Toxic Teaser: కారులో యష్‌తో అలాంటి సీన్లు... ట్రోలింగ్‌పై టాక్సిక్ డైరెక్టర్ బోల్డ్ కామెంట్స్
కన్నడ స్టార్ హీరో యష్ నటిస్తోన్న తాజా చిత్రం టాక్సిక్: ఏ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్ అప్స్. ప్రముఖ మహిళా దర్శకురాలు గీతూ మోహన్‌దాస్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే రిలీజైన నటీనటుల పోస్టర్స్‌కు భారీ రెస్పాన్స్ రావడంతో సినిమాపై హైప్ నెలకొంది. ఇటీవల యష్ పుట్టినరోజు సందర్భంగా రిలీజ్ చేసిన టాక్సిక్ గ్లింప్స్ వైరల్ అయ్యింది. అంతకుమించి ఈ సినిమాలోని హింస, ఇంటిమేట్ సీన్స్ వివాదాస్పదమయ్యాయి. తాజాగా దీనిపై డైరెక్టర్ గీతూ మోహన్‌దాస్ స్పందించారు. ఈ వివరాల్లోకి వెళితే...
టాక్సిక్ తారాగణం
టాక్సిక్ చిత్రాన్ని కేవీఎన్ ప్రొడక్షన్స్, మోన్‌స్టర్ మైండ్ క్రియేషన్స్ బ్యానర్‌పై వెంకట్ కే నారాయణ, యష్‌లు భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఇందులో యష్ సరసన ఐదుగురు హీరోయిన్లు నటిస్తున్నారు. వారు రుక్మిణీ వసంత్, కియారా అద్వానీ, నయనతార, హ్యూమా ఖురేషీ, తారా సుతారియా. అక్షయ్ ఒబెరాయ్, బియాట్రిజ్ తౌఫాన్‌బచ్, డెరిల్ డీ సిల్వ, సుదేవ్ నాయర్, అమిత్ తివారీ, టోవినో థామస్, కైల్ పాల్‌లు కీలకపాత్రలు పోషిస్తున్నారు. రవి బస్రూర్ సంగీత దర్శకత్వం వహించారు. ఉజ్వల్ కులకర్ణి ఎడిటింగ్, రాజీవ్ రవి సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరించారు. సమ్మర్ కానుకగా ఈ ఏడాది మార్చి 19న టాక్సిక్ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. దాదాపు 1000 మంది క్రూ సభ్యులు, 450 మంది నటులకు పైగా టాక్సిక్‌లో భాగమయ్యారు.

టాక్సిక్ గ్లింప్స్ వైరల్
ఇటీవల యష్ పుట్టినరోజును పురస్కరించుకుని టాక్సిక్ నుంచి హీరో పాత్రకు సంబంధించిన గ్లింప్స్‌ను విడుదల చేశారు. ఇందులో ఆయన రాయ పాత్రలో నటిస్తున్నారు. రెండున్నర నిమిషాల నిడివితో ఉన్న ఈ వీడియోలో హీరో పాత్ర, సినిమా థీమ్ మొత్తం వివరించే ప్రయత్నం చేశారు దర్శకురాలు. అయితే ఇందులో మితిమీరిన హింస, అశ్లీల సన్నివేశాలు ఉన్నాయి. గుబురు గడ్డం, పొడవాటి జుట్టుతో రఫ్ లుక్‌లో చేతిలో అత్యాధునిక గన్‌తో యష్ ష్టైల్‌గా, క్రూరంగా కనిపిస్తున్నారు.
స్మశానంలో ఇంటిమేట్ సీన్స్
అయితే ఈ గ్లింప్స్‌లోని ఓ చోట బయట భయంకరమైన యుద్ధం జరుగుతుండగా.. తుపాకీ కాల్పులు, బాంబు పేలుళ్ల మధ్యలో స్మశానం వద్ద యష్ ఓ అమ్మాయితో కారులో రొమాన్స్ చేస్తున్న ఇంటిమేట్ సీన్స్ వైరల్ అయ్యాయి. దీనిపై నెటిజన్ల నుంచి తీవ్ర విమర్శలు వస్తున్నాయి. మహిళా దర్శకురాలు అయ్యుండి ఇలాంటి సీన్స్ తీయడం ఏంటీ అంటూ నెటిజన్లు మండిపడుతున్నారు. సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్శ ఇప్పటికే గీతూ మోహన్‌దాస్‌ను మెచ్చుకున్నారు.
నేను చిల్ అవుతున్నా
తాజాగా టాక్సిక్ గ్లింప్స్‌లోని ఇంటిమేట్ సీన్స్ ఈ వివాదంపై గీతూ స్పందించారు. ఈ మేరకు తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో బదులిచ్చారు. మహిళల ఆనందం, వారి అంగీకారం, వ్యవస్థలతో స్త్రీలు ఆడుకోవడం లాంటివి జనం ఇంకా అర్ధం చేసుకునే దిశలో బిజీగా ఉన్నారు. నేను మాత్రం చిల్ అవుతున్నానంటూ రాసుకొచ్చారు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అంతేకాదు.. ఈ సీన్స్‌లో నటించిన అమ్మాయిని కూడా గీతూ పరిచయం చేశారు. ఆమె పేరు బీట్రీజ్ బాఖ్ అని తెలిపారు. ఈవిడ హాలీవుడ్‌కు చెందినవారు. బ్రూక్లిన్ నైన్ నైన్ అనే టెలివిజన్ సిరీస్‌తో గుర్తింపు తెచ్చుకున్నారు.


Click it and Unblock the Notifications











