రజనీకాంత్ ‘పెట్ట’లో త్రిష ఫస్ట్ లుక్ ఇదే...
రజనీకాంత్ హీరోగా కార్తీక్ సుబ్బరాజ్ రూపొందుతున్న తమిళ చిత్రం 'పెట్టా' సినిమా ద్వారా త్రిష చిరకాల కోరిక తీరింది. ఈ సూపర్ స్టార్ తో సినిమా చేయాని ఎప్పటి నుంచో కలలు కంటున్న త్రిష ఎట్టకేలకు దాన్ని నిజం చేసకున్నారు. తాజాగా చిత్ర బృందం త్రిష పాత్రకు సంబంధించిన పోస్టర్‌ను విడుదల చేసింది.
'వన్ అండ్ ఓన్లీ సూపర్‌స్టార్ రజనీకాంత్‌కు జోడీగా నటించాలనే నా కోరిక తీరింది. సంతోషంగానూ, గర్వంగా ఉంది..' అని త్రిష ట్వీట్ చేశారు. ఈ చిత్రంలో 'సారో' పాత్రలో త్రిష కనిపించబోతోంది. ఫస్ట్ లుక్ చూస్తుంటే ఆమె గృహిణిగా కనిపించబోతున్నట్లు తెలుస్తోంది.
ఈ చిత్రంలో రజనీకాంత్ కళాశాల వార్డెన్‌గా, ఫ్లాష్‌బ్యాక్‌లో సైనిక అధికారిగా రెండు భిన్నమైన పాత్రల్లో కనిపించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే సినిమాకు సంబంధించిన కొన్ని స్టిల్స్ బయటకు లీక్ అవ్వడంతో ఈ వివరాలు బయటకు పొక్కాయి.

'పెట్టా' ద్వారా బాలీవుడ్ నటుడు నవాజుద్దీన్ సిద్ధికీ తమిళ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇస్తున్నారు. సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ మూవీలోవిజయ్‌సేతుపతి, బాబిసింహా, శశి కుమార్, సిమ్రన్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. షూటింగ్ పూర్తి చేసుకుని సంక్రాంతికి ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.


Click it and Unblock the Notifications











