలో రిలీజ్ చేయమని ఎగ్జిబిటర్లు అల్టిమేటం జారీ చేశారు. అయితే ఈ వ్యవహారం ప్రస్తుతం ఇండస్ట్రీలో పెద్ద దిక్కుగా వ్యవహరిస్తున్న చిరంజీవి కోర్టులోకి పర్సంటేజ్ వివాద బంతి వెళ్లింది. ఈ వివాదం గురించిన వివరాల్లోకి వెళితే..

టాలీవుడ్‌లో పవన్ కల్యాణ్ నటించిన హరిహర వీరమల్లు సినిమా రిలీజ్‌కు ముందు ఎగ్జిబిటర్ల ముందు ఇలాంటి వివాదం తెరపైకి వచ్చింది. అయితే అనేక కారణాల వల్ల జాప్యం జరిగి లేటుగా రిలీజ్ అవుతున్న ఆ సినిమా విషయంలో నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్ల మధ్య చర్చలు జరిగాయి.ఈ సినిమా రిలీజ్‌ను ఆపకండి. ఈ అంశంపైచర్చించి సరైన నిర్ణయం తీసుకొందామని నిర్మాతలు సూచించారు. అయితే ఏడాది గడిచిన నిర్మాతల నుంచి పర్సంటేజ్ గురించి ఎలాంటి స్పందన లేకపోవడంతో పెద్ది మూవీని ఎగ్జిబిటర్లు టార్గెట్ చేశారు.

Tollywood s Percentage Issue in Chiranjeevi

గత రెండు వారాలుగా ఎగ్జిబిటర్లు ఓ సమావేశం, వారికి పోటీగా నిర్మాతలు మరో సమావేశం పెట్టారు. ఒకరిపై మరొకరు విమర్శలు, ఆరోపణలు చేసుకోవడంతో ఈ వివాదం మరింత గందరగోళంగా మారింది. అయితే పెద్ది సినిమా రిలీజ్ సమీపిస్తున్న సమయంలో తెలంగాణ ఎగ్జిబిటర్లు మరోసారి సమావేశం పెట్టి.. పెద్ది సినిమా గానీ,. మరో సినిమా గానీ అయినా పట్టించుకోం. తెలంగాణలో టికెట్ రేట్లను కూడా పెంచం అని స్పష్టం చేశారు. ఈ విషయంలో చిరంజీవి జోక్యం చేసుకోవాలని ఎగ్జిబిటర్లు కోరారు.

దాంతో ఎగ్జిబిటర్లతో మెగాస్టార్ చిరంజీవి సమావేశమయ్యారు. ఈ వవ్యహారంపై తెలుగు ఫిలిం ఛాంబర్ ఓ నిర్ణయం తీసుకొన్నది. కమిటీని కూడా ఏర్పాటు చేసింది. ఈ సమస్యకు పరిష్కారం చూపించేందుకు ఛాంబర్ ప్రయత్నిస్తున్నది. కాబట్టి పర్సంటేజ్ వ్యవహారంపై మీడియా ముందుకు రాకూడదు. ఈ విషయంలో ఇరు వర్గాలు సంయమనం పాటించాలి అని చిరంజీవి సూచించారని తెలిసింది.

సింగిల్ థియేటర్లు ఎదుర్కొంటున్న సమస్యలు మా దృష్టిలో ఉన్నాయి. ప్రస్తుతం ఉన్న పరిస్థితులను అర్ధం చేసుకొని అందరికీ న్యాయం జరిగేలా చేస్తాం. ఈ విషయంలో ఎలాంటి అనుమానాలు, సందేహాలు ఉండకూడదు. పరిశ్రమ అంతా ఒకటి అనే భావనను కలిగించాలి అని చిరంజీవి సూచించడంతో ఎగ్జిబిటర్ల అసోసియేషన్ సంతృప్తి చెందారని తెలిసింది. ప్రస్తుతం ఈ వివాదం అంశం చిరంజీవి పరిగణనలో ఉంది. పెద్ది రిలీజ్‌కు ఎలాంటి ఆటంకాలు లేకుండా ఆయన తగిన నిర్ణయం తీసుకొంటారని తెలిసింది.

Read more about: tollywood chiranjeevi peddi
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X