Tamanna Simhadri: హేమక్క బతుకు అదే.. కొత్త ఆర్టిస్టులను ఎరగా వేస్తూ కోట్ల సంపాదన!

బెంగళూరులో జరిగిన రేవ్ పార్టీలో అనేక మంది తెలుగు సినీ ప్రముఖులు ఇరుక్కున్న విషయం అందరికీ తెలిసిందే. ముఖ్యంగా నటి హేమ.. అందులో పాల్గొనగా తానెక్కడికీ వెళ్లలేదంటూ హేమ వీడియో రిలీజ్ చేసింది. కానీ ఆ తర్వాత రోజే పోలీసులు నటి హేమ ఆ పార్టీలో ఉందంటూ ప్రకటించగా.. పెద్ద ఎత్తున ట్రోల్స్ వస్తున్నాయి. ముఖ్యంగా మరో నటి తమన్నా సింహాద్రి నటి హేమపై సెన్సేషనల్ కామెంట్లు చేసింది. ముఖ్యంగా హేమక్క బతుకు అదేనంటూ.. కావాల్సిన వాళ్లకు అమ్మాయిలను సరఫరా చేస్తూ డబ్బులు సంపాదిస్తుందంటూ వివరించింది. ఆ పూర్తి వివరాలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

రేవ్ పార్టీ వ్యవహారంలో.. అనేక మంది తెలుగు సినీ ప్రముఖులు, బుల్లితెర నటులు, మోడల్స్ హాజరైనట్లుగా వార్తలు వచ్చాయి. ముఖ్యంగా తెలుగు నటి హేమ, హీరో శ్రీకాంత్ వంటి వాళ్లు పాల్గొన్నట్లు తెలిసింది. కానీ వీరిద్దరూ తాము ఇంట్లోనే ఉన్నట్లుగా వీడియోలు విడుదల చేశారు. శ్రీకాంత్ తన ఇంటిని కూడా చూపించారు. కానీ నటి హేమ మాత్రం తాను ఓ ఫామ్ హౌస్ లో ఉన్నట్లు చెప్పుకొచ్చింది. రేవ్ పార్టీకి వెళ్లలేదని క్లారిటీ ఇచ్చింది. కానీ పోలీసులు వెంటనే రియాక్ట్ అయ్యారు.

Transgender Tamanna Simhadri Fires on Hema About Rave Party Issue

హేమ తన కుటుంబ సభ్యులకు విషయం చెబుతానంటే ఫోన్ ఇచ్చామని.. దాని సాయంతో ఓ వీడియో తీసి ప్రజలను తప్పుదోవ పట్టించిందని మండిపడ్డారు. హేమ తమ అదుపులోనే ఉందని , ఆవిడ డ్రగ్స్ తీసుకుందా లేదా అనేది తేల్చేందుకు పరీక్షలు చేస్తున్నట్లు చెప్పారు. అయితే పోలీసులు హేమ గురించి మాట్లాడుతూ వీడియో రిలీజ్ చేసిన కాసేపటి తర్వాత నుంచే పెద్ద ఎత్తున ట్రోలింగ్ స్టార్ అయింది. ఆమెపై చాలా మంది ఫైర్ అవుతూ.. అనేక వీడియోలు నెట్టింట పెడుతున్నారు. అవి కూడా పెద్ద ఎత్తున వైరల్ అవుతున్నాయి.

తాజాగా ట్రాన్స్ జెండర్ తమన్నా సింహాద్రి ఈ విషయం స్పందించింది. మన అక్క రేవ్ పార్టీలో బెంగళూరులో దొరికిపోయిందంటూ చెప్పుకొచ్చింది. హేమక్క అనేక పార్టీల్లో దొరుకుతుందని.. గుంటూరులో కూడా ఓ పార్టీలో దొరికిపోయి.. వాళ్ల, వీళ్ల సాయంతో బయట పడిందని వివరించింది. అక్క ఏం బాహుబలి సినిమా హీరోయిన్ కాదని.. చేసేవి చిన్నా చితకా క్యారెక్టర్లు మాత్రమేనని వెల్లడించింది. కానీ అక్కకు ఉన్న ఆస్తులు చూస్తే మాత్రం అంతా షాక్ అవుతారని చెప్పుకొచ్చింది.

Transgender Tamanna Simhadri Fires on Hema About Rave Party Issue

రేవ్ పార్టీలో దొరికిపోయాకా.. నేను బెంగళూరులో లేను.. హైదరాబాద్ లోనే ఉన్నానంటూ ఓ వీడియో రిలీజ్ చేసిందని ఎద్దేవా చేసింది. అక్క బతుకే అదని.. ఇండస్ట్రీలోకి కొత్తగా వచ్చిన అమ్మాయిలకు అవకాశాలు ఇప్పిస్తానని చెబుతూ ఎరగా వాడుకుంటూ డబ్బులు సంపాదిస్తుందని తమన్నా సింహాద్రి సెన్సేషనల్ కామెంట్లు చేసింది. ప్రస్తుతం తమన్నా సింహాద్రి చేసిన ఈ కామెంట్లు నెట్టింట వైరల్ అయ్యాయి. ప్రతీ ఒక్కరూ తమన్నాకు మద్దతిస్తూ.. నటి హేమపై నెగిటివ్ కామెంట్లు చేస్తున్నారు. మీరు కూడా ఓసారి తమన్నా రియాక్షన్ వీడియో చూసేయండి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X