రాజకీయాల్లోకి రాఘవ లారెన్స్? విజయ్ పార్టీలో చేరికపై ముహూర్తం ఖరారు?

కోలీవుడ్ సూపర్‌స్టార్, దళపతి విజయ్ టీవీకే పార్టీని స్థాపించి ఎన్నికల్లో ఘన విజయం సాధించి తమిళనాడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చరిత్ర సృష్టించారు. రాజకీయాల్లో సినిమా వాళ్లకు ఏ మాత్రం ఆదరణ దక్కలేదని, కష్టపడితే విజయాలు సాధ్యమేనని నిరూపించారు విజయ్. ఆయన సాధించిన విజయం రాజకీయాల్లోకి రావాలనుకుని కలలు కంటున్న తారలకు దిక్సూచిలా మారింది. త్వరలో సినీ రంగం నుంచి రాజకీయాల్లోకి వచ్చే వారి సంఖ్య పెరుగుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు. దీనిని నిజం చేస్తూ తమిళ రాజకీయాలలో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ వివరాల్లోకి వెళితే..

తమిళ రాజకీయాలు, సినీ రంగానికిని అవినాభావ సంబంధం ఉంది. దశాబ్ధాల క్రితం నుంచే సినీ రంగంతో సంబంధం ఉన్న వారు, నటులు రాజకీయాల్లోకి వచ్చి ముఖ్యమంత్రులుగా చక్రం తిప్పిన చరిత్ర తమిళనాడు సొంతం. సినీ రంగానికి చెందిన సీఎన్ అన్నాదురై, కరుణానిధి, ఎంజీ రామచంద్రన్, జయలలిత ఇప్పుడు లేటెస్ట్‌గా విజయ్‌ దళపతిలు ముఖ్యమంత్రులయ్యారు. అలాగే శివాజీ గణేషన్, శరత్ కుమార్, కమల్ హాసన్, విజయ్ కాంత్ తదితర నటులు పార్టీలు పెట్టి తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. ఖుష్బూ, గౌతమి, టీ రాజేందర్, సత్యరాజ్ తదితర నటులు వివిధ పార్టీలలో పనిచేశారు.

Trichy By Poll Raghava Lawrence Hints at Major Announcement Amid CM Vijay s TVK Speculations

తాజాగా కొరియోగ్రాఫర్, నటుడు, డైరెక్టర్ రాఘవ లారెన్స్ కూడా త్వరలో రాజకీయాల్లోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. కృషి, పట్టుదల, ప్రతిభ ఉంటే ఎవరైనా ఎంతటి సామాన్యుడైనా అసాధారణ స్థాయికి చేరుకోవచ్చని నిరూపించిన వారిలో లారెన్స్ కూడా ఒకరు. 1976 అక్టోబర్ 29న చెన్నైలో జన్మించిన ఆయనకు చిన్నతనంలోనే బ్రెయిన్ ట్యూమర్ ఉన్నట్లు నిర్ధారణ అయ్యింది. ఇందుకోసం ఆ వయసులోనే చికిత్స పొంది తొలి యుద్ధంలో గెలిచాడు. పొట్టకూటి కోసం చిన్నతనంలోనే కారు క్లీనర్‌గా పనిచేసిన లారెన్స్.. పనితో పాటు డ్యాన్స్ చేసేవాడు. దీనిని గమనించిన సూపర్‌స్టార్ రజనీకాంత్.. అతనికి డ్యాన్సర్స్ అసోసియేషన్‌లో చోటు కల్పించారు.

దాంతో ఆయన అదృష్టం మారిపోయింది. డ్యాన్సర్ స్థాయి నుంచి కొరియోగ్రాఫర్‌గా ఎదిగిన లారెన్స్.. ఎందరో స్టార్ హీరోలకు డ్యాన్స్ కంపోజ్ చేశారు. ఆయన స్టెప్స్ కుర్రకారును ఆకట్టుకోవడంతో పాటు ఎందరినో డ్యాన్స్ వైపు నడిపించాయి. కొరియోగ్రాఫర్‌గానే కాకుండా నటుడిగా, దర్శకుడిగా, నిర్మాతగా, సంగీత దర్శకుడిగా, సింగర్‌గానూ మెప్పించారు లారెన్స్. ఆయనకు భార్య లతా లారెన్స్, కుమార్తె ఉన్నారు. కూతురిని కూడా సినిమాల్లోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు లారెన్స్.

