This Week Theatrical Releases: ఈవారం థియేటర్లలోకి 9 సినిమాలు.. అందులో చూడాల్సినవి మాత్రం!
కొత్త ఏడాదిలోకి అడుగు పెట్టినప్పటి నుంచి అనేక అద్బుతమైన సినిమాలు థియేటర్లలోకి వస్తూ అలరిస్తూనే ఉన్నాయి. ముఖ్యంగా పెద్ద ఎత్తున సినిమాలు సందడి చేస్తున్నాయి. ఇప్పటికే న్యూ ఇయర్, సంక్రాంతి పండుగ సందర్భంగా అనేక చిత్రాలు వచ్చాయి. ఇక ఫిబ్రవరిలో ఎలాంటి పండుగలు లేకపోయినా.. చాలానే చిత్రాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. ముఖ్యంగా మొదటి వారంలోనే మొత్తం 9 తెలుగు సినిమాలు రాబోతున్నాయి. ఇందులో చాలా వరకు చిన్న చిత్రాలు మాత్రమే ఉండగా.. అవేవి, అందులో కచ్చితంగా చూడాల్సిన చిత్రాలు ఏవో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
సీనియర్ నటులు మధుబాల, ఆదిత్య మీనన్, శుభలేక సుధాకర్ కాంబోలో రాబోతున్న "గేమ్ ఆన్" సినిమా ఫిబ్రవరి 2వ తేదీన విడుదల కాబోతుంది. సైకలాజికల్ థ్రిల్లర్ గా రూపొందుతున్న ఈ సినిమాపై పెద్ద ఎత్తున అంచనాలు నమోదు అయ్యాయి. ఈ సినిమాకు సెన్సార్ బోర్డు యూ/ఏ సర్టిఫికేట్ ఇవ్వగా... రన్ టైమ్ ను 2 గంటల 20 నిమిషాలకు ఫిక్స్ చేసింది. అలాగే సుహాస్ ప్రధాన పాత్రలో వస్తున్న అంజాజీపేట మ్యారేజీ బ్యాండ్ సినిమా కూడా ఫిబ్రవరి 2వ తేదీన రిలీజ్ కానుంది. ఇది కూడా కచ్చితంగా చూడాల్సిన సినిమానే. ఈ చిత్రానికి సెన్సార్ బోర్డు యూ/ఏ సర్టిఫికేట్ ఇవ్వగా... రన్ టైమ్ ను 2 గంటల 12 నిమిషాలకు ఫిక్స్ చేసింది.

మరోవైపు అభినవ్ గోమటం, అవసరాల శ్రీనివాస్, నరేష్ అగస్త్య, రియా సుమన్ ప్రధాన పాత్రల్లో వస్తున్న కిస్మత్ సినిమాను కూడా ఫిబ్రవరి 2వ తేదీనే విడుదల చేయబోతున్నారు. శ్రీనాథ్ బాదినేని దర్శకత్వం వహించిన ఈ సినిమాకు సెన్సార్ బోర్టు యూ సర్టిఫికేట్ ఇవ్వగా... రన్ టైమ్ ను 2 గంటల 8 నిమిషాలకు ఫిక్స్ చేసింది. అలాగే ఫిబ్రవరి మొదటి వారంలోని శుక్రవారం రోజు అంటే రెండో తేదీ రోజే హ్యాపీ ఎండింగ్ అనే సినిమాను కూడా రిలీజ్ చేయనున్నారు. యష్ పూరి హీరోగా రాబోతున్న ఈ సినిమాకు కౌశిక్ భీమిడి దర్శకత్వం వహించారు. ఈ సినిమాకు సెన్సార్ బోర్డు యూ/ఏ సర్టిఫికేట్ ఇవ్వగా.. రన్ టైమ్ ను 2 గంటల 26 నిమిషాలకు ఫిక్స్ చేశారు.

మరోవైపు బిగ్ బాస్ కంటెస్టెంట్ సోహెల్ హీరోగా వస్తున్న తాజా సినిమా బూట్ కట్ బాలరాజు. ఈ సినిమాను కూడా ఫిబ్రవరి 2వ తేదీనే విడుదల చేయనున్నారు. ఈ చిత్రానికి సెన్సార్ బోర్డు యూ/ఏ సర్టిఫికేట్ ఇవ్వగా.. రన్ టైమ్ ను 2 గంటల 24 నిమిషాలకు ఫిక్స్ చేశారు. లక్ష చదలవాడ హీరోగా విక్రాంత్ శ్రీనివాస్ దర్శకత్వంలో రాబోతున్న తాజా సినిమానే ధీర. ఈ సినిమా కూడా ఫిబ్రవరి 2వ తేదీనే తియేటర్లలోకి రాబోతుంది. ఈ చిత్రానికి సెన్సార్ బోర్డు యూ/ఏ సర్టిఫికేట్ ఇవ్వగా.. రన్ టైమ్ ను 1 గంటల 58 నిమిషాలకు ఫిక్స్ చేశారు.

మణిసాయి తేజ, రేఖా నిరోషా జంటగా రాబోతున్న సినిమా మెకానిక్. ఈ సినిమా కూడా శుక్రవారం రోజే విడుదల కాబోతుంది. ఈ సినిమాకి సెన్సార్ బోర్డు యూ/ఏ సర్టిఫికేట్ ఇవ్వగా.. రన్ టైమ్ ను 1 గంటల 58 నిమిషాలకు ఫిక్స్ చేశారు. అలాగే కార్తీక్ రాజు హీరోగా రాబోతున్న తాజా సినిమా ఐ హేట్ యూ కూడా ఫిబ్రవరి 2వ తేదీన థియేటర్లలోకి రాబోతుంది. ఈ చిత్రానికి సెన్సార్ బోర్డు యూ/ఏ సర్టిఫికేట్ ఇవ్వగా.. రన్ టైమ్ ను 1 గంటల 57 నిమిషాలకు ఫిక్స్ చేశారు. అలాగే అర్వి అనే మరో బోల్డ్ సినిమా శుక్రవారం రోజు థియేటర్లలో సందడి చేసేందుకు సిద్ధమైంది. ఈ చిత్రానికి సెన్సార్ బోర్డు ఏ సర్టిఫికేట్ ఇవ్వగా.. 1 గంట 50 నిమిషాల రన్ టైమ్ ను ఫిక్స్ చేసింది.


Click it and Unblock the Notifications











