Tollywood: ఆగస్టు నెలలో సినిమాల జాతర.. ఏకంగా 14 సినిమాల మధ్య పోటీ!

చాలా రోజుల తరువాత మళ్ళీ సినిమా ఇండస్ట్రీలో వరుసగా కొత్త చిత్ర చిత్రాలు విడుదల అవుతున్నాయి. అయితే సక్సెస్ రేటు మాత్రం గతంలో కంటే చాలా తగ్గిపోయింది. ఓటీటీ ప్రభావం ఎక్కువైనా తరువాత ఆడియెన్స్ కంటెంట్ ఎంతో కొత్తగా ఉంటే గాని సినిమాలు చూసేందుకు ఇష్టపడడం లేదు. అందులోనూ టిక్కెట్ల రేట్లు పెరగడం కూడా కొంత మైనస్ అని చెప్పవచ్చు. యావరేజ్ టాక్ అందుకున్న సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్ద దారుణమైన ఫలితాన్ని అందుకుంటున్నాయి. ఇక ఆగస్టు లో ఒకేసారి అత్యధిక సినిమాలు విడుదల అవుతున్నాయి. ఇక ఆ వివరాల్లోకి వెళితే..

మొదట్లోనే పెద్ద సినిమాలు

మొదట్లోనే పెద్ద సినిమాలు

స్టార్స్ తో సంబంధం లేకుండా ఇప్పుడు కేవలం సినిమా టిక్కెట్ కు పెట్టిన డబ్బులకు తగ్గట్టుగా ఎంటర్టైన్మెంట్ దొరుకుతుందా లేదా అనేది మాత్రమే చూస్తున్నారు. ఇక ఆగస్టు నెలలో అయితే ఒకేసారి 14 సినిమాలు విడుదల కాబోతున్నాయి. అందులో కొన్ని సినిమాలపై పాజిటివ్ వైబ్రేషన్ క్రియేట్ అయ్యాయి. ముఖ్యంగా ఆగస్టు 5వ తేదీన రెండు విభిన్నమైన సినిమాలు రానున్నాయి. దుల్కర్ సల్మాన్ సీతారామం అలాగే కళ్యాణ్ రామ్ బాంబిసార భారీ స్థాయిలోనే రానున్నాయి. మేయిన్ గా బాంబిసారపై అంచనాలు అయితే గట్టిగానే ఉన్నాయి.

కార్తికేయ 2

కార్తికేయ 2

ఆగస్టు 11వ తేదీన ఆమిర్ ఖాన్ నటించిన లాల్ సింగ్ చద్దా తెలుగులో కూడా విడుదల కానుంది. నాగచైతన్య ఈ సినిమాలో ఒక.ముఖ్యమైన పాత్రలో నటించిన విషయం తెలిసిందే. ఇక తెలుగులో ఓ వర్గం వారి ఫోకస్ ఎక్కువగా నిఖిల్ సిద్దార్థ్ నటించిన కార్తికేయ 2 సినిమాపైనే ఉంది. అడ్వెంచర్ థ్రిల్లర్ గా రానున్న ఈ సినిమా ఆగస్టు 12న విడుదల కానుంది. ఇక అదే రోజు నితిన్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ మాచర్ల నియోజకవర్గం కూడా విడుదల కానుంది.

ఒకేరోజు 4 సినిమాలు

ఒకేరోజు 4 సినిమాలు

కార్తీ నటించిన విరుమాన్ సినిమా ఆగస్టు 12న రానుండగా బెల్లకొండ చిన్నబ్బాయి మొదటి సినిమా స్వాతిముత్యం ఆగస్టు 13న రానుంది. ఇక ఆది సాయి కుమార్ చాలా రోజుల తరువాత చేసిన తీస్ మార్ ఖాన్ ఆగస్టు 19న రానుంది. అదే రోజు వాంటెడ్ పండుగాడు, మాటేరాని మౌనమిది, కమిట్మెంట్ అనే మరికొన్ని సినిమాలు విడుదల కానున్నాయి.

ఆగస్టు బిగ్గెస్ట్ మూవీ లైగర్

ఆగస్టు బిగ్గెస్ట్ మూవీ లైగర్

ఇక రౌడి ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న విజయ్ దేవరకొండ పాన్ ఇండియా మూవీ లైగర్ ఆగస్టు 25న విడుదల కానుంది. ఈ సినిమాపై అంచనాలు ఏ స్థాయిలో ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆగస్టు లో విడుదలవుతున్న అతిపెద్ద సినిమా ఇదే కావడం విశేషం. విజయ్ కెరీర్ లోనే కాకుండా పూరి జగన్నాథ్ కెరీర్ మొత్తంలో కూడా ఇదే బిగ్గెస్ట్ మూవీగా విడుదల కాబోతోంది.

 మరో రెండు చిన్న సినిమాలు

మరో రెండు చిన్న సినిమాలు

ఇక ఆగస్టు నెలలో విడుదల కావాల్సిన మరికొన్ని చిన్న సినిమాలు మిడియం బడ్జెట్ సినిమాలు పోటీని తట్టుకోలేక సెప్టెంబర్ కు షిఫ్ట్ అయ్యాయి. ఇక ఆగస్టు చివరి వారంలో ఒక రెండు చిన్న సినిమాలు వాటి అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నాయి. ఒకటి సత్యం రాజేష్ కళాపురం కాగా.. మరొకటి తమిళ్ డబ్ మూవీ పిశాచి 2. మరి ఈ రెండు సినిమాలు ఎంతవరకు సక్సెస్ అవుతాయో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X