Valentine's Day: వాలెంటైన్స్ డే రోజు రీరిలీజయ్యే సినిమాలివే.. మొత్తం 10.. చూడాల్సినవి మాత్రం!

ఈ మధ్య కాలంలో అనేక అద్భుతమైన పాత సినిమాలను విడుదల చేస్తున్నారు. కేవలం స్టార్ హీరోల పుట్టిన రోజులు, ఏవైనా స్పెషల్ డేలు ఉన్నప్పుడు మాత్రమే ఆ చిత్రాలను విడుదల చేసేవారు. ఒకప్పుడు అయితే ఇది కూడా లేదు. కానీ ఈ మధ్య చాలా సినిమాలు రీరిలీజ్ అవుతూ సందడి చేస్తున్నాయి. అయితే తాజాగా ప్రేమికుల రోజు సందర్భంగా అనేక సినిమాలను మళ్లీ థియేటర్లలో విడుదల చేస్తున్నారు. ప్రేమికులు అందరూ కలిసి చూసేలా అద్భుతమైన ప్రేమ కథా చిత్రాలను తీసుకు వస్తున్నారు. మొత్తం 10 సినిమాలు ఫిబ్రవరి 14వ తేదీన విడుదల కానున్నాయి. అవేంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

ప్రేమికుల రోజు సందర్భంగా.. సిద్దార్థ్ హీరోగా చేసిన ఓయ్ సినిమాను రీలిరీజ్ చేస్తున్నారు. బేబీ శామిలి హీరోయిన్ గా వచ్చిన ఈ సినిమాను ఆనంద్ రంగా తెరకెక్కించగా.. 2009 జూలై 3న విడుదల అయింది. 10 కోట్లతో నిర్మించిన ఈ సినిమా 43 కోట్లు వసూళ్లు చేసి బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. అలాగే దుల్కర్ సల్మాన్, మృణాల్ థాకూర్ హీరోహీరోయిన్లుగా వచ్చిన సీతా రామం సినిమాను కూడా ఫిబ్రవరి 14న మళ్లీ విడుదల చేయబోతున్నారు. హను రాఘవపూడి డైరెక్షన్ లో వచ్చిన ఈ సినిమాను 30 కోట్లతో నిర్మించగా.. 98 కోట్ల వరకూ కలెక్షన్లు సాధించి సెన్సేషన్ క్రియేట్ చేసింది.

Total 10 Movies Rereleased on Valentiness Day Check Details

ఇక సూర్య సన్ ఆఫ్ కృష్ణన్ సినిమా కూడా ఫిబ్రవరి 14న విడుదల కాబోతుంది. సిమ్రాన్, సమీరా రెడ్డి, సూర్యా శివకుమార్ లు ప్రధాన పాత్రలో వచ్చిన ఈ చిత్రం 2008లో విడుదలై సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఇప్పటికీ చాలా మందికి ఆల్ టైమ్ ఫేవరెట్ గా నిలిచింది. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా చేసిన తొలిప్రేమ సినిమాను కూడా ప్రేమికుల రోజు సందర్భంగా రీలిరీజ్ చేయనున్నారు. ఎ కరుణాకరన్ దర్శకత్వంలో 1998లో వచ్చిన ఈ సినిమాకు ఇప్పటికీ సెపరేట్ ఫ్యాన్స్ బేస్ ఉంది. సూపర్ హిట్ లవ్ స్టోరీ కావడంతో రీరిలీజ్ చేయనున్నారు.

అలాగే ఆనంద్‌ దేవరకొండ, వైష్ణవి చైతన్య, విరాజ్ అశ్విన్ ప్రధాన పాత్రల్లో నటించిన బేబీ సినిమాను కూడా ఫిబ్రవరి 14న విడుదల చేయబోతున్నారు. సాయి రాజేశ్ నీలం దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్టుగా నిలిచింది. జేమ్స్ కామెరూన్ డైరెక్షన్ లో లియోనార్డో డికాప్రియో, కేట్ విన్ స్లెట్ హీరోహీరోయిన్లుగా వచ్చిన టైటానిక్ సినిమాను కూడా ప్రేమికుల రోజు సందర్భంగా విడుదల చేయబోతున్నారు. 1997లో వచ్చిన ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా సెన్సేషన్ క్రియేట్ చేసింది. అద్భుతమైన ప్రేమ కథా చిత్రం కావడంలో ఫిబ్రవరి 14వ రిలీజ్ చేయనున్నారు.

Total 10 Movies Rereleased on Valentiness Day Check Details

ఆదిత్య చోప్రా డైరెక్షన్ లో చ్చిన దిల్ వాలే దుల్హనియా లే జాయేంగే సినిమాను కూడా ఫిబ్రవరి 14న రీరిలీజ్ చేయనున్నారు. షారుఖ్ ఖాన్ హీరోగా, కాజోల్ హీరోయిన్ గా వచ్చిన ఈ సినిమా సూపర్ డూపర్ హట్ గా నిలిచింది. ఇంతియాజ్ అలీ దర్శకత్వంలో వచ్చిన జబ్ వీ మెట్ సినిమాను కూడా వాలెంటైన్స్ డే సందర్భంగా మళ్లీ విడుదల చేయబోతున్నారు. 2007లో విడుదల అయిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్టుగా నిలిచింది.

Total 10 Movies Rereleased on Valentiness Day Check Details

యష్ చోప్రా దర్శకత్వంలో షారుక్ ఖఆన్, ప్రీతీ జింటా, రాణీ ముఖర్జీ, మనోజ్ బాజ్ పేయీలూ ప్రధాన పాత్రల్లో వచ్చిన వీర్ జారా సినిమాను రీరిలీజ్ చేయబోతున్నారు. 2004లో విడుదలైన ఈ చిత్రం 25 కోట్లతో నిర్మించగా.. 94 కోట్లకు పైగా వసూళ్లు సాధించి బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. షారుక్ ఖాన్ హీరోగా, ఐశ్వర్యా రాయ్ హీరోయిన్ గా వచ్చిన మహబ్బతీన్ సినిమాను కూడా ఫిబ్రవరి 14న రీరిలీజ్ చేయనున్నారు. 2000లలో వచ్చిన ఈ సినిమాను ఆదిత్య చోప్రా తెరకెక్కించగా.. బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X