Trisha Krishnan: విజయ్‌తో రిలేషన్‌పై వివాదాస్పద వ్యాఖ్యలు.. పార్థిబన్‌‌తో వివాదానికి త్రిష అలా చెక్

తమిళ సినీ, రాజీకీయ వర్గాల్లో దళపతి విజయ్ - త్రిష కృష్ణన్‌ల వ్యవహారం హాట్ టాపిక్‌గా మారింది. విజయ్‌కి ఆయన సతీమణి సంగీత విడాకుల నోటీసు ఇవ్వడంతో పాటు తాను ఎందుకు విడాకులు తీసుకోవాల్సి వచ్చిందో పలు కారణాలను ప్రస్తావించింది. ఓ తమిళ నటితో తన భర్తకున్న వివాహేతర సంబంధం కూడా ఒక కారణంగా సంగీత పేర్కొన్నారు. ఈ విషయంలో మా ఇద్దరి మధ్య గొడవలు జరుగుతున్నాయని ఆమె వెల్లడించారు. అయితే ఆ హీరోయిన్ ఎవరు అన్నదానిపై సంగీత పేరు బయటపెట్టలేదు. అయితే అందరి వేళ్లూ త్రిషపైనే చూపిస్తున్నాయి.

Also Read
'సుఖం కోసం హీరోయిన్లకు అలాంటి చాక్లెట్లు... కాంప్రమైజ్ అడిగితే కట్ చేయడమే'
'సుఖం కోసం హీరోయిన్లకు అలాంటి చాక్లెట్లు... కాంప్రమైజ్ అడిగితే కట్ చేయడమే'

దీనికి కొద్దిరోజుల ముందు తమిళనాడు బీజేపీ చీఫ్ నైనార్ నాగేంద్రన్ చేసిన వ్యాఖ్యలే ఇందుకు కారణం. త్రిష ఇంట్లో నుంచి బయటకు వస్తేనే విజయ్‌కి వాస్తవాలు తెలుస్తాయంటూ నాగేంద్రన్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. ఈ వ్యాఖ్యలకు తర్వాత ఆయన క్షమాపణలు చెప్పారు. ఆలోపే సంగీత కూడా తన భర్త వివాహేతర సంబంధాన్ని బయటపెట్టడంతో ఆ నటి త్రిషేనంటూ అంతా అనుమానిస్తున్నారు. సరిగ్గా ఇదే సమయంలో దళపతి విజయ్‌తో త్రిష జంటగా ఓ వివాహ కార్యక్రమానికి హాజరుకావడం ఈ అనుమానాలకు మరింత బలాన్ని చేకూర్చింది. దాంతో త్రిష- విజయ్‌ల బంధంపై టీవీకే అభిమానులు, సినీ వర్గాలు కూడా మిశ్రమంగా స్పందిస్తున్నాయి. కొందరు ఇది వారిద్దరి పర్సనల్ విషయం అని లైట్ తీసుకుంటుంటే.. మరికొందరు మాత్రం ఘాటుగా రియాక్ట్ అవుతున్నారు.

Trisha Krishnan Poses With Parthiban daughter Keerthana Amid Controversy Photos Go Viral

ఈ క్రమంలోనే త్రిషపై సీనియర్ నటుడు పార్ధిబన్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఓ అవార్డ్ ప్రదానోత్సవానికి హాజరైన పార్ధిబన్‌‌ను త్రిష గురించి మీ అభిప్రాయం చెప్పాల్సిందిగా యాంకర్ కోరారు. దీనికి ఆయన స్పందిస్తూ.. పొన్నియన్ సెల్వన్‌లో త్రిష పోషించిన కుందవై పేరుతో ఆమెపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఈ కుందవై (త్రిష) కొన్నాళ్లు ఇంట్లోనే కూర్చుంటే మంచిది. ఆమె బయట అడుగుపెట్టడం చాలా సమస్యలకు కారణమవుతోంది అంటూ పార్ధిబన్ వ్యాఖ్యానించారు. విజయ్‌- త్రిషల రిలేషన్‌ను ఉద్దేశించే పార్ధిబన్ పరోక్షంగా ఈ వ్యాఖ్యలు చేశారంటూ తమిళ సినీ, రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. దీనిపై త్రిష వెంటనే రియాక్ట్ అయ్యారు.

Recommended For You
'అలా నన్ను లొంగదీసుకుని.. రాత్రి 9 దాటితే.. ఆ కోరిక తీర్చుకోవాల్సిందే’
'అలా నన్ను లొంగదీసుకుని.. రాత్రి 9 దాటితే.. ఆ కోరిక తీర్చుకోవాల్సిందే’

అయితే జరిగిన తప్పుపై త్రిషకు పార్ధిబన్ క్షమాపణలు చెప్పారు. బయట ఎలాంటి సమస్యలు రాకుండా ఉండాలంటే త్రిష ఇంట్లోనే ఉండాలని సరదాగా వ్యాఖ్యానించాను. అయినప్పటికీ వేదిక మీద నేను ఆ మాట అని ఉండకూదదు. స్టేజ్ దిగి వస్తుండగా ఈ వ్యాఖ్యలపై సీనియర్ జర్నలిస్ట్ ఒకరు నన్ను హెచ్చరించగా నేను ఆ క్లిప్పింగ్ తొలగించమని నిర్వాహకులను కోరాను. కానీ అప్పటికే అది సోషల్ మీడియాలోకి వెళ్లిపోయింది. అలాగే త్రిష ఫోటోను స్క్రీన్‌పై ప్రదర్శించాలని నేను కోరలేదు. ఏది ఏమైనా జరిగినదానికి క్షమించాలని పార్ధిబన్ కోరారు. ఆ తర్వాత దీనిపై త్రిష ఎలాంటి రియాక్షన్ ఇవ్వలేదు.

You May Also Like
పబ్లిక్‌గా రోజాతో మిస్‌బిహేవ్... టాప్ సెలబ్రిటీకి ఇచ్చిపడేసిన వైసీపీ ఫైర్‌బ్రాండ్
పబ్లిక్‌గా రోజాతో మిస్‌బిహేవ్... టాప్ సెలబ్రిటీకి ఇచ్చిపడేసిన వైసీపీ ఫైర్‌బ్రాండ్

కాగా.. పార్ధిబన్‌తో వివాదం వేళ త్రిష ఊహించని షాకిచ్చారు. స్టైలిస్ట్ ఎకా లఖాని రవి - రవి భాగ్‌చంద్కా వివాహం శనివారం ముంబైలో ఘనంగా జరిగింది. ఈ వేడుకకు పలువురు సినీ ప్రముఖులు హాజరయ్యారు. వారిలో త్రిష కూడా ఉన్నారు. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలను ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. ఈ ఫోటోలలో త్రిష పక్కన పార్థిబన్ కుమార్తె కీర్తన కూడా ఉండటం హాట్ టాపిక్‌గా మారింది. జెన్ జెడ్ తరంతో నేను అంటూ త్రిష రాసుకొచ్చారు. అలాగే ఈ పెళ్లిలో తన ఫేవరెట్ డైరెక్టర్ మణిరత్నంతోనూ త్రిష ఫోటో దిగారు. ఊదా రంగు పట్టు చీర ధరించి, బంగారు ఆభరణలతో త్రిష మెరిసిపోయారు. మొత్తంగా పార్ధిబన్‌ కుమార్తెతో కలివిడిగా ఉండటం ద్వారా ఆయనతో వివాదానికి త్రిష తెరదించారని సినీవర్గాల్లో చర్చ జరుగుతోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X