టీవీ యాంకర్ కిడ్నాప్ కేసులో త్రిష అరెస్టు.. షాకింగ్ విషయాలు బయటకు!
ఓ టీవీ ఛానెల్ యాంకర్ క్రిడ్నాప్ కేస్ ఘటన ప్రస్తుతం హైదరాబాద్‌లో కలకలం రేపుతోంది. త్రిష అతడిని కిడ్నాప్ చేసినట్లు తెలుస్తోంది. అయితే ఈ ఘటనలో పోలీసులు ఆమెను అరెస్ట్ చేసినట్లు సమాచారం అందింది. ప్రస్తుతం ఈ విషయం మీడియా వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. అందరూ దీని గురించే తెగ చర్చించుకుంటున్నారు. పూర్తి వివరాలను స్టోరీలోకి వెళ్లి తెలుసుకుందాం..
హైదరాబాద్‌లో ప్రస్తుతం సినిమా రేంజ్లో ఓ కిడ్నాప్ కేస్ కలకలం రేపుతోంది. ప్రణవ్ అనే ఓ టెలివిజన్ యాంకర్ కిడ్నాప్‌కు గురవ్వడం చర్చనీయాంశంగా మారింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. త్రిష అనే యువతి ఈ కిడ్నాప్ చేసినట్లు తెలిసింది. సదరు యాంకర్‌ను ఎలాగైన బలవంతంగా పెళ్లి చేసుకోవాలనే ఉద్దేశంతో ఆమె ఇలా చేసినట్లు సమాచారం అందింది.

మ్యాట్రిమోనిలో ప్రొఫైల్ చూసి : త్రిష అనే యువతి డిజిటల్ మార్కెటింగ్ బిజినెస్ చేస్తోందని అంటున్నారు. అయితే భారత్ మ్యాట్రిమోనీలో ప్రణవ్ ఫోటోలను చూసి ప్రేమలో పడిందట. అతడిపై మనసు పారేసుకున్న ఆమె పెళ్లి చేసుకుంటే అతడినే చేసుకోవాలని బలంగా నిర్ణయించుకుంది. దీంతో ప్రణవ్ను కిడ్నాప్ చేసింది.
పోలీసులను ఆశ్రయించిన ప్రణయ్ : కిడ్నాప్ అయిన ప్రణవ్.. త్రిష చెర నుంచి తప్పించుకుని పోలీసులను ఆశ్రయించాడు. దీంతో అధికారులు అప్రమత్రమై ఆమెను పట్టుకున్నారు. అలా త్రిష ఇప్పుడు కిడ్నాప్ కేసులో త్రిష చేతికి చిక్కింది. అయితే పోలీసులను ఆశ్రయించిన ప్రణయ్ తాను ఎంతో నరకం అనుభవించినట్లు చెప్పినట్లు కథనాలు వస్తున్నాయి.
సైబర్ నేరస్థుల హస్తం : అయితే ఇక్కడ మరో షాకింగ్ విషయం గురించి తెలిసింది, అసలు యాంకర్ ప్రణవ్ మ్యాట్రిమోనీలో ప్రొఫైల్ పెట్టలేదట. అతడి పేరుతో ఫేక్ ఐడీ సృష్టించి అకౌంట్ క్రియేట్ చేశారని తెలిసింది. గుర్తు తెలియని సైబర్ దుండగులు ప్రణవ్ పేరు మీద డబ్బు సంపాదించాలనే స్కెచ్ వేశారు. అలా మ్యాట్రీమోనీలో ఫేక్ ఐడీ క్రియేట్ చేశారు.

అసలు విషయం తెలీకుండా ప్రేమలో : ఇక ప్రణవ్ ఐడీని అనుకోకుండా చూసి ఇష్టపడి త్రిష.... అతడినే పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుంది. ఈ క్రమంలోనే అతడిపై విపరీతమైన ప్రేమను పెంచుకున్న త్రిష తనను పెళ్లి చేసుకోమని కోరింది. కానీ అతడు ఒప్పుకోలేదని అంటున్నారు. దీంతో సదరు యువతి అతడిని దాదాపు మూడు రోజుల పాటు బంధించిందని చెబుతున్నారు. అయితే అక్కడి నుంచి తప్పించుకున్న ప్రణవ్.. పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో రంగంలోకి దిగిన అధికారులు త్రిషను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు తెలిసింది. ఆమె దాదాపు మూడు వందల కోట్ల రూపాయల ఐదు స్టార్టప్ కంపెనీలకు డైరెక్టర్‌గా ఉన్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ కిడ్నాప్ కేస్ హాట్ టాపిక్‌గా మారింది.


Click it and Unblock the Notifications











