ఆల్రెడీ ఒకడు నన్ను తీసుకున్నాడు: బాయ్ ఫ్రెండ్ గురించి త్రిష!

హీరోయిన్ త్రిష కెరీర్ పరంగా సూపర్ సక్సెస్ అయింది. సౌత్ సినీ ఇండస్ట్రీలో ఒకానొక సందర్భంలో నెం.1 హీరోయిన్‌గా తన హవా కొనసాగించింది. ఇప్పటికీ సినిమాలు చేస్తూ సుదీర్ఘకాలం ఇండస్ట్రీలో సర్వైవ్ అయిన అతికొద్ది మంది తారల్లో ఒకరిగా నిలిచింది. అయితే ఈ చెన్నై బ్యూటీ పర్సనల్ లైఫ్ మాత్రం అంత సాఫీగా సాగలేదు లేదు.

గతంలో బిజినెస్‌మెన్ వరుణ్ మణియన్‌తో త్రిష ప్రేమ వ్యవహారం పెళ్లి వరకు వెళ్లింది. ఎంగేజ్మెంట్ జరిగిన తర్వాత ఇద్దరి మధ్య విబేధాలు వచ్చి విడిపోయిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి త్రిష సింగిల్‌గానే ఉంటుంది. ఆ మధ్య రానాతో ఎఫైర్ కొనగించినట్లు కూడా వార్తలు ప్రచారంలోకి వచ్చిన సంగతి.

త్రిష మళ్లీ ప్రేమలో పడిందా?

త్రిష మళ్లీ ప్రేమలో పడిందా?

తాజాగా త్రిష మళ్లీ ప్రేమలో పడ్డట్లు వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. ఇటీవల తన అభిమానులతో ట్విట్టర్ చాట్లో పాల్గొన్న ఆమె ఇందుకు సంబంధించి ఓ హింట్ ఇచ్చారు. దీంతో త్రిష బాయ్ ఫ్రెండ్ ఎవరు? అనే అంశం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయింది.

ఇపుడు సింగిల్‌గానే ఉన్నాను.. కానీ ఒకరు నన్ను తీసుకున్నారు

ఇపుడు సింగిల్‌గానే ఉన్నాను.. కానీ ఒకరు నన్ను తీసుకున్నారు

మీరు పెళ్లి ఎప్పుడు చేసుకుంటారు? అని అభిమాని అడిగిన ప్రశ్నకు త్రిష ఆసక్తిక సమాధానం ఇచ్చారు. ‘ఇపుడు సింగిల్‌గానే ఉన్నాను.. కానీ ఒకరు నన్ను తీసుకున్నారు' అంటూ రిప్లై ఇచ్చారు. ఇలా చెప్పడం ద్వారా తాను ప్రేమలో పడ్డ విషయమై త్రిష పరోక్షంగా హింట్ ఇచ్చినట్లు చర్చించుకుంటున్నారు.

వయసు ముదురుతున్న త్రిష

వయసు ముదురుతున్న త్రిష

ప్రస్తుతం త్రిష వయసు 36 సంవత్సరాలు... ఇప్పటికే పెళ్లి వయసు విషయంలో చాలా ముదిరిపోయింది. ప్రస్తుతం ప్రేమలో ఉన్నట్లు హింట్ ఇచ్చిన ఈ బ్యూటీ త్వరలోనే పెళ్లి కబురు చెప్పే అవకాశం ఉందని తాజా పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి.

సినిమాలు..

సినిమాలు..

గతేడాది 96, పెట్టా చిత్రాల్లో నటించి విజయాలు అందుకున్న త్రిష ప్రస్తుతం ఐదు తమిళ చిత్రాలు చేస్తూ బిజీగా గడుపుతోంది. గతంలో త్రిష పెళ్లి రద్దవ్వడానికి కారణం తాను సినిమా ఇండస్ట్రీలో కంటిన్యూ అయ్యేందుకు వారు ఒప్పుకోక పోవడమే. అయితే ఈసారి పెళ్లి చేసుకుంటే అలాంటి సమస్య లేకుండా ముందు జాగ్రత్త పడే అవకాశం ఉందని టాక్.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X