పవన్ సినిమా కోసం మహేష్ సినిమాను వదులుకున్న టాప్ టెక్నీషియన్
సినిమా ఇండస్ట్రీలో ఒక సినిమా ప్రభావం మరో సినిమాపై పడటం చాలా కామన్. ముఖ్యంగా కొంతమంది టెక్నీషియన్స్ అప్పుడప్పుడు ఒకే సినిమాకు అతుక్కుపోవడం వలన మరో సినిమాను వదిలేసుకోవాల్సి వస్తుంటుంది. ఇక ఇటీవల పవన్ కళ్యాణ్ సినిమా కోసం ఒక మంచి టెక్నీషియన్ మహేష్ బాబు సినిమాను వధులుకోవాల్సి వచ్చిందట.
అసలు మ్యాటర్ లోకి వెళితే పవన్ కళ్యాణ్ ప్రస్తుతం వకీల్ సాబ్ ఫినిష్ చేసే పనిలో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. గత నెలలోనే పూర్తి కావాల్సిన ఈ సినిమా చాలా ఆలస్యంగా షూటింగ్ కు ఎండ్ కార్డ్ వేయబోతోంది. అయితే సినిమాకు వర్క్ చేస్తున్న టాప్ సినిమాటోగ్రాఫర్ పిఎస్.వినోద్ ఇటీవల వేరే ఆఫర్స్ వచ్చినా కూడా ఓకే చెప్పలేకపోయాడు. ఇక మహేష్ బాబు 'సర్కారు వారి పాట' ఆఫర్ కూడా వచ్చింది. ఆ సినిమా చేయడానికి కూడా ఒప్పుకున్నాడు. కానీ ఆ సినిమా షెడ్యూల్ ని యూఎస్ లో ప్లాన్ చేశారు.

దాదాపు 45రోజుల పాటు అమెరికాలోని షూటింగ్ నిర్వహించనున్నారట. దీంతో అటు వెళ్ళడానికి వీలులేక వినోద్ పవన్ సినిమాకె అంకితమయ్యాడు. ఓకేవేళ హైదరాబాద్ లోనే షూటింగ్ జరిగి ఉండి ఉంటే కాస్త డేట్స్ అడ్జస్ట్ చేసుకొని ఆ సినిమాకు వర్క్ చేసేవాడట. మొత్తానికి పవన్ వలన మహేష్ సినిమా అలా మిస్సయ్యిందట. ఇక పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ షూటింగ్ దాదాపు ఏండింగ్ దశకు చేరుకున్నట్లు తెలుస్తోంది. పోస్ట్ ప్రొడక్షన్ పనులను కూడా వీలైనంత త్వరగా పూర్తి చేయాలని చిత్ర యూనిట్ ఒక ప్లాన్ రెడీ చేసుకుంది. కరోనా అదుపులోకి వస్తే సంక్రాంతికి వకీల్ సాబ్ ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications











