పవన్ కల్యాణ్ కాబోయే ప్రధాని.. ఏపీకి సీఎంగా అప్పుడే: జానీ మాస్టర్ సంచలన వ్యాఖ్యలు
పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌కు వీరాభిమానిగా ప్రముఖ కోరియోగ్రాఫర్ జానీ మాస్టర్ గుర్తింపు పొందారు. కేవలం పవన్ కల్యాణ్ ఫ్యాన్‌గానే కాకుండా వీలు దొరికినప్పడు మెగా ఫ్యామీలిపై ఎనలేని ప్రేమను కురిపిస్తుంటాడు. జనసేన పార్టీపై ఎవరైనా విమర్శలు, ఆరోపణలు చేస్తే తనదైన శైలిలో స్పందిస్తుంటారు. అయితే తాజాగా ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత గురించి ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన వ్యాఖ్యల వివరాల్లోకి వెళితే..
జనసేన పార్టీకి అత్యంత విధేయుడిగా ఉన్నారనే విషయం గత అసెంబ్లీ ఎన్నికల్లో నిరూపించుకొన్నారు. ఆయన ఎన్నికలకు ముందు పార్టీలో చేరిన ఆయనకు ప్రచార కమిటీలో బాధ్యతలు అప్పగించారు. దాంతో ఆయన గోదావరి జిల్లాలతోపాటు పలు అసెంబ్లీ నియోజకవర్గంలో విరివిగా ప్రచారం చేసిన అభ్యర్థుల విజయానికి కృషి చేశారు.

ఇక కొరియోగ్రాఫర్‌గా తన వృత్తిని నిర్వహిస్తూనే ఆయన సామాజిక సేవలోను, డ్యాన్సర్స్ అసోసియేషన్ కు కీలక సేవలు అందిస్తున్నారు. ఇటీవల రాంచరణ్ పుట్టిన రోజు సందర్భంగా తన అసోసియేషన్ సభ్యులకు హెల్త్ కార్డులు ఇప్పించడంలో సక్సెస్ అయ్యాడు.
అంతేకాకుండా ఈ ఏడాది కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన జాతీయ అవార్డుల్లో ఉత్తమ కొరియోగ్రాఫర్‌గా అవార్డు అందుకొన్నారు. కేవలం తెలుగులోనే కాకుండా తమిళం, కన్నడ, హిందీ భాషల్లో పలు అగ్ర హీరోలకు ఆయన నృత్యాలు సమకూరుస్తున్నారు. ఆయన చేసిన పాటలు అత్యంత పాపులారిటీని సాధించాయి.
ఇక తాజాగా ఓ పబ్లిక్ మీటింగ్‌లో మాట్లాడుతూ.. సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ రోజు ఏపీకి మీరు డిప్యూటీ సీఎం. 2029లో ఆంధ్రప్రదేశ్‌కు ముఖ్యమంత్రి, 2034 సంవత్సరంలో దేశానికి ప్రధాని అవుతారు. ఇది రాసుకోండి. జై జనసేన అంటూ నినాదాలు చేస్తూ జానీ మాస్టర్ జోస్యం చెప్పారు.


Click it and Unblock the Notifications











