Toxic: టాక్సిక్‌లో మైండ్ బ్లాకింగ్ ట్విస్ట్... నయన్, కియారా క్యారెక్టర్స్ లీక్ చేసిన యశ్!
2026లో ఇండియాలోనే మోస్ట్ అవైటెడ్ మూవీగా ప్రేక్షకులు ఎదురుచూస్తున్న సినిమా టాక్సిక్. కన్నడ సూపర్‌స్టార్ యష్ హీరోగా గీతూ మోహన్‌దాస్ దర్శకత్వంలో ఈ మూవీ తెరకెక్కుతోంది. ఈపాటికే రావాల్సిన టాక్సిక్ అనివార్య కారణాలతో జూన్‌కు వాయిదా పడింది. కేజీఎఫ్ సిరీస్ తర్వాత యష్ నటిస్తోన్న సినిమా కావడంతో ఈ మూవీపై చిత్ర పరిశ్రమలో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఫుల్ లెంగ్త్ మాస్ యాక్షన్ మూవీగా టాక్సిక్ తెరకెక్కుతోంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన కీలక విషయాలను హీరో యశ్ పంచుకున్నారు.
కేవీఎన్ ప్రొడక్షన్స్, మోన్‌స్టర్ మైండ్ క్రియేషన్స్ బ్యానర్‌పై వెంకట్ కే నారాయణ, యష్‌లు సంయుక్తంగా రూ. 500 కోట్ల భారీ బడ్జెట్‌తో టాక్సిక్‌ను నిర్మిస్తున్నారు. మలయాళ నటి, దర్శకురాలు గీతూ మోహన్‌దాస్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో యష్ సరసన రుక్మిణీ వసంత్, కియారా అద్వానీ, నయనతార, హ్యూమా ఖురేషీ, తారా సుతారియాలు నటిస్తున్నారు. అక్షయ్ ఒబెరాయ్. బియాట్రిజ్ తౌఫాన్‌బచ్, డెరిల్ డీ సిల్వ, సుదేవ్ నాయర్, అమిత్ తివారీ, టోవినో థామస్, కైల్ పాల్‌లు టాక్సిక్‌లో కీలకపాత్రలు పోషిస్తున్నారు. ఈ భారీ రవి బస్రూర్ సంగీత దర్శకత్వం వహిస్తుండగా... ఉజ్వల్ కులకర్ణి ఎడిటింగ్, రాజీవ్ రవి సినిమాటోగ్రాఫర్‌గా పనిచేస్తున్నారు.

షెడ్యూల్ ప్రకారం మార్చి 19న తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం, హిందీ, ఇంగ్లీష్ భాషల్లో టాక్సిక్ వరల్డ్ వైడ్‌గా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని నిర్మాతలు భావించారు. అయితే అదే రోజున బాలీవుడ్ బ్లాక్ బస్టర్ మూవీ ధురంధర్ 2 రిలీజ్ కానుండటానికి తోడు అమెరికా- ఇరాన్ యుద్ధం కారణంగా పశ్చిమాసియా, గల్ఫ్ దేశాల్లో తీవ్ర ఉద్రిక్త పరిస్ధితులు నెలకొన్నాయి. దాంతో టాక్సిక్ విడుదలపై నిర్మాతలు వెనక్కి తగ్గారు. జూన్ 4న వరల్డ్ వైడ్‌గా రిలీజ్ అవుతుందని నిర్మాతలు ప్రకటించారు. తీరా చూస్తే ఆ రోజున కూడా టాక్సిక్ రావడం లేదని యశ్ స్వయంగా ప్రకటించారు.
టాక్సిక్ సినిమా పూర్తయ్యింది.. దీనిని అంతర్జాతీయ వేదిక మీద ప్రదర్శించినప్పుడు మంచి రెస్పాన్స్ వచ్చింది. దాంతో టాక్సిక్ వరల్డ్ వైడ్ డిస్ట్రిబ్యూషన్ కోసం ప్రయత్నిస్తున్నాం.. అన్ని దేశాలకు సెట్ అయ్యేలా ఓ రిలీజ్ డేట్‌ను త్వరలోనే ప్రకటిస్తామని యష్ వెల్లడించారు. ఇండియన్ సినిమాకి గర్వకారణంగా టాక్స్ ఉంటుందని ఆయన అభిప్రాయపడ్డారు. అయితే వరుసగా రిలీజ్ డేట్‌లు వాయిదా పడుతుండటంతో అభిమానులు కంగారుపడుతున్నారు. అయితే సినిమాపై హైప్ తగ్గకుండా చూసుకుంటోంది టాక్సిక్ యూనిట్.
తాజాగా యశ్ ఓ ఛానెల్‌తో మీడియాతో మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ సినిమాలో హీరోయిన్లుగా నటిస్తోన్న నయనతార, కియారా అద్వానీ... వారి క్యారెక్టర్ల గురించి హింట్ ఇచ్చారు. వీరిద్దరూ టాక్సిక్‌లో నెగిటివ్ షేడ్ ఉన్న పాత్రలో కనిపిస్తారని .. అయితే ఆ క్యారెక్టర్లు విలన్‌లా కాకుండా బలమైన వ్యక్తిత్వాన్ని ప్రతిబింబిస్తాయి. స్క్రీన్‌పై కియారా, నయన్‌ల పాత్రలు ప్రేక్షకులకు కొత్త అనుభూతిని కలిగిస్తాయి. గతంలో ఎప్పుడూ చూడని విధంగా వారి పాత్రలు ఉంటాయని యశ్ తెలిపారు. ప్రస్తుతం ఆయన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. నయన్, కియారాల రోల్స్ ఎలా ఉంటాయోనని ప్రేక్షకుల్లో ఉత్కంఠ నెలకొంది.


Click it and Unblock the Notifications


