Dragon: ఎన్టీఆర్- ప్రశాంత్ నీల్ మూవీ నుంచి తప్పుకున్న స్టార్ హీరో.. కారణం ఏంటంటే?

వార్ 2 మూవీ డిజాస్టర్ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ నటిస్తోన్న మూవీ డ్రాగన్. కేజీఎఫ్ సిరీస్, సలార్ వంటి భారీ చిత్రాల దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్నారు. టాలీవుడ్‌లోనే మోస్ట్ అవైటెడ్ మూవీస్‌లో ఒకటిగా నిలిచిన డ్రాగన్ మూవీ కోసం అభిమానులు, సినీ ప్రేక్షకులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. ఈ మూవీ షూటింగ్‌ను ప్రశాంత్ నీల్ పరుగులు పెట్టిస్తున్నాడు. అయితే డ్రాగన్ ప్రాజెక్ట్ నుంచి ఓ స్టార్ హీరో తప్పుకోవడం చిత్ర పరిశ్రమలో హాట్ టాపిక్‌గా మారింది. దీనికి సంబంధించిన వివరాల్లోకి వెళితే..

డ్రాగన్ తారాగణం
మైత్రీ మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్‌లపై వై రవిశంకర్, నవీన్ యెర్నెనీ, నందమూరి కళ్యాణ్ రామ్, కొసరాజు హరికృష్ణలు భారీ బడ్జెట్‌తో డ్రాగన్ మూవీని నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన కాంతార ఫేమ్ రుక్మిణీ వసంత్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. మలయాళ స్టార్ హీరో టోవినో థామస్, బాలీవుడ్ దిగ్గజం అనిల్ కపూర్ తదితరులు ఈ సినిమాలో నటిస్తున్నారు. రవి బస్రూర్ సంగీతం అందిస్తుండగా.. భువన్ గౌడ సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరిస్తున్నారు. ప్రణవ్ శ్రీ ప్రసాద్‌ ఎడిటింగ్ చేస్తున్నారు. పాన్ ఇండియా మూవీగా తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో వరల్డ్ వైడ్‌గా రిలీజ్ కానుంది.

Tovino Thomas confirms exit from Jr NTR and Prashant Neel s film Dragon

కొత్త లుక్‌లో ఎన్టీఆర్
డ్రాగన్ కోసం ప్రశాంత్ నీల్ తన టేకింగ్ స్టైల్ కూడా మార్చారట. ఆయన ఇప్పటి వరకు తెరకెక్కించిన సినిమాలలో సీన్ బ్లాక్ అండ్ డార్క్, గ్రే షేడ్‌లో విజువల్స్ కట్టిపడేశాయి. దాంతో ప్రశాంత్‌కు మరో స్టైల్‌లో తీయడం చేతకాదా? డ్రాగన్‌కు కూడా అదే ఫార్మాట్‌లో వెళ్తారా అనే టాక్ నడిచింది. దీనికి చెక్ పెట్టేందుకు గాను ఎన్టీఆర్ సినిమాను ఫుల్ కలర్ ఫార్మాట్‌లో పిక్చరైజేషన్ చేయాలని ప్రశాంత్ నీల్ భావిస్తున్నారు. అలాగే ఈ సినిమాలో ఎన్టీఆర్‌ను గతంలో ఎన్నడూ చూడని విధంగా చూపించేందుకు ప్రశాంత్ ప్రణాళికలు రూపొందిస్తున్నారు. యాక్షన్ సీక్వెన్స్, ఎన్టీఆర్ లుక్ అన్ని కొత్తగా ఉంటాయని టాక్ నడుస్తోంది.

నత్తనడకన డ్రాగన్ షూటింగ్
పాన్ ఇండియా స్థాయిని దాటి, ఇంటర్నేషనల్ రేంజ్‌లో తెరకెక్కుతోన్న ఈ సినిమా షూటింగ్ నత్తనడకన సాగుతోందన్న విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. డ్రాగన్‌లోని యాక్షన్ సీక్వెన్స్‌తో పాటు ఇతర సన్నివేశాలను గ్రాండియర్‌గా, హై టెక్నికల్ వాల్యూస్‌తో తీస్తుండటమే అందుకు కారణంగా ఫిలింనగర్‌లో ఊహాగానాలు వినిపిస్తున్నాయి. దాంతో ఈ ఏడాది ఎన్టీఆర్‌ను తాము తెరపై చూడగలమా లేదా? అన్న అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అయితే ఫ్యాన్స్ మాత్రం లేట్ అయినా పర్లేదని తమ హీరో హిట్ కొడితే చాలని అంటున్నారు.

డ్రాగన్‌లో నటించడం లేదు
ఇదిలాఉండగా.. డ్రాగన్‌లో మలయాళ స్టార్ హీరో టొవినో థామస్ కీలక పాత్రలో నటిస్తున్నట్లుగా ఇప్పటి వరకు ప్రచారం జరిగింది. అయితే అలాంటిదేమీ లేదని, తాను ఎన్టీఆర్ - ప్రశాంత్ నీల్ మూవీలో నటించడం లేదని క్లారిటీ ఇచ్చారు టొవినో థామస్. తన లేటెస్ట్ మూవీ పళ్లి చట్టంబి.. ఏప్రిల్ 10న విడుదల కానుంది. ఈ మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా మంగళవారం హైదరాబాద్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్- ప్రశాంత్ నీల్ ప్రాజెక్ట్ గురించి మీడియా ప్రతినిధులు ప్రశ్నించారు. దానికి థామస్ స్పందించారు.

టాలీవుడ్ కల్చర్ డిఫరెంట్
తెలుగులో నటించాలని ఎప్పటి నుంచో ఉంది. అయితే మలయాళ సినీ పరిశ్రమకు, టాలీవుడ్ వర్క్ కల్చర్‌కు చాలా తేడా ఉంది. తాము తక్కువ సమయంలో షూటింగ్ కంప్లీట్ చేస్తాం. అయితే టాలీవుడ్‌లో మాత్రం షెడ్యూల్స్ ఎక్కువగా ఉంటాయి. దీనికి తోడు ఒకేసారి రెండు మూడు చిత్రాల్లో నటించడం నాకు నచ్చదు. ఒక ప్రాజెక్ట్ పూర్తయ్యాకే, మరో సినిమాకు పనిచేస్తా. టాలీవుడ్‌లో ఏదైనా పెద్ద ప్రాజెక్ట్‌లో నేను భాగమైతే.. ఇప్పటికే అంగీకరించిన మూడు నుంచి నాలుగు మలయాళ చిత్రాలపై తీవ్ర ప్రభావం పడుతుంది. అందుకే తెలుగు సినిమాలకు డేట్స్ సర్దుబాటు చేయలేకపోతున్నానని టొవినో థామస్ తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X