ముగ్గురితో పెళ్లి, విడాకులు .. 63 ఏళ్ల వయసులో 37 ఏళ్ల నటితో హీరో డేటింగ్
ప్రేమకు వయసుతో సంబంధం లేదన్న సంగతి తెలిసిందే. సినీ సెలబ్రెటీల మధ్య ఇలాంటి వాటికి అసలు తావు లేదు. 80 ఏళ్ల వయసులోనూ ప్రేమాయణాలు, డేటింగ్, పెళ్లితో హల్‌చల్ చేస్తుంటారు. హాలీవుడ్ నుంచి టాలీవుడ్ వరకు ఇలాంటి నటీనటులు ఎందరో. ఇటీవల బాలీవుడ్ సూపర్‌స్టార్ అమీర్‌ఖాన్ ఇటీవల మూడో పెళ్లికి సిద్ధమైన సంగతి తెలిసిందే. ఎప్పటి నుంచో రిలేషన్‌లో ఉంటున్న ఈ హీరో.. త్వరలోనే తన ప్రియురాలిని పెళ్లాడనున్నారు. ఇండియాలోనే పరిస్ధితి ఇలా ఉంటే హాలీవుడ్‌లో ఎవరు ఎప్పుడు బ్రేకప్ చెబుతారో? ఎప్పుడు కలిసిపోతారో? తెలియదు. తాజాగా హాలీవుడ్‌కు చెందిన సూపర్‌స్టార్ టామ్ క్రూజ్ 63 ఏళ్ల వయసులో 4వసారి పెళ్లికి సిద్ధమయ్యాడు. ఈ వివరాల్లోకి వెళితే..
18 ఏళ్ల వయసుకే నటుడిగా
జూలై 3, 1962న యునైటెడ్ స్టేట్స్‌లోని న్యూయార్క్‌లో జన్మించారు టామ్ క్రూజ్. ఆయన పూర్తి పేరు థామస్ క్రూజ్ మాపొదర్ IV. క్యాథలిక్ స్కాలర్‌షిప్‌తో చదువుకున్న టామ్.. 18 ఏళ్లకే కెరీర్ ప్రారంభించారు . 1981లో ఎండ్‌లెస్ లవ్ సినిమా ద్వారా హాలీవుడ్‌లో అడుగుపెట్టిన టామ్ క్రూజ్ షార్ట్ గ్యాప్‌లోనే స్టార్ డమ్ సంపాదించారు. రిస్కీ బిజినెస్‌మెన్, టాప్ గన్, ది కలర్ ఆఫ్ మనీ, రెయిన్ మెన్, ది ఫర్మ్, ఫాలెన్ ఏంజెల్స్ సినిమాలతో దూసుకెళ్లాడు. రిస్కీ స్టంట్స్, యాక్షన్ సీక్వెన్స్‌లతో ప్రేక్షకులను అలరించారు.

రిస్కీ స్టంట్స్‌తో గ్లోబల్ ఇమేజ్
30 ఏళ్ల క్రితం మిషన్ ఇంపాసిబుల్ సిరీస్‌కు శ్రీకారం చుట్టి హెలికాఫ్టర్‌లు, విమానాల నుంచి దూకడం, పర్వతాలను బైక్‌తోనే అధిరోహించడం వంటి స్టంట్స్‌తో ఆయన ప్రపంచవ్యాప్తంగా క్రేజ్ సంపాదించుకున్నారు. ఈ ఏడాది మిషన్ ఇంపాసిబుల్ ది ఫైనల్ రెకనింగ్‌తో అభిమానులను అలరించారు. హాలీవుడ్‌కు ఐకాన్‌గా, ప్రపంచంలోనే అత్యధిక రెమ్యునరేషన్ అందుకునే నటుడిగా టామ్ క్రూజ్ రికార్డు సృష్టించారు. 1993లో క్రూజ్ వాగ్నర్ ప్రొడక్షన్స్ పేరిట నిర్మాతగా పలు చిత్రాలను నిర్మించారు .ఈ హాలీవుడ్ సూపర్‌స్టార్ సినిమాలతో స్టార్‌డమ్ సంపాదించడంతో పాటు వ్యక్తిగత జీవితంతోనూ వార్తల్లో నిలిచారు టామ్.
మూడు పెళ్లిళ్లు
1987లో మిమీ రోగర్స్‌ను, 1990లో నికోల్ కిడ్‌మన్, 2006లో కేట్ హోల్మోస్‌లను పెళ్లాడి ముగ్గురి నుంచి విడిపోయారు. నటి హీథర్ లాక్‌లియర్, సింగర్ చెర్‌తో ప్రేమాయణం సాగించారు. తాజాగా 63 ఏళ్ల వయసులో టామ్ క్రూజ్ ఆరోసారి ప్రేమలో పడ్డారు. హాలీవుడ్ నటి 37 ఏళ్ల అనా డీ అర్మాస్‌తో టామ్ క్రూజ్ డేటింగ్ చేస్తున్నట్లుగా అమెరికన్ మీడియాలో గాసిప్స్ వైరల్ అవుతున్నాయి. గత కొన్నాళ్లుగా వీరిద్దరూ ఒకే ఇంట్లో ఉంటున్నారని అమెరికన్ మీడియా కోడై కూస్తోంది. తాజాగా వెర్మోంట్‌లో టామ్ క్రూజ్- అనా డీ అర్మాస్‌లు చెట్టాపట్టాలేసుకుని కనిపించడం ఈ వార్తలకు బలం చేకూర్చినట్లు అయ్యింది.
అనా డీ అర్మాస్‌తో డేటింగ్
అటు అర్మాస్ కూడా వివాహితురాలే. గతంలో 2011లో స్పానిష్ నటుడు మార్క్ క్లోటెట్‌ను పెళ్లాడిన ఈ ముద్దుగుమ్మ... రెండేళ్లు తిరిగే సరికి అతని నుంచి విడాకులు తీసుకుంది. దాదాపు 12 ఏళ్లుగా ఒంటరిగానే ఉంటున్న ఈ ముద్దగుమ్మ.. గత కొంతకాలంగా టామ్ క్రూజ్‌తో సన్నిహితంగా ఉంటోంది. కొద్దిరోజుల క్రితం ఒయాసిస్ మ్యూజిక్ ఈవెంట్‌కు టామ్ క్రూజ్- అర్మాస్‌లు కలిసి వెళ్లడంతో నాటి నుంచి వీరి బంధంపై అనుమానాలు మొదలయ్యాయి. తాజాగా వీరిద్దరూ వెర్మోంట్‌లో ప్రత్యక్షం కావడంతో ఈ జంట పెళ్లి చేసుకుంటుందా? లేదా? అంటూ మీడియాలో ఊహాగానాలు వినిపిస్తున్నాయి.


Click it and Unblock the Notifications











