సినీ ప్రియులకు ఫ్రైడే ఫీస్ట్.. ఒక్కరోజే 4 థ్రిల్లర్ చిత్రాలు రిలీజ్.. అందులో చూడాల్సినవి మాత్రం!
ఈ మధ్య కాలంలో అనేక అద్భుతమైన సినిమాలు థియేటర్లలోకి వస్తూ అలరిస్తూనే ఉన్నాయి. ముఖ్యంగా పెద్ద ఎత్తున సినిమాలు సందడి చేస్తున్నాయి. ఇప్పటికే వేసవి కాలం సందర్భంగా అనేక చిత్రాలు వచ్చాయి. ప్రస్తుతం ఎలాంటి పండుగలు లేకపోయినా.. చాలానే చిత్రాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. ముఖ్యంగా మే 5వ వారంలోనే మొత్తం 4 తెలుగు సినిమాలు రాబోతున్నాయి. ఇందులో చాలా వరకు థ్రిల్లర్ చిత్రాలు మాత్రమే ఉండగా.. అవేవి, అందులో కచ్చితంగా చూడాల్సిన చిత్రాలు ఏవో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
విశ్వక్ సేన్ హీరోగా చేయబోతున్న గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమా రాబోతుంది. మే 31వ తేదీన అంటే రేపే థియేటర్లలో గ్రాండ్ గా విడుదల కాబోతున్న ఈ సినిమాను శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ బ్యానర్‌పై బ్యానర్‌పై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించారు. అలాగే ఈ సినిమాకు కృష్ణ చైతన్య దర్శకత్వం వహించాడు. విశ్వక్‌సేన్, నేహాశెట్టి, అంజలి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాపై పెద్ద ఎత్తునే అంచనాలు నమోదు అయ్యాయి. చూడాలి మరి ఈ మూవీ ఈ రేంజ్ లో హిట్ కొట్టబోతుందనేది.

ఆనంద్ దేవరకొండ హీరోగా రాబోతున్న క్రేజీ మూవీయే గం గం గణేశా. ఈ సినిమాకు ఉదయ్ బొమ్మిశెట్టి దర్శకత్వం వహించగా.. ఆనంద్ దేవరకొండ, ప్రగతి శ్రీవాస్తవ, మరియు నయన్ సారిక ప్రధాన పాత్రలలో నటించబోతున్నారు. వీరితో పాటు ఇమ్మాన్యుయేల్, వెన్నెల కిషోర్, రాజ్ అర్జున్, సత్యం రాజేష్ మరియు పలువురు సహాయక పాత్రల్లో కనిపించనున్నారు. చైతన్ భరద్వాజ్ సంగీతం సమకూర్చగా, ఆదిత్య జవ్వాది సినిమాటోగ్రఫీ అందించారు. అలాగే కార్తీక శ్రీనివాస్.ఆర్ ఎడిటర్ గా, హైలైఫ్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై కేదార్ సెలగంశెట్టి, వంశీ కారుమంచి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రేపే విడుదల కాబోతున్న ఈ సినిమాపై కూడా పెద్ద ఎత్తునే అంచనాలు నమోదు అయ్యాయి.

ప్రశాంత్ రెడ్డి దర్శకత్వంలో కార్తికేయ హీరోగా రాబోతున్న సరికొత్త సినిమానే భజే వాయు వేగం. ఈ సినిమాలో కార్తికేయ సరసన ఐశ్వర్య మీనన్ హీరోయిన్ గా నటించబోతుంది. అలాగే రాహుల్ టైసన్, తనికెళ్ల భరణి, రవిశంకర్, శరత్ లోహిత్స్వాలు ప్రముఖ పాత్రల్లో కనిపించబోతున్నారు. కపిల్ కుమార్ నేపథ్య సంగీతం అందించగా, రాధన్ పాటలు సమకూర్చారు. ఆర్‌డి రాజశేఖర్ సినిమాటోగ్రఫీ అందించారు, అలాగే సత్య జి ఎడిట గా చేయగా.. యువి కాన్సెప్ట్స్ బ్యానర్ పై ఈ సినిమాను నిర్మించారు. మే 31వ తేదీన థియేటర్లలో గ్రాండ్ గా విడుదల కాబోతుందీ సినిమా.
సూర్య కాతిర్ కక్కల్కర్, కే కార్తికేయన్ లు దర్శకత్వం వహించిన రీసెంట్ మూవీయే హిట్ లిస్ట్. గౌతమ్ వాసుదేవ్ మీనన్, ఆర్ శరత్ కుమార్, సముద్రఖనిలు ప్రధాన పాత్రల్లో నటించి మెప్పిచిన ఈ సినిమా రేపే విడుదల కాబోతుంది. అలాగే విజయ్ కనిష్క, రెడిన్ కింగ్ స్లే, స్మృతి వెంకట్, ఐశ్వర్యా దత్, మనీష్ కాంత్, సితార, అనుపమ కుమార్, రామచంద్రన్ దురైరాద్ లు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. అయితే ఈ క్రేజీ మూవీ రేపే విడుదల కాబోతుంది. మే 31వ తేదీన థియేటర్లలో గ్రాండ్ గా విడుదల కాబోతుంది. చూడాలి మరి ఈ సినిమా ఏ రేంజ్ లో హిట్ కొట్టబోతుందనేది.


Click it and Unblock the Notifications











