Toxic Release Postponed: యష్ అభిమానులకు ఊహించని షాక్.. టాక్సిక్ రిలీజ్ వాయిదా

గీతూ మోహన్‌దాస్ దర్శకత్వంలో కన్నడ సూపర్‌స్టార్ యష్ నటించిన మూవీ టాక్సిక్. 2026లో మోస్ట్ అవైటెడ్ మూవీగా ఉన్న చిత్రాల్లో టాక్సిక్ ఒకటి. కేజీఎఫ్ సిరీస్ తర్వాత యష్ నటిస్తోన్న మూవీ కావడంతో ఈ సినిమాపై శాండల్‌వుడ్‌తో పాటు యావత్ భారతీయ చిత్ర పరిశ్రమ ఉత్కంఠగా ఎదురుచూస్తోంది. ఇప్పటికే రిలీజైన టీజర్, ట్రైలర్లు సినిమాపై మరింత అంచనాలు పెంచేస్తున్నాయి. ఉగాది, రంజాన్ పండుగలను పురస్కరించుకుని మార్చి 19న టాక్సిక్ విడుదల కానుంది. దాంతో అభిమానులు ఎప్పుడెప్పుడు ఈ సినిమాను చూస్తామా అని ఎదురుచూస్తుండగా.. ఈ చిత్ర నిర్మాతలు షాకిచ్చారు. టాక్సిక్ విడుదలను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు కేవీఎన్ ప్రొడక్షన్స్ అధికారిక ప్రకటన విడుదల చేసింది. ఈ నేపథ్యంలో టాక్సిక్‌ను ఎందుకు వాయిదా వేశారు? దీనికి దారి తీసిన పరిస్ధితులను ఒకసారి పరిశీలిస్తే..

Toxic Release Postponed Yash s Most Awaited Film Gets new date

టాక్సిక్ బడ్జెట్ ఎంత?
కేవీఎన్ ప్రొడక్షన్స్, మోన్‌స్టర్ మైండ్ క్రియేషన్స్ బ్యానర్‌పై వెంకట్ కే నారాయణ, యష్‌లు సంయుక్తంగా రూ. 500 కోట్ల భారీ బడ్జెట్‌తో టాక్సిక్‌ను నిర్మిస్తున్నారు. మలయాళ నటి, దర్శకురాలు గీతూ మోహన్‌దాస్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో యష్ సరసన ఏకంగా ఐదుగురు హీరోయిన్లు రుక్మిణీ వసంత్, కియారా అద్వానీ, నయనతార, హ్యూమా ఖురేషీ, తారా సుతారియాలు నటిస్తున్నారు. అక్షయ్ ఒబెరాయ్. బియాట్రిజ్ తౌఫాన్‌బచ్‌, డెరిల్ డీ సిల్వ, సుదేవ్ నాయర్, అమిత్ తివారీ, టోవినో థామస్, కైల్ పాల్‌లు టాక్సిక్‌లో కీలకపాత్రలు పోషిస్తున్నారు. ఈ భారీ రవి బస్రూర్ సంగీత దర్శకత్వం వహిస్తుండగా... ఉజ్వల్ కులకర్ణి ఎడిటింగ్, రాజీవ్ రవి సినిమాటోగ్రాఫర్‌గా పనిచేస్తున్నారు. ఉగాది, రంజాన్, గుడిపర్వా వంటి పర్వదినాలను పురస్కరించుకుని మార్చి 19న తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం, హిందీ, ఇంగ్లీష్ భాషల్లో టాక్సిక్ వరల్డ్ వైడ్‌గా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని నిర్మాతలు భావించారు.

ధురంధర్2 vs టాక్సిక్
మార్చి 19న టాక్సిక్‌తో బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌వీర్ సింగ్ నటించిన ధురంధర్ 2 కూడా రిలీజ్ కానుంది. ఈ రెండు భారీ యాక్షన్ చిత్రాలు ఒకేరోజు రావడంతో బాక్సాఫీస్ వద్ద భారీ యుద్ధం తప్పదని అంతా భావించారు. ఏ సినిమాపై ఏది పైచేయి సాధిస్తుందోనని ట్రేడ్ పండితులు సైతం ఉత్కంఠగా ఎదురుచూశారు. సోషల్ మీడియాలో అయితే యష్ అభిమానులకు, రణ్‌వీర్ అభిమానులకు మధ్య యుద్ధం జరుగుతోంది. ఏ సినిమా ఎక్కువ ఓపెనింగ్స్ సాధిస్తుంది? ఏ సినిమా రికార్డులు బద్ధలుకొడుతోందని చర్చ జరుగుతోంది. ఇలాంటి దశలో రణ్‌వీర్ మూవీకి ఏమాత్రం అడ్డులేకుండా టాక్సిక్ పక్కకి తప్పుకోవడం చిత్ర పరిశ్రమలో హాట్ టాపిక్‌గా మారింది.

టాక్సిక్‌ను వాయిదా ఎందుకంటే?
భారీ అంచనాల నేపథ్యంలో టాక్సిక్ ఎప్పుడెప్పుడు వస్తుందా అని అభిమానులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే నార్త్ అమెరికాతో పాటు ఓవర్సీస్‌లోని పలు ఏరియాలలో బుకింగ్స్ ఓపెన్ కావడంతో పాటు అడ్వాన్స్ బుకింగ్‌కు మంచి రెస్పాన్స్ సైతం వస్తోంది. ఇలాంటి దశలో ఎందుకు నిర్మాతలు ఈ నిర్ణయం తీసుకున్నారని అభిమానులు ప్రశ్నిస్తున్నారు. దీనికి వివరణ ఇస్తూ కేవీఎన్ ప్రొడక్షన్స్ సంస్థ సోషల్ మీడియాలో నోట్ విడుదల చేసింది.

టాక్సిక్: ఏ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్ అప్స్ అనేది గ్లోబల్ ఆడియన్స్ కోసం రూపొందించాం. కన్నడతో పాటు ఇంగ్లీష్‌లోనూ చిత్రీకరించాం. సొంతింటితోనే కాదు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులతో కనెక్ట్ అవ్వాలనే నమ్మకంతో నిర్మించాం. సంవత్సరాల తరబడి అంకితభావంతో కూడిన శ్రమతో మార్చి 19న టాక్సిక్ ఏ ఫెయిరి టేల్‌ను మీ అందరితో పంచుకోవాలని ఉత్సాహంగా ఎదురుచూశాం. అయితే ప్రస్తుతం మధ్యప్రాచ్యంలో అనిశ్చిత పరిస్ధితులు.. మా సినిమా ప్రేక్షకులకు చేరువ చేయాలన లక్ష్యాన్ని ప్రభావితం చేసింది. అందువల్ల మా భాగస్వాములు, ప్రేక్షకుల ప్రయోజనాల దృష్ట్యా కష్టమే అయినా టాక్సిక్‌ను రీ షెడ్యూల్ చేయాలని నిర్ణయించుకున్నాం. జూన్ 4, 2026న భారతీయ భాషలతో పాటు ఇంగ్లీష్‌లో ప్రపంచవ్యాప్తంగా టాక్సిక్ విడుదల అవుతుందని కేవీఎన్ ప్రొడక్షన్స్ పేర్కొంది. దాంతో మార్చి 19న బాక్సాఫీస్ రేసు నుంచి టాక్సిక్ తప్పుకుంది. తద్వారా ధురంధర్ 2కి లైన్ క్లియర్ అయినట్లేనని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

More from Filmibeat

Read more about: toxic yash
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X