Top Movies: మాయ చేస్తున్న టాప్ 5 మలయాళ సినిమాలు.. ఒక్కటి మిస్ అయినా!
ప్రముఖ మీడియా సంస్థ ఆర్మాక్స్ గురించి దేశ వ్యాప్తంగా ఉన్న సినీ ప్రియులు అందరికీ తెలిసిందే. అనేక మంది హీరోహీరోయిన్లపై, సినిమాలు, వెబ్ సిరీస్ లపై ఎప్పటికప్పుడు సర్వేలు నిర్వహిస్తూ ఫలితాలను వెల్లడిస్తుంది. అందరు మెచ్చిన టాప్ 10 సినిమాలు, హీరోయిన్లు, వెబ్ సిరీస్ ల లిస్టును ప్రతీ నెల ఎక్స్ వేదికగా ప్రకటిస్తుంది.
అయితే తాజాగా ఈ ఆర్మాక్స్ మీడియా సంస్థ దేశం మెచ్చిన టాప్ 5 మలయాళ సినిమాల లిస్టును రిలీజ్ చేసింది. అయితే ఈ సినిమాలు అన్నీ సూపర్ డూపర్ హిట్ చిత్రాలు కావడం గమనార్హం. ప్రతీ ఒక్కరూ కచ్చితంగా చూడాల్సిన ఈ టాప్ 5సినిమాలు ఏవో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

ఆర్మాక్స్ మీడియా సంస్థ రిలీజ్ చేసిన టాప్ 5 మలయాళ సినిమాల్లో.. మంజుమ్మల్ బాయ్స్ మొదటి స్థానం దక్కించుకుంది. సర్వైకర్ థ్రిల్లర్ గా వచ్చిన ఈ సినిమాను చిదంబరం తెరకెక్కించగా.. పరవ ఫిల్మ్స్ నిర్మించారు. ఈ సినిమాలో సౌబిన్ షాహిర్, శ్రీనాథ్ భాసి, బాలు వర్గీస్, గణపతి ఎస్. పొదువాల్, లాల్ జూనియర్, దీపక్ పరంబోల్, అభిరామ్ రాధాకృష్ణన్, అరుణ్ కురియన్, ఖలీద్ వంటి వాళ్లు ప్రధాన పాత్రల్లో నటించగా.. బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ప్రస్తుతం తెలుగులోకి కూడా ఈ సినిమా డబ్ అవుతోంది. ఫిబ్రవరి 22న వచ్చిన ఈ సినిమా ఇప్పటికీ సెన్సేషన్ క్రియేచ్ చేస్తుంది.

ఇక టాప్ 2లో ప్రేమలు సినిమా నిలిచింది. భావన స్టూడియోస్ బ్యానర్‌పై ఫహద్ ఫాసిల్, దిలీష్ పోతన్, శ్యామ్ పుష్కరన్ నిర్మించిన ఈ సినిమాకు గిరీష్ ఏడీ దర్శకత్వం వహించగా తెలుగులో ఎస్.ఎస్ కార్తికేయ విడుదల చేశాడు. నస్లేన్ కె. గఫూర్, మమితా బైజు, అల్తాఫ్ సలీమ్, మీనాక్షి రవీంద్రన్, అఖిల భార్గవన్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా మలయాళంలో ఫిబ్రవరి 9న, తెలుగులో మార్చి 8న రిలీజ్ అయింది. థియేటర్ల వద్ద భారీగా కాసుల వర్షం కురిపించిన ఈ చిత్రం యూత్ ను బాగా ఆకట్టుకుంది.

ఇక టాప్ 3లో బ్రమయుగం నిలిచింది. మమ్ముట్టి ప్రధాన పాత్రలో వచ్చిన ఈ హార్రర్ థ్రిల్లర్ సినిమాకు రాహుల్ సదాశివన్ దర్శకత్వం వహించారు. నైట్ షిఫ్ట్ స్టూడియోస్ మరియు YNOT స్టూడియోస్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రంలో మమ్ముట్టితో పాటు సిద్ధార్థ్ భరతన్, అర్జున్ అశోకన్ నటించగా.. సూపర్ డూపర్ హిట్ గా నిలిచింది. పూర్తి బ్లాక్ అండ్ వైట్ కలర్ లో కేవలం రూ. 27.73 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కించిన ఈ సినిమా బాక్సాఫీసు వద్ద రూ.85 కోట్లు రాబట్టింది. ఈ సినిమా కూడా అద్భుతంగా ఉంది.

ఇక టాప్ 4లో మలయాళ క్రైమ్ థ్రిల్లర్ మూవీ అబ్రహం ఓజ్లర్ నిలిచింది. జయరాం, మమ్ముట్టి, అనూప్ మీనన్, అనస్వర రాజన్, అర్జున్ అకోశన్ లు ప్రధాన పాత్రలో వచ్చిన ఈ సినిమాను మిథున్ థామస్ తెరకెక్కించారు. అలాగే ఇర్షద్ హాసన్, మఇథున్ థామస్ లు ప్రొడ్యూసర్ గా వ్యవహరించగా.. సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. జనవరి 11వ తేదీన విడుదల అయిన ఈ సినిమా బాక్సాఫీసు వద్ద రూ.40.53 కోట్లు రాబట్టుకుని సెన్సేషన్ క్రియేట్ చేసింది. ప్రస్తుతం ఓటీటీలో తెగ సందడి చేస్తుంది.

ఇక చివరలో అంటే టాప్ 5లో అన్వేషిప్పిన్ కండేతుం అనే సినిమా నిలిచింది. మిస్టరీ థ్రిల్లర్ గా వచ్చిన ఈ సినిమాను డార్విన్ కురియాకోస్ దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో టోవినో థామస్ తో పాటు ఇంద్రన్స్, సిద్ధిక్, షమ్మీ తిలకన్, సాదిక్, అజీస్ నెడుమంగడ్, బాబూరాజ్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఫిబ్రవరి 9వ తేదీన విడుదల అయిన ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ గా నిలిచింది. ప్రస్తుతం ఓటీటీలో కూడా ఈ చిత్రం సందడి చేస్తోంది. పైన చెప్పిన ప్రతీ సినిమాకు అందరూ కచ్చితంగా చూడాల్సిందే.


Click it and Unblock the Notifications











