సినీ ప్రియులకు ఫ్రైడే ఫీస్ట్.. ఒక్కరోజే 8 సినిమాలు రిలీజ్.. అందులో చూడాల్సినవి మాత్రం!
సమ్మర్ స్టార్ట్ అయినప్పటి నుంచి అనేక అద్బుతమైన సినిమాలు థియేటర్లలోకి వస్తూ అలరిస్తూనే ఉన్నాయి. ముఖ్యంగా పెద్ద ఎత్తున సినిమాలు సందడి చేస్తున్నాయి. ఇప్పటికే పండుగల పూట అనేక అదిరిపోయే చిత్రాలు థియేటర్లలోకి రాగా.. ఈనెల ఎలాంటి పడండుగలు లేకపోయనా సరికొత్త చిత్రాలు థియేటర్లలోకి వచ్చేస్తున్నాయి. ముఖ్యంగా మే 2వ వారమే మొత్తం 8 సినిమాలు రాబోతున్నాయి. ఇందులో ఏడు చిత్రాలు కొత్తవి కాగా.. ఒకటి మాత్రం రీరిలీజ్ అయితే మనం ఈ వారం కచ్చితంగా చూడాల్సిన చిత్రాలు ఏవో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
టీవీ5 మూర్తి దర్శకత్వంలో నారా రోహిత్ హీరోగా రాబోతున్న అద్భుతమైన సినిమానే ప్రతినిధి 2. ప్రతినిధి చిత్రానికి సీక్వెల్ గా రాబోతున్న ఈ చిత్రాన్ని మే 10వ తేదీ అంటే రేపే విడుదల చేయబోతున్నారు. ఈ క్రేజీ మూవీని చూసేందుకు అనేక మంది ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. వీవీ గోపాల కృష్ణ దర్శకత్వంలో సత్యదేవ్ హీరోగా రాబోతున్న క్రేజీ సినిమానే క్రిష్ణమ్మ. అనాథలుగా పెరిగిన ముగ్గురు అబ్బాయిల మధ్య బంధాన్ని ఈ సినిమాలో చూపిస్తుండగా.. మే 10వ తేదీన ఈ చిత్రం విడుదల కాబోతుంది. చూడాలి మరి రేపే రిలీజ్ కాబోతున్న ఈ సినిమా ఏ రేంజ్ లో అలరిస్తుందనేది.

అజయ్ నాగ్ దర్శకత్వంలో సురభి ప్రభావతి, మోహన్ భగత్, రవింద్ర విజయ్ లు ప్రధాన పాత్రల్లో రాబోతున్న సరికొత్త సినిమానే ఆరంభం. అయితే ఈ సినిమా కూడా మే 2వ వారం.. 10వ తేదీ రోజు విడుదల కాబోతుంది. అలాగే సాయి కుమార్, వినయ్ పనిగర్తి, దీప్తి వర్మ, చర్మిష్మా శ్రీకర్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న లక్ష్మీ కటాక్షం సినిమా కూడా రేపే విడుదల కాబోతుంది. సూర్య యక్కలూరు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం మే 10వ తేదీన వస్తుండగా.. అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

ఇవి మాత్రమే కాకుండా వాలీ మోహన్ దాస్ మురుగన్ దర్శకత్వం వహిస్తున్న సత్య సినిమాలో ప్రార్థన సందీప్, హమరేష్ సతీష్, ఆడుకలం మురుగదాస్ వంటి వాళ్లు ప్రధాన పాత్రల్లో నటించబోతున్నారు. అయితే ఈ క్రేజీ మూవీ కూడా మే 10వ తేదీనే విడుదల కాబోతుంది. అలాగే రేణిగుంట నర్సింగ్ దర్శకత్వంలో బ్రహ్మాచారి అనే సినిమా వస్తోంది. ఇందులో గుంట మల్లేశం, సిరి రావులాచారి, జబర్దస్త్ నవీన్, కిసుపిట్ట స్వప్న, రోష్ని రజాక్, కలపల్లె లక్ష్మిలు ప్రధాన పాత్రల్లో కనిపించనున్న ఈ సినిమా మే 10వ తేదీన విడుదల కాబోతుంది. అంటే రేపే థియేటర్లలోకి రాబోతుంది.

కింగ్‌డమ్ ఆఫ్ ది ప్లానెట్ ఆఫ్ ది ఏప్స్ అనే సినిమా కూడా రేపే అంటే మే 10వ తేదీన రిలీజ్ కాబోతుంది. వెస్ బాల్ దర్శకత్వం వహించబోతున్న ఈ చిత్రాన్ని జోష్ ఫ్రైడ్‌మాన్ రచించారు. ఈ హాలీవుడ్ సినిమా కూడా రేపే వడుదల కాబోతుంది. అలాగే 2010లో రానా హీరోగా వచ్చిన లీడర్ సినిమా కూడా మే 10వ తేదీన రీరిలీజ్ కాబోతుంది. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ఎలక్షన్స్ టైమ్ లో రీరిలీజ్ కాబోతుండడంతో ఎన్నికలపై ఏదైనా ప్రభావం పడొచ్చేమోనని చాలా మంది భావిస్తున్నారు. చూడాలి మరి ఈ క్రేజీ చిత్రాల్లో ఏవి థియేటర్ల వద్ద పెద్ద ఎత్తున సందడి చేయనున్నాయనేది.


Click it and Unblock the Notifications











