మలయాళంలో 130 కోట్లు కొల్లగొట్టిన 2018.. తెలుగులో రిలీజ్ ఎప్పుడంటే?
ఒక భాషలో సూపర్ హిట్ అయినా చిత్రాన్ని మరిన్ని భాషల్లో విడుదల చేయడం చాల పరిపాటి అయిపొయింది నేటి ట్రెండ్ లో . ఇక మన తెలుగు సినీ ప్రేక్షకులు అయితే భాషతో సంబంధం లేకుండా కంటెంట్ బాగుంటే సినిమాని ఆదరించడం కొత్తేమీకాదు. కాంతారా అనే కన్నడ చిత్రాన్ని ఎంత పెద్ద విజయవంతం చేసారో అందరికి తెలిసిందే.
కంటెంట్ బాగుంటే ఏ భాషలో రూపొందిన సినిమానైనా తెలుగు ప్రేక్షకులు ఆదరిస్తారనే విషయం ఇటీవల కాలంలో ఎన్నో సినిమాలు నిరూపించాయి. తాజాగా కాంతారా, కేజీఎఫ్, విడుదల లాంటి సినిమాలు ప్రేక్షకులకు మంచి అనుభూతిని పంచాయి. కేరళ రాష్ట్రంలో 2018 వ సంవత్సరంలో సంభవించిన ప్రకృతి విపత్తు వల్ల అక్కడి ప్రజల జీవితం అతలా కుతలమైంది. ఈ వాస్తవ సంఘటనల ఆధారంగా యాక్టర్ టోనివో థామస్ ప్రధాన పాత్రలో రూపొందించిన చిత్రమే 2018. ఇప్పటికే మలయాళం లో రిలీజ్ అయ్యి సెన్సషనల్ విజయం సాధించింది. ట్రేడ్ వర్గాల లెక్కల ప్రకారం, 131 కోట్లు కొల్లగొట్టింది. తెలుగులో విడుదలవుతున్న సినిమా గురించిన వివరాల్లోకి వెళితే..

అఖండ విజయం సాధించిన ఈ చిత్రాన్ని ఇపుడు అన్ని భాషల్లో విడుదల చేసేయందుకు సన్నాహాలు జరిగాయి. మన తెలుగు లో, సినిమా హక్కులని ప్రముఖ నిర్మాత బన్నీ వాసు గారు దక్కించుకున్నారు . ఆల్రెడీ తెలుగు రిలీజ్ చేసిన ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ లభించింది. ఈ నెల 26 న సినిమా థియేటర్స్ లోకి వస్తుంది.
నిర్మాత బన్నీ వాసు మాట్లాడుతూ.. 2018 సినిమా గొప్ప విజయం సొంతం చేసుకుంటుందని ధీమా వ్యక్తం చేసారు. సినిమా చూడగానే తనకు నచ్చింది అని అందుకే తెలుగు లో విడుదల చేయాలనీ అనుకున్న అని మీడియా తో చెప్పారు.
అలాగే చిత్ర దర్శకుడు జూడ్ అంథోని జోసెఫ్ మాట్లాడుతూజ.. 2018 చిత్రం తనకు ఎంతో ప్రత్యేకం అని అన్నారు. చిత్రీకరణ సమయం లో ఏంటో మంది భాదితుల అనుభవాలని తెలుసుకొని సినిమా తెరకెక్కించాం అని అన్నారు.

నిర్మాత వేణు మాట్లాతుడు తెలుగు ప్రేక్షకులు తమ సినిమాని సక్సెస్ చేస్తారు అని మీడియాతో ముచ్చటించారు. నిజ జీవిత ఆధారంగా తీసిన ఈ సినిమా అందరి మనస్సుకు చేరుతుందని అన్నారు.
ప్రముఖ దర్శకుడు హరీష్ శంకర్ మాట్లాడుతూ, ఇలాంటి చిత్రాలు ఇంకా రావాలని వాస్తవాలను తెలియచేసే సినిమాలను సినీ ప్రేమికులు ఎపుడూ ఆదరిస్తూనే ఉంటారని మీడియా పాత్రికేయులతో అన్నారు.
తెలుగు డబ్బింగ్ చిత్రంగా విడుదలైన 2018 సినిమాను సినీ ప్రముఖులకు ప్రదర్శించారు. ఈ సినిమా మంచి టాక్ అందుకుంది. మంచి రెస్పాన్స్ వచ్చింది అని నిర్మాత బన్నీ వాసు గారు తన ఆనందాన్ని మీడియా తో పంచుకున్నారు. టోనివో థామస్ తోపాటు కున్చాకో బోబన్, వినీత్ శ్రీనివాసన్, అసిఫ్ అలీ, లాల్, అపర్ణ బాలమురళి.. లాంటి ప్రముఖ నటీనటులు ఈ సినిమాలో మనకు కనిపిస్తారు. తెలుగు తో పటు తమిళ, హిందీ మరియు ఇతర భాషల్లో కూడా విడుదల చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి .


Click it and Unblock the Notifications











