August 15th 2024: అందరి కళ్లు ఆరోజుపైనే.. ఒకే రోజు ఏడు పెద్ద సినిమాల విడుదలకు ప్లాన్!

ఈ ఏడాది ప్రారంభం అయినప్పటి నుంచి ఎన్నెన్నో అద్భుతమైన సినిమాలు విడుదల అవుతూనే ఉన్నాయి. ముఖ్యంగా న్యూ ఇయర్ సందర్భంగా చాలా సినిమాలు రాగా.. ఆ తర్వాత సంక్రాంతి పండుగకు మరిన్ని చిత్రాలు థియేటర్లలో సందడి చేశాయి. థియేటర్ల దొరక్క కొన్ని సినిమాలు వాయిదా పడగా.. అవి కూడా ఫిబ్రవరిలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. ఇదంతా ఇలా ఉండగా.. మరో ఏడు పెద్ద సినిమాలు.. దేశం అంతా ఎదురు చూస్తున్న సినిమాలు ఆగస్టు 15వ తేదీన విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. అవేంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

2024 ఆగస్టు 15వ తేదీన ఏడు స్టార్ హీరోల సినిమాలు రాబోతున్నాయి. వాటిలో ఏ ఒక్క సినిమా కూడా వెనక్కి తగ్గే అవకాశం లేదు. మురి కచ్చితంగా ఆరోజే వచ్చే చిత్రాలు ఏవో మనం ఇప్పుడు చూద్దాం. ముందుగా స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా వస్తున్న పుష్ప 2 సినిమాను ఈ ఏడాది ఆగస్టు 15వ తేదీన విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ప్రపంచం అంతా ఎదురు చూస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలే నమోదు అయ్యాయి. ఈ చిత్రం విడుదల తేదీనీ మార్చుకునే అవకాశమే లేదని టాక్ నడుస్తోంది.

Total Seven Films Aiming For A Single Relase Date of August 15th 2024 Check Details

మరోవైపు RRR సినిమా తర్వాత జూనియర్ ఎన్టీఆర్ హీరోగా చేస్తున్న దేవర సినిమా కూడా ఆగస్టు 15వ తేదీన విడుదల చేయాలని చిత్రబృందం భావిస్తోందట. ఏప్రిల్ లోనే ఈ సినిమా విడుదల చేయాలని ప్లాన్ చేసినప్పటికీ.. ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు ఉండడంతో ఈ సినిమా విడుదల తేదీని ఆగస్టు 15కు మార్చినట్లు తెలుస్తోంది. అలాగే న్యాచురల్ స్టార్ నాని హీరోగా రాబోతున్న సరిపోదా శనివారం సినిమాను కూడా పంద్రాగస్టుకే విడుదల చేయాలని మూవీ టీం భావిస్తోంది.

Total Seven Films Aiming For A Single Relase Date of August 15th 2024 Check Details

ఇక బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ హీరోగా, అజయ్ దేవగన్, టైగర్ ష్రాఫ్, రణ్ వీర్ సింగ్, దీపికా పదుకొమఎ, కరీనా కపూర్ ఖాన్ ల కాంబోలో వస్తున్న సింగ్ 3 కూడా ఆగస్టు 15వ తేదీనే విడుదల కాబోతుందని తెలుస్తోంది. ది గ్రేట్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో కమల్ హాసన్ హీరోగా రాబోతున్న భారతీయుడు 2 సినిమాను కూడా పంద్రాగస్టుకే విడుదల చేయనున్నట్లు టాక్ నడుస్తోంది. ఈ సినిమాలో ప్రియా భవానీ శంకర్, నెడుమూడి వేణు, నయనతార, కాజల్ అగర్వాల్, వివేక్ వంటి వాళ్లు ఈ సినిమాలో నటిస్తున్నారు.

Total Seven Films Aiming For A Single Relase Date of August 15th 2024 Check Details

మరోవైపు సూర్య ప్రధాన పాత్రలో శివ దర్శకత్వంలో రాబోతున్న కంగువా సినిమాను కూడా ఆగస్టు 15వ తేదీకి విడుదల చేస్తే బాగుంటుందని చిత్ర బృందం అనుకుంటుందట. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించకపోయినప్పటికీ ఆ రోజు అయితేనే బాగుంటుందని అనుకుంటున్నారట. అలాగే కమల్ హాసన్ ప్రధాన పాత్రలో టీజే జ్ఞానవేల్ దర్శకత్వంలో వస్తున్న వెట్టయన్ సినిమాను కూడా 2024 పంద్రాగస్టుకే రిలీజ్ చేయాలని అనుకుంటున్నారట. ఇన్ని పెద్ద సినిమాలు ఆగస్టు 15 కోసమే చూస్తుండగా.. ఏయే చిత్రాలు ఆ రోజు విడుదల అవుతాయి, మరే సినిమాలు రిలీజ్ డేట్ ను మార్చుకుంటాయో ముందు ముందు చాడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X