Toxic Vs Dhurandhar 2: ముదిరిన టాక్సిక్, ధురంధర్ 2 వివాదం.. యష్, రణ్‌వీర్ సింగ్ బాక్సాఫీస్ వార్
సినిమా పరిశ్రమలో ఇద్దరు సూపర్ స్టార్స్ సినిమాలు బాక్సాఫీస్ వద్ద పోటీ పడటం చాలాసార్లే చోటుచేసుకొన్నాయి. అయితే కంటెంట్, స్టార్ పవర్‌తో తమ సత్తాను కలెక్షన్లను సాధించారు. కొన్నిసార్లు స్టార్ల మధ్య పోటీ అభిమానుల్లో ఎమోషన్స్ రెచ్చ గొట్టేలా చేసింది. అయితే ఇలాంటి పోరు మరోసారి బాక్సాఫీస్ వద్ద మార్చి 19వ తేదీన కనిపిస్తున్నది. ఈ సారి పోటీకి కన్నడ సూపర్ స్టార్ యష్, బాలీవుడ్ స్టార్ రణ్‌వీర్ సింగ్ సినిమాల మద్య తెరలేచింది. వారు నటించిన టాక్సిక్, ధురంధర్ 2 సినిమాలు ఒకే రోజున రిలీజ్‌కు సిద్దపడటమే అనేది ప్రస్తుతం వివాదంగా మారింది. ఈ వివాదం వెనుక అసలు కారణం ఏమిటంటే?
టాక్సిక్ చిత్రం పాన్ ఇండియా చిత్రంగా భారీ హంగులతో సిద్దమైంది. రాకింగ్ స్టార్ యష్ నటించిన ఈ చిత్రానికి గీతూ మోహన్‌దాస్ దర్శకత్వం వహించారు. కేవీఎన్ ప్రొడక్షన్స్, మానస్టర్ మైండ్ క్రియేషన్స్ బ్యానర్‌పై ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో కియారా అద్వానీ, నయనతార, హ్యుమా ఖురేషి, తారా సుతారియా, రుక్మిణి వసంత్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. అయితే ఈ సినిమా రిలీజ్ డేట్‌ను మార్చి 19 అని ఏడాది క్రితమే అఫీషియల్‌గా ప్రకటించారు.

అయితే రణ్‌వీర్ సింగ్ నటించిన ధురంధర్ చిత్రం ఊహించని రీతిలో సంచలన విజయం సాధించింది. ఆదిత్య ధార్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద 1400 కోట్ల రూపాయల కలెక్షన్లను సాధించింది. అయితే ఈ సినిమా సెకండ్ పార్ట్‌ను మార్చి 19వ తేదీన రిలీజ్ చేస్తున్నట్టు పార్ట్ 1 రిలీజ్ సందర్బంగానే ప్రకటించారు. దాంతో ఈ సినిమాల మధ్య పోటీ అనివార్యమైంది. అయితే ఈ సినిమాల రిలీజ్ డేట్స్ మార్చే ప్రయత్నాలు జరిగాయి. కానీ ఎవరికీ వారే విడుదల విషయంలో రాజీ పడకపోవడంతో బాక్సాఫీస్ వద్ద రంజైన పోటీకి రెడీ అయింది.
ధురంధర్ 2 సినిమా యూనిట్ నిర్వాకంపై కేవీఎన్ ప్రొడక్షన్ తీవ్రమైన అసంతృప్తితో ఉంది. తాము ఏడాది క్రితమే తాము రిలీజ్ డేట్ ప్రకటించాం. మా సినిమాకు పోటీగా ఇప్పుడు ఆ సినిమాను ఎలా రిలీజ్ చేస్తారు? వాళ్లు రిలీజ్ డేట్ ప్రకటించే ముందు ఓసారి మాతో సంప్రదింపులు చేపట్టాలనే కనీసం మర్యాద పాటించలేదు అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
అయితే నార్త్‌లో గట్టి పట్టు ఉన్న రణ్‌వీర్ సింగ్, సౌత్‌లో మంచి ఆడియెన్స్ ఫాలో ఉన్న యష్ చిత్రాల మధ్య పోటీ ఆసక్తికరంగా మారింది. రణ్‌వీర్ సింగ్ సినిమా సౌత్‌లో, యష్ మూవీ నార్త్‌లో తఢాఖా చూపిస్తుందా? అనే విషయంపై ట్రేడ్ వర్గాలు దృష్టిపెట్టాయి. అయితే ఈ చిత్రాల మధ్య పోటీ బాక్సాఫీస్‌ను కుదిపేస్తుందా? ఏ రేంజ్ కలెక్షన్లు సాధిస్తాయనే విషయం క్రేజీగా మారింది.
ఇదిలా ఉండగా, ఈ రెండు చిత్రాల మధ్య పోటీ నుంచి మూడు పాన్ ఇండియా సినిమాలు తప్పుకొన్నాయి. నాని నటించిన ది ప్యారడైజ్, రాంచరణ్ నటించిన పెద్ది, డెకాయిట్ చిత్రాలు తమ రిలీజ్‌ను వాయిదా వేసుకొన్నాయి. ఈ సినిమాలు తర్వాత ప్రేక్షకుల ముందుకు రానున్నాయి.


Click it and Unblock the Notifications











