Friday Movies: ఫ్రైడే ఫీస్ట్.. ఒక్కరోజే 10 సినిమాలు విడుదల.. అందులో చూడాల్సినవి మాత్రం!
2023లో అడుగు పెట్టినప్పటి నుంచి అనేక కొత్త సినిమాలు వచ్చాయి. ప్రతీ వారం అద్భుతమైన సినిమాలు వస్తూ.. సినీ ప్రియులను అలరించడంలో ఎప్పుడూ ముందే ఉంటున్నాయి. ప్రేమికుల దినోత్సవం సందర్భంగా అనేక కొత్త చిత్రాలు విడుదల కాగా.. తాజాగా మరికొన్ని కొన్ని సినిమాలు ప్రేక్షకులను అలరించడానికి రాబోతున్నాయి. ముఖ్యంగా ఈ వారం.. అందులో ఒక్క శుక్రవారం రోజే మొత్తం 10 సినిమాలు విడుదల కానున్నాయి. అయితే ఆ చిత్రాలు ఏవి, అందులో కచ్చితంగా చూడాల్సిన చిత్రాలు ఏవో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
శుక్రవారం రోజు విడుదల కాబోయే సినిమాల్లో సుందర మాస్టర్ ఒకటి. వైవా హర్ష ప్రధాన పాత్రలో వచ్చిన ఈ చిత్రానికి ఆర్ టీ టీం వర్క్స్, గోల్డెన్ మీడియా బ్యానర్‌పై రవితేజ, సుధీర్ కుమార్ కుర్రు నిర్మించిన ఈ సినిమాకు కళ్యాణ్ సంతోష్ దర్శకత్వం వహించాడు. ఈ సినిమా శుక్రవారం రోజు అంటే రేపే విడుదల కాబోతుంది. అలాగే మమ్ముట్టి ప్రధాన పాత్రలో.. బ్లాక్ అండ్ వైట్ కలర్ లో రాబోతున్న బ్రమయుగం చిత్రం కూడా రేపే విడుదల కాబోతుంది. రాహుల్ సదాశివన్ దర్శకత్వంలో రాబోతున్న ఈ చిత్రాన్ని నైట్ షిఫ్ట్ స్టూడియోస్ మరియు YNOT స్టూడియోస్ సంయుక్తంగా నిర్మించాయి. ఈ చిత్రంలో మమ్ముట్టితో పాటు అర్జున్ అశోకన్, సిద్ధార్థ్ భరతన్ నటిస్తున్నారు.

దీపక్ సరోజ్ హీరోగా రాబోతున్న సిద్దార్థ రాయ్ సినిమాను యశ్వసి తెరకెక్కించారు. ఈ సినిమా ఫిబ్రవరి23 అంటే శుక్రవారం రోజు రిలీజ్ అవుతుంది. సినిమాకు ఏ సర్టిఫికేట్ రాగా.. రన్ టైమ్ ను 2.28 నిమిషాలుగా పిక్స్ చేశారు. అలాగే మాస్తు షేడ్స్ ఉన్నయ్ రా అనే సినిమాను కూడా రేపే విడుదల చేయనున్నారు. అభినవ్ గోమఠం, వైశాలి జంటగా రాబోతున్న ఈ సినిమాకు తిరుపతి రావు ఇండ్ల దర్శకత్వం వహించబోతున్నారు.

అలాగే కీర్తి సురేష్, జయం రవి జంటగా రాబోతున్న తాజా సినిమా సైరెన్ చిత్రం కూడా రేపే విడుదల కాబోతుంది. ఆంటోని భాగ్యరాజ్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాలో అనుపమ పరమేశ్వరన్ తో పాటు యోగి బాబు కూడా ప్రధాన పాత్రలో కనిపించనున్నారు. ముఖ్య గమనిక సినిమా కూడా రేపే విడుదల కాబోతుంది. విరన్ ముత్తంశెట్టి, లావణ్య సహుకారా, చిత్రం భాషా, జ్యోతి స్వరూప్ లు ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాలు వేణు మరళీధర్ దర్శకత్వం వహిస్తున్నారు.

అలాగే వ్యూహం, టీటీడీఎస్, 14 డేస్ లవ్, గ్రౌండ్ సినిమాలు కూడా శుక్రవారం రోజే థియేటర్లలో విడుదల కాబోతున్నాయి. అలాగే ఈ వారం విడుదల కాబోతున్న ఈ తెలుగు చిత్రాలకు నేషనల్ మల్టీప్లెక్స్ వాల్లు అదిరిపోయే ఆఫర్ ప్రకటించారు. ముఖ్యంగా హైదరాబాద్ లో రేపు పైన చెప్పిన అన్ని సినిమాలకు కేవలం రూ.112లతో టికెట్ ను ఇవ్వనున్నారు. ఈ ఆఫర్ ను అందిపుచ్చుకుని మీకు నచ్చిన సూపర్ సినిమాలు నేషనల్ మల్టీప్లెక్స్ లలో చూసేయండి. ఫుల్ గా ఎంజాయ్ చేసేయండి.


Click it and Unblock the Notifications











