నా కొడుకు చనిపోయాడు .. త్రిష షాకింగ్ పోస్ట్ , ఆ బిడ్డ ఎవరు?
సాధారణంగా సినీ పరిశ్రమలో హీరోయిన్స్ కంటే హీరోలే ఒకేలాంటి స్టార్డం కానీ సినిమాలు కానీ మెయింటైన్ చేస్తూ ఉండటంకనిపిస్తుంది. బట్ కేవలం కొందరి హీరోయిన్స్ ఈ విషయంలో డిఫరెంట్‌గా ఉంటారు అని చెప్పాలి. ఇపుడు సౌత్ ఇండియన్ ఇండస్ట్రీలో ఉన్న స్టార్ హీరోలను చూస్తే వారు దాదాపు రెండు తరాల హీరోయిన్స్‌తో నటించినవారు ఉంటారు.
అలాగే హీరోయిన్స్ ఇలా ఎప్పటికప్పుడు మారిపోతారు కానీ ఆ హీరోయిన్స్‌లో ఇలా రెండు తరాల హీరోలతో నటించడమో లేదంటే.. తమ కెరీర్ స్టార్టింగ్‌లో ఉన్న హీరోలతో కానీ రెండు దశాబ్దాల తర్వాత కూడా కనిపించడం అనేది చాలా అరుదుగా కనిపిస్తుంది. అలాంటి అరుదైన హీరోయిన్స్‌లో కోలీవుడ్ సహా తెలుగులో కూడా బాగా పాపులర్ అయ్యిన బ్యూటీ త్రిష ఒకరు అని చెప్పాలి. కాగా త్రిష ఎప్పటి నుంచో సినిమాల్లో ఉంది.

ఇంట్రెస్టింగ్‌గా ఇప్పటికీ అదే డిమాండ్ భారీ సినిమాలు చేస్తూ బిజీగా ఉంది. మధ్యలో కొత్త హీరోయిన్స్ పోటీ తట్టుకోలేకపోయింది. కానీ ఫైనల్‌గా ఇపుడు మాత్రం తెలుగు , తమిళ్ చిత్రాల్లో ఫుల్ బిజీగా కనిపిస్తుంది. త్రిష హీరోయిన్‌గా నటిస్తున్న సినిమాలను పక్కన పెడితే ఆమె ఇప్పటికీ పెళ్లి చేసుకోలేదు అని చాలా మందికి తెలిసిందే. కానీ ఈ క్రిస్మస్ రోజు తన కొడుకు చనిపోయాడు అంటూ ఒక షాకింగ్ పోస్ట్ పెట్టి అందరికీ షాకిచ్చింది.
పెళ్లి కాకుండా అప్పుడే కొడుకు తన కొడుకు చనిపోవడం కూడా జరిగిందా అని కొందరు, అసలు తన కొడుకు ఎవరు అని ఇంకొందరు ప్రశ్నిస్తున్నారు. అయితే త్రిష తన కొడుకు అంటూ చెప్పింది నిజంగా ఆమెకి పుట్టిన కొడుకో లేదా దత్తత తీసుకున్న కొడుకో కాదు తాను ఆప్యాయంగా పెంచుకున్న కుక్క పిల్ల జోరో అని ఆ తర్వాత రివీల్ చేసింది.
ఈ క్రిస్మస్ ఇలా మొదలవుతుంది అని అసలు అనుకోలేదు. నా సన్నిహితులకు, మిత్రులకు బాగా తెలుసు నా జోరో లేకపోతే జీరో అని, నేను మా కుటుంబం విషాదంలో ఉన్నాము. ప్రస్తుతం నేను ఎలాంటి పని చెయ్యలేను నాకు కొంత సమయం కావాలి అంటూ త్రిష ఒక ఎమోషనల్ పోస్ట్ పెట్టింది. మనుషులకి ఎమోషనల్‌గా ఎంతో దగ్గరైన జంతువు ఏదైనా ఉంది అంటే అది కుక్కే అని చాలా మంది అంటారు. వాటిని చాలామంది వారి ఇంట్లో వారి లానే ట్రీట్ చేస్తారు కూడా.
మరి ఇపుడు త్రిష కూడా అలాంటి పరిస్థితిలోనే ఉందని చెప్పాలి. ఈ సంగతి పక్కనపెడితే రీసెంట్‌గానే దళపతి విజయ్‌తో కలిసి హీరోయిన్ కీర్తి సురేష్ పెళ్ళికి వెళ్లిన త్రిష మరోసారి వార్తల్లో నిలిచింది. కాగా తెలుగులో ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి సరసన విశ్వంభర సినిమాలో తాను నటిస్తుంది.


Click it and Unblock the Notifications