చిన్నతనంలో ఎన్నో కష్టాలు చూసిన లారెన్స్... ఎంతోమంది పేదలకు సాయం చేస్తున్నారు. విద్య, వైద్య సేవలతో పాటు ఇతర సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ తన పెద్ద మనసు చాటుకున్నారు. తమిళనాడుతో పాటు తెలుగు రాష్ట్రాల్లోనూ లారెన్స్‌కి మంచి ఫాలోయింగ్ ఉంది. ఆయన రాజకీయాల్లోకి ప్రవేశిస్తారని ఎప్పటి నుంచో వార్తలు వస్తుండగా.. లారెన్స్ ఖండిస్తూ వచ్చారు. అయితే తమిళనాడులో విజయ్ టీవీకే ఘన విజయం సాధించడంతో లారెన్స్ పొలిటికల్ ఎంట్రీకి సంబంధించి విస్తృతంగా కథనాలు వస్తున్నాయి.

ఎన్నికల్లో విజయ్.. పెరంబూర్, తిరుచ్చి ఈస్ట్‌ల నుంచి పోటీ చేసి భారీ మెజారిటీతో గెలుపొందారు. అయితే ఒక స్థానాన్ని వదులుకోవాల్సి రావడంతో పెరంబూర్‌ని ఉంచుకుని.. తిరుచ్చి ఈస్ట్ ఎమ్మెల్యేగా రాజీనామా చేయనున్నారు. దాతో తిరుచ్చి ఈస్ట్‌ ఉప ఎన్నిక ప్రస్తుతం తమిళ రాజకీయాల్లో చర్చనీయాంశమైంది. ఇక్కడి నుంచి త్రిష పోటీ చేస్తారని వార్తలు వచ్చినప్పటికీ ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. అనూహ్యంగా ఈ స్థానంలో లారెన్స్ పేరు తెరపైకి వచ్చింది. మంచితనం, మానవత్వంతో పాటు క్లీన్ ఇమేజ్ కారణంగా ఇక్కడి నుంచి లారెన్స్‌ను పోటీ చేయిస్తే బాగుంటుందని విజయ్ కూడా భావిస్తున్నారు.

ఈ క్రమంలో తన రాజకీయ ప్రవేశంపై వస్తున్న ఊహాగానాలపై రాఘవ లారెన్స్ స్పందించారు. తిరుచ్చి ఈస్ట్ నియోజకవర్గం నుంచి నేను బరిలోకి దిగుతున్నట్లుగా గత కొంతకాలంగా సామాజిక మాధ్యమాల్లో వార్తలు వైరల్ అవుతున్న విషయం నా దృష్టికి వచ్చింది. దీనిపై క్లారిటీ ఇవ్వాలని నాపై ఒత్తిడి పెరుగుతోంది. నేను ప్రస్తుతం బెంజ్ సినిమా షూటింగ్‌లో ఉన్నా. జూన్ 10వ తేదీతో ఈ షూటింగ్ షెడ్యూల్ పూర్తవుతుంది. మా అమ్మగారి ఆశీస్సులతో నా జీవితానికి సంబంధించి జూన్ 11 (గురువారం) ఉదయం 9.30 గంటలకు కీలక నిర్ణయం ప్రకటిస్తానని లారెన్స్ ట్వీట్ చేశారు. దాంతో లారెన్స్ రాజకీయాల్లోకి రావడం ఖాయమైందని, దళపతి విజయ్‌కి చెందిన టీవీకేలో చేరుతున్నట్లు ఆయన ప్రకటన చేస్తారని కోలీవుడ్‌లో చర్చ జరుగుతోంది. మరి రాజకీయాలపై లారెన్స్ నిర్ణయం ఏంటో తెలియాలంటే జూన్ 11 వరకు వెయిట్ చేయాల్సిందే.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X