2022లో టాప్ మూవీస్.. బుక్ మై షోలో అత్యధిక బిజినెస్ చేసిన సినిమాలు ఇవే!
ఆన్ లైన్ ద్వారా టికెట్లు అమ్మకానికి పెట్టిన తర్వాత జనాలు థియేటర్ కౌంటర్స్ దగ్గర టికెట్లు కొనుగోలు చేయడం చాలా వరకు తగ్గించేశారు. సినిమా విడుదలకు ముందే ఆన్లైన్లో టికెట్లు అమ్మకానికి పెడుతూ ఉండడంతో భారీ స్థాయిలో అడ్వాన్స్ బుకింగ్ అయితే నమోదవుతున్నాయి. డబ్బులు కాస్త ఎక్కువ అయినా సరే బుక్ మై షోలో అడ్వాన్స్ బుకింగ్ ద్వారా టికెట్లు కొనుగోలు చేస్తున్నారు. ఇక 2022లో కూడా బుక్ మై షో పంట పండింది అనే చెప్పాలి.
ఈసారి కొన్ని పెద్ద సినిమాలు మంచి బిజినెస్ చేశాయి. ఇక మొత్తంగా ఈ ఏడాది బుక్ మై షో లో అత్యధికంగా ఏ సినిమా టికెట్లు అమ్ముడయ్యాయి అనే వివరాల్లోకి వెళితే.. ముందుగా నెంబర్ వన్ స్థానంలో కేజిఎఫ్ చాప్టర్ 2 నిలిచింది. ఈ సినిమా విడుదలకు ముందే భారీ స్థాయిలో అంచనాలను క్రియేట్ చేసింది. దీంతో అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా మంచి కలెక్షన్స్ సొంతం చేసుకుంది. ఇక బుక్ మై షో ఈ ఏడాది అత్యధిక టికెట్లు అమ్ముడైన సినిమాగా కేజీఎఫ్ చాప్టర్ 2 నిలిచింది.

ఇక రెండవ స్థానంలో RRR నిలిచింది. రామ్ చరణ్ తేజ్ జూనియర్ ఎన్టీఆర్ మల్టీ స్టారర్ మూవీగా వచ్చిన ఈ సినిమా బుక్ మై షో ద్వారా కూడా మంచి అడ్వాన్స్ బుకింగ్స్ నమోదు చేసుకుంది. మూడో స్థానంలో తమిళ మూవీ విక్రమ్ నిలిచింది. ఈ సినిమా కూడా సౌత్ ఇండస్ట్రీలో భారీ స్థాయిలో విజయాన్ని సొంతం చేసుకుంది. అయితే విక్రమ్ సినిమా బుక్ మై షో ద్వారా భారీ స్థాయిలోని లాభ పడింది.

ఇక ఈ ప్లాట్ఫారంలో విక్రమ్ సినిమా మూడో స్థానంలో నిలిచింది. ఇక మరో తమిళ మూవీ పొన్నియిన్ సెల్వన్ 1 కూడా భారీ స్థాయిలో కలెక్షన్స్ సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ఇక బుక్ మై షోలో ఈ సినిమాకు సంబంధించిన టికెట్లు భారీగానే అమ్ముడయ్యాయి.

దీంతో నాలుగో స్థానంలో నిలిచింది. బుక్ మై షో లో టాప్ 5 మూవీ గా బ్రాహాస్త్ర నిలిచింది. ఈ సినిమాకు కూడా అడ్వాన్స్ బుకింగ్స్ భారీగానే అందినప్పటికి.. సౌత్ సినిమాల కంటే కూడా హై రేంజ్ లో అయితే అడ్వాన్స్ బుకింగ్స్ నమోదు కాలేదు. మరి వచ్చే ఏడాది బుక్ మై షో కు ఇంకా ఇలాంటి క్రేజ్ దక్కుతుందో చూడాలి.


Click it and Unblock the Notifications











