Happy birthday Megastar: ఎన్టీఆర్ నుంచి అల్లు అర్జున్ వరకు.. స్పెషల్ ఫొటోలతో బెస్ట్ విషెస్!
టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి అనగానే అభిమానుల్లో ఒక తెలియని ఎనర్జీ కనిపిస్తుంది. కేవలం సినిమాలతోనే కాకుండా తన మంచి మనసుతో కూడా అభిమాను మనసును గెలుచుకున్న మెగాస్టార్ అంటే సినిమా ఇండస్ట్రీలో కూడా అందరికీ ఇష్టమే. నేటి తరం యువ హీరోలు కూడా ఆయనను స్ఫూర్తిగా తీసుకుంటున్నారు. ఇక సినిమా ఇండస్ట్రీలో అగ్ర హీరోల నుంచి యువ హీరోల వరకు చాలా మందికి కూడా నేడు మెగాస్టార్ పుట్టినరోజు సందర్భంగా ప్రత్యేకంగా బర్త్ డే విషెస్ ను అందిస్తున్నారు.. ఒకసారి వారు అందించిన స్పెషల్ బర్త్ డే విషెస్ పై ఒక లుక్కేస్తే ..
రెబల్ స్టార్ విషెస్
రెబల్ స్టార్ ప్రభాస్ ఒకరోజు ముందుగానే మెగాస్టార్ చిరంజీవికి అడ్వాన్ గా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసిన విషయం తెలిసిందే. రెబల్ స్టార్ ఫ్యామిలీ మెగాస్టార్ కుటుంబానికి కూడా ఒక ప్రత్యేకమైన అనుబంధం ఉంది. చిన్నప్పటి నుంచి మెగాస్టార్ ని చూస్తూ పెరిగిన ప్రభాస్.. మెగాస్టార్ అంటే తనకు ఎంతో ఇష్టమైన హీరోగా మారడానికి ఎంతో స్ఫూర్తినిచ్చారు అని భవిష్యత్ తరాలకు కూడా ఆయన స్ఫూర్తిదాయకమని అన్నారు.
జూనియర్ ఎన్టీఆర్
మెగాస్టార్ చిరంజీవి ఫ్యామిలీ కి అలాగే నందమూరి కుటుంబం కూడా ఒక ప్రత్యేకమైన అనుబంధం ఉంది. ముఖ్యంగా హరికృష్ణ తో మెగాస్టార్ చాలా సన్నిహితంగా ఉండేవారు. ఇక ఆయన తనయుడు జూనియర్ ఎన్టీఆర్ చిరంజీవిని ఎంతగానో ఇష్టపడతారు మెగాస్టార్ పుట్టినరోజు సందర్భంగా జూనియర్ ఎన్టీఆర్ ప్రత్యేకంగా విషెస్ అందించాడు. మెగాస్టార్ చిరంజీవి గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు అంటూ ఈ ఏడాది మీకు ఎంత గొప్పది కావాలని కోరుకుంటున్నట్లు ట్వీట్ చేశాడు.
మాస్ మహారాజా రవితేజ
మాస్ మహారాజా రవితేజ కూడా మరోసారి మెగాస్టార్ పై తన అభిమానాన్ని చూపించాడు. నాకు చిరకాలంగా స్ఫూర్తిగా నిలిచే గొప్ప స్టార్ మెగాస్టార్ చిరంజీవి గారు. హ్యాపీ బర్త్డే అన్నయ్య. మీరు ఆయురారోగ్యాలతో హ్యాపీ గా ఉండాలని కోరుకుంటున్నాను.. అని మాస్ రాజా వివరణ ఇచ్చాడు. రవితేజ, మెగాస్టార్ అన్నయ్య సినిమాలు తమ్ముడిగా ఒక పాత్రలో నటించిన విషయం తెలిసిందే.
దగ్గుబాటి హీరోల శుభాకాంక్షలు
వెంకటేష్ దగ్గుబాటి ఈ విధంగా ట్వీట్ చేశాడు. హ్యాపీ బర్త్ డే మై డియర్ చిరంజీవి. మంచి ఆరోగ్యంతో ప్రశాంతంగా ఆనందమైన జీవితాన్ని గడపాలని కోరుకుంటున్నట్లు పేర్కొన్నాడు. అలాగే మరొక దగ్గుబాటి హీరో రానా కూడా మెగాస్టార్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు అందిస్తూ గ్యాంగ్ లీడర్ ఫోటోలు షేర్ చేసుకున్నాడు. హ్యాపీ బర్త్ డే పద్మభూషణ్ మెగాస్టార్ డాక్టర్ చిరంజీవి గారు.. తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎక్కువగా సెలబ్రేట్ చేసుకునే పేరు ఇదే అంటూ ట్వీట్ చేశాడు.
అల్లు అర్జున్ విషెస్..
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కూడా మెగాస్టార్ పై ఉన్న అభిమానాన్ని ప్రత్యేకంగా చాటుకున్నాడు. మన ఏకైక మెగాస్టార్ చిరంజీవి గారు ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అని అల్లు అర్జున్ ట్వీట్ చేశాడు. అంతే కాకుండా మెగాస్టార్ చిరంజీవి పక్కన ఎంతో విధేయతతో ఉన్న ఒక ముఖ్యమైన ఫోటోను కూడా అభిమానులతో షేర్ చేసుకున్నాడు.
Recommended Video
సమంత ఆహా.. విషెస్
సుధీర్ బాబు, సంపత్ నంది, నాగ శౌర్య, గోపీచంద్ మలినేని, దర్శకుడు బాబీ, అనిల్ రావిపూడి, వంశీ పైడిపల్లి వంటి సినీ ప్రముఖులు కూడా మెగాస్టార్ పుట్టినరోజు సందర్భంగా ప్రత్యేకమైన ఫోటోలు షేర్ చేసుకుంటూ శుభాకాంక్షలు తెలియజేశారు. ముఖ్యంగా సమంత ఆహా షోలోని మెగాస్టార్ కు సంబంధించిన ఫోటోను జత చేస్తూ తనదైన శైలిలో బర్త్ డే విషెస్ ను అందించారు.


Click it and Unblock the Notifications











