టాలీవుడ్ హీరోలకు వరుస షాకులిస్తున్న పోలీసులు.. మొన్న ఎన్టీఆర్, ఇప్పుడు అల్లు అర్జున్ లకు?
హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు వరుసగా సినిమా హీరోలకు షాకులు ఇస్తున్నారు. మొన్నటికి మొన్న ఎన్టీఆర్ కారు ఆపి ఎన్టీఆర్ కి షాక్ ఇచ్చిన పోలీసులు తాజాగా అల్లు అర్జున్ కారు ఆపడమే కాగా ఆ కారుకు జరిమానా కూడా విధించినట్టు తెలుస్తోంది. అసలేం జరిగింది అనే వివరాల్లోకి వెళితే

బ్లాక్ గ్లాస్ వాడుతూనే
సాధారణంగా తెలుగు రాష్ట్ర చట్టాల ప్రకారం జడ్ ప్లస్ కేటగిరి భద్రత ఉన్నవారు తప్ప ఇతరులెవరూ వాహనాల అద్దాలను పూర్తిగా బ్లాక్ గ్లాసుతో మూసివేయడం నిషిద్ధం. కారు లోపల ఏం జరుగుతుంది, లేకపోతే ఎవరు కూర్చున్నారు అనే విషయాలు బయట నుంచి అందరికీ కనబడే విధంగానే కార్లు ఉండాల్సి ఉంటుంది. అయితే సెలబ్రిటీలు అలా కనబడుతూ ఉంటే వారికి ఫ్యాన్స్ తో ఇబ్బంది కాబట్టి వాళ్ళు మాత్రం బ్లాక్ గ్లాస్ వాడుతూనే ఉంటారు.

కొబ్బరి బొండాల లో
అడపదడప పోలీసుల దృష్టికి ఈ విషయాలు రావడం పోలీసులకు రోడ్డు మీద అలాంటి కార్లు కనబడితే వాటిని పీకి పంపించడం కూడా జరుగుతూనే ఉంటుంది. ఈ మధ్యకాలంలో గాయత్రి అనే వర్ధమాన నటి రోడ్డు ప్రమాదంలో దారుణమైన పరిస్థితుల్లో మరణించింది. అయితే ఆమె మరణానికి కారణం మద్యం తాగి వాహనం నడపడం అని పోలీసులు గుర్తించారు. అయితే ఆ సమయంలో కారు తోలుతున్న వ్యక్తి మద్యం తాగి ఉన్నాడని అంతేకాక కారులో కూడా కొబ్బరి బొండాల లో మద్యం కలిపి ఉంచారని గుర్తించారు.

జూనియర్ ఎన్టీఆర్ కారు
ఆ కారు కూడా పూర్తిగా బ్లాక్ గ్లాస్ తో మూసివేసి ఉంది. ఈ నేపథ్యంలోనే బ్లాక్ గ్లాస్ తో మూసివేసి ఉంటే లోపల ఏం జరుగుతుందనే విషయం అర్థం కావడం లేదు కాబట్టి ఇష్టారీతిన ప్రవర్తిస్తున్నారని గుర్తించిన పోలీసులు పెద్ద ఎత్తున జూబ్లీహిల్స్ తదితర ప్రాంతాల్లో స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నారు. అందులో భాగంగానే కొద్దీ రోజుల క్రితం యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కారు అద్దాలకు ఉన్న బ్లాక్ ఫిలింను జూబ్లీహిల్స్ ట్రాఫిక్ పోలీసులు తొలగించారు.

జరిమానా
జూనియర్ ఎన్టీఆర్ వాహనాన్ని తనిఖీ చేసి అనంతరం అద్దాలకు ఉన్న బ్లాక్ ఫిలింను తొలగించారు. తనిఖీలు జరుగుతున్న సమయంలో కారులో డ్రైవర్‌తో పాటు ఎన్టీఆర్ తనయుడు మరో వ్యక్తి కూడా ఉన్నట్లు సమాచరం. ఇక తాజాగా సినీ నటుడు అల్లు అర్జున్ కారుకు జూబ్లీహిల్స్ ట్రాఫిక్ పోలీసులు జరిమానా విధించారు. శుక్రవారం జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 36 లోని నీరూస్ చౌరస్తాలో వాహనాల తనిఖీల్లో భాగంగా ట్రాఫిక్ పోలీసులు జరిమానా విధించారు. అల్లు అర్జున్ కారును ఆపి ఆయన కారు అద్దాలకు ఉన్న నల్ల ఫిల్మ్ లను తొలగించి 700 రూపాయల జరిమానా విధించారు. అదే దారిలో వెళుతున్న మరో హీరో కల్యాణ్ రామ్ కారుకు పోలీసులు ఇదే తరహాలో జరిమానా విధించారు.
Recommended Video


బ్లాక్ ఫిలిం వేయొద్దని
జడ్ ప్లస్ కేటగిరి భద్రత ఉన్నవారు తప్ప ఇతరులెవరూ వాహనాలపై బ్లాక్ ఫిలిం ఉపయోగించడానికి అనుమతి లేదని పోలీసులు చెబుతున్నారు. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం వాహనం లోపల విజిబులిటీ సరిగ్గా ఉండాలని.. వాహనాలపై అనుమతి లేకుండా బ్లాక్ ఫిలిం వేయొద్దని పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఇక మరికొన్ని రోజుల పాటు..ఈ స్పెషల్ డ్రైవ్ కొనసాగనుందని తెలుస్తోంది.


Click it and Unblock the Notifications











