పుష్ప సినిమాను వదులుకున్న టాప్ 5 స్టార్స్ ఎవరో తెలుసా?.. అతను ఓకే చెప్పి ఉంటే మరోలా ఉండేది!
టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో గత ఏడాది అత్యధిక బాక్సాఫీస్ కలెక్షన్స్ అందుకున్న సినిమా పుష్ప సినిమా నెంబర్ వన్ స్థానంలో నిలిచింది. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ క్రియేటివ్ దర్శకుడు సుకుమార్ కాంబినేషన్లో తెరపైకి వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులను క్రియేట్ చేసి పుష్ప రెండవ బాగంపై కూడా మంచి హైప్ క్రియేట్ చేసింది. ఇక సినిమా సక్సెస్ అయిన అనంతరం కొంతమంది స్టార్స్ కూడా అనవసరంగా ఛాన్స్ మిస్ చేసుకున్నాము అని కొంత అప్సెట్ అవుతున్నవారు ఉన్నారు. ఈ సినిమాలో ఒక ఐదు మంది సినీ తారలకు మంచి అవకాశాలు వచ్చాయి. కానీ వాళ్ళు సినిమా రిజల్ట్ ను ఊహించలేక చర్చల దశలో రిజెక్ట్ చేశారు. ఒకసారి ఆ వివరాల్లోకి వెళితే..

కథ రాసుకున్నప్పుడే..
సుకుమార్ ఎలాంటి సినిమాలు తెరపైకి తీసుకు వచ్చినా కూడా డిఫరెంట్ గా ఉంటాయని అని అందరికీ తెలిసిన విషయమే. పుష్ప కథ అనుకున్నప్పుడే సినిమాను పాన్ ఇండియగా తెరపైకి తీసుకురావాలని ఫిక్స్ అయ్యాడు.
అసలు అయితే మొదట ఈ బ్యాక్ గ్రౌండ్ లో కథ అనుకున్నప్పుడు బడ్జెట్ వంటి అంశాలను ఏమాత్రం లెక్కచేయకుండా స్క్రిప్టును తయారు చేశాడు. అంతేకాకుండా నటీనటుల విషయంలో కూడా ఏమాత్రం వెనక్కి తగ్గకుండా సినిమా చాలా గ్రాండ్ గా ఉంటుందని కూడా ఆలోచించాడు.

మొదట ఆ హీరో కోసం..
అయితే అనుకున్న కథ పర్ఫెక్ట్ గా రావాలి అంటే అంత సాధారణ విషయం కాదు. బడ్జెట్ విషయాలతోపాటు నటీనటుల అంగీకారం కూడా చాలా ముఖ్యం. కొంతమంది ఒప్పుకుంటారు మరికొంతమంది ఒప్పుకోలేరు. అయితే పుష్ప సినిమా బ్యాక్ డ్రాప్ అనుకున్నపుడు మొదట సుకుమార్ సూపర్ స్టార్ మహేష్ బాబు తోనే సినిమా చేయాలని అనుకున్నాడు. చాలా రోజులు చర్చలు కూడా జరపాల్సి వచ్చింది. కానీ మహేష్ బాబు మాత్రం పాత్ర డిజైనింగ్ అలాగే ఇతర అంశాలపై కూడా అంతగా సంతృప్తి చెందక పోవడంతో ఆ ప్రాజెక్ట్ చేయలేనని చెప్పేశాడు.

అల్లు అర్జున్ రాగానే..
మహేష్ బాబు రిజల్ట్ చేయడంతో సుకుమార్ ఏమాత్రం వెనక్కి తగ్గకుండా ఈ సినిమాను అంతకుమించి అనేలా తెరపైకి తీసుకురావాలని మొండి పట్టుదలతో అల్లు అర్జున్ తో చేతులు కలిపాడు. బన్నీ ప్రాజెక్ట్ లోకి రాగానే మళ్ళీ స్క్రిప్ట్ లో చాలా మార్పులు చేశారు. మైత్రి మూవీ మేకర్స్ కూడా పాన్ ఇండియా సినిమాగా నిర్మించడానికి ఒప్పుకోవడంతో అన్ని అనుకున్నట్లుగానే సినిమాను భారీ స్థాయిలో తెరపైకి తీసుకువచ్చారు.

హీరోయిన్ కోసం..
పుష్ప సినిమా లో వివిధ అంశాల కోసం ఇతర స్టార్స్ ని కూడా బాగానే సంప్రదించారు. సినిమాలో హీరోయిన్ పాత్ర కోసం మొదట రష్మీక మందన్న అని కాకుండా కొంతమంది అగ్ర హీరోయిన్స్ ను సంప్రదించారట. ప్రధానంగా సమంత పేరు గట్టిగానే వినిపించింది. అలాగే బాలీవుడ్ లో కూడా కొంతమంది పేరు బాగానే వైరల్ అయ్యింది.. కానీ ఎవరూ కూడా ప్రాజెక్ట్ చేయడానికి అంతగా ఆసక్తి చూపలేదట. సమంత కేవలం ఒక ఐటం సాంగ్ చేయడానికి మాత్రమే ఒప్పుకుంది.

ఐటెమ్ సాంగ్..
ఇక సినిమాలో ఐటెమ్ సాంగ్ కోసమని మొదట సమంతను అనుకున్నప్పటికీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ కాబట్టి అన్ని భాషల వారికి కనెక్ట్ అయ్యే విధంగా బాలీవుడ్ బ్యూటీ ని సెలెక్ట్ చేసుకోవాలి అని అనుకున్నారట అందుకోసం. హాట్ బ్యూటీ దిశాపటాని వైపు కూడా ఆసక్తిని చెప్పినట్లు సమాచారం. ఆ బ్యూటీకి అడిగినంత పారితోషికం కూడా ఇవ్వాలని నిర్మాతలు ముందుకు వచ్చారట. కానీ కారణం ఏమై ఉంటుందో కానీ దిశాపటాని మాత్రం ఐటెం సాంగ్ చేయలేనని చివరి నిముషంలో హ్యాండ్ ఇచ్చేసిందట. దీంతో చిత్ర దర్శకుడు సుకుమార్ సమంతను రంగంలోకి దింపే మంచి పాజిటివ్ బజ్ అయితే క్రియేట్ చేశాడు.
Recommended Video

విలన్ క్యారెక్టర్..
ఇక సినిమాలో హీరో పాత్ర కంటే దర్శకుడు విలన్ పాత్ర పై ఎక్కువ ఆశలు పెట్టుకొని కథలు రాసుకున్నాడు. ఇక ఈ సినిమాలో ప్రధాన విలన్ అయినటువంటి SP భన్వర్ సింగ్ షికావత్ కోసం మొదట ఫాహాద్ ను అనుకునేదట. ఆ పాత్ర కోసం తమిళ హీరో విజయ్ సేతుపతి అయితే చాలా బాగుంటుంది అని అందరూ ఒక నిర్ణయానికి వచ్చారు. కానీ విజయ్ సేతుపతి మాత్రం డేట్స్ అడ్జెస్ట్ చేయకపోవడంతో ఈ ప్రాజెక్టులోకి రాలేకపోయాడు. విజయ్ సేతుపతి ఆ పాత్ర చేసి ఉంటే సినిమా రేంజ్ మరొకలా ఉండేది అని ప్రేక్షకులు అభిప్రాయపడుతున్నారు. మరి రెండవ భాగంలో సుకుమార్ ఫాహాఫ్ పాత్రను ఏలా హైలెట్ చేస్తాడో చూడాలి.


Click it and Unblock the Notifications











