February Release Movies: ఫిబ్రవరిలో మొత్తం 14 చిత్రాలు విడుదల.. అందులో చూడాల్సినవి మాత్రం!
2024 సంవత్సరం వచ్చినప్పటి నుంచి పెద్ద ఎత్తున కొత్త చిత్రాలు విడుదల అవుతున్నాయి. న్యూ ఇయర్, సంక్రాంతి పండుగ సందర్భంగా అనేక చిత్రాలు వచ్చాయి. ఇక ఫిబ్రవరిలో ఎలాంటి పండుగల లేకపోయినా.. చాలానే చిత్రాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. ముఖ్యంగా 14 తెలుసు సినిమాలు రాబోతున్నాయి. అందులో చాలా పెద్ద పెద్ద సినిమాల నుంచి చిన్న చిత్రాల వరకు ఉండగా.. అవేవి, అందులో కచ్చితంగా చూడాల్సిన చిత్రాలు ఏవో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
సీనియర్ నటులు మధుబాల, ఆదిత్య మీనన్, శుభలేక సుధాకర్ కాంబోలో రాబోతున్న ఈ సినిమా ఫిబ్రవరి 2వ తేదీన విడుదల కాబోతుంది. సైకలాజికల్ థ్రిల్లర్ గా రూపొందుతున్న ఈ సినిమాపై పెద్ద ఎత్తున అంచనాలు నమోదు అయ్యాయి. అలాగే సుహాస్ ప్రధాన పాత్రలో వస్తున్న అంజాజీపేట మ్యారేజీ బ్యాండ్ సినిమా కూడా ఫిబ్రవరి 2వ తేదీన రిలీజ్ కానుంది. ఇది కూడా కచ్చితంగా చూడాల్సిన సినిమానే. మరోవైపు కిస్మత్, బూట్ కట్ బాల రాజు, హ్యాపీ ఎండింగ్ సినిమాలు కూడా ఫిబ్రవరి 2వ తేదీనే విడుదల కానుంది.

జీవా ప్రధాన పాత్రలో వస్తున్న.. వైఎస్ జగన్ యాత్ర 2 సినిమా ఫిబ్రవరి 8వ తేదీన విడుదల కాబోతుంది. అలాగే మాస్ మహారాజా హీరోగా వస్తున్న ఈగల్ సినిమా ఫిబ్రవరి 9వ తేదీన విడుదల కానుంది. ఈ రెండు సినిమాలపై ఇప్పటికే భారీ బజ్ క్రియేట్ అయింది. ఒక ఏపీ రాష్ట్ర రాజకీయాలపై ప్రభావం చూపేది కాగా.. రెండో సినిమా రవితేజది. ఇలా ఈ రెండు చిత్రాలను చూసేందుకు ప్రేక్షకులు తెగ ఆసక్తి కనబరుస్తున్నారు. ఐశ్వర్యా ధనుష్ డైరెక్షన్ లో రజినీ కాంత్ హీరోగా రాబోతున్న చిత్రం లాల్ సలామ్. ఈ సినిమా కూడా ఫిబ్రవరి 9వ తేదీనే విడుదల కానుంది.

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా రాబోతున్న తాజా సినిమా ఆపరేషన్ వాలెంటైన్. ఈ చిత్రం ఫిబ్రవరి 16వ తేదీన థియేటర్లలో గ్రాండ్ గావిడుదల కాబోతుంది. అలాగే అదేరోజు సందీప్ కిషన్ హీరోగా చేసిన ఊరు పేరు భైరవకోన కూడా విడుదల కానుంది. ఈ రెండు చిత్రాలపై కూడా ఇప్పటికే పెద్ద ఎత్తున అంచనాలు నమోదు అయ్యాయి. చాలా మంది ఈ సినిమాలను చూసేందుకు తెగ ఆసక్తి కనబరుస్తున్నారు. ఈ రెండు మాత్రమే కాకుండా మరో రెండు సినిమాలు కూడా ఆరోజు విడుదల అవుతున్నాయి. అవే ఒకటి సందరం మాస్టర్, మరోటి మేడమ్ వెబ్.


అలాగే ఫిబ్రవరి 23వ తేదీ తిరగబడరా సామి అనే చిత్రం రిలీజ్ కానుంది. రాజ్ తరుణ్, మాల్వీ మల్హోత్ర ప్రధాన పాత్రలో ఎస్.ఎస్ రవికుమార్ చౌదరి తరెకెక్కించిన ఈ సినిమాను గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నారు. సుభాష్ చంద్ర దర్ళకత్వంలో వరల్డ్ ఆఫ్ జెహెచ్ఎస్పీ సినిమాను ఫిబ్రవరి 29వ తేదీన రిలీజ్ చేయనున్నారు. ఇలా రెండో నెలలో మొత్తం 14 చిత్రాలు విడుదల కానున్నాయి.


Click it and Unblock the Notifications











