పూజా హెగ్డే బాయ్ ఫ్రెండ్, హైదరాబాద్‌లో కొత్త ఇల్లు.. గుట్టు విప్పిన త్రివిక్రమ్, అల్లు అరవింద్
వరుస బాక్సాఫీస్ హిట్స్ తో దూసుకుపోతున్న పూజా హెగ్డేకు గత ఏడాది అల.. వైకుంఠపురములో ద్వారా వచ్చిన క్రేజ్ ద్వారా మరో లెవెల్ కు వెళ్లిందనే చెప్పాలి. త్రివిక్రమ్, అల్లు అర్జున్ కాంబినేషన్ లో వచ్చిన ఆ సినిమా ఇండస్ట్రీలో టాప్ బాక్సాఫీస్ హిట్స్ లో ఒకటిగా నిలిచింది. ఇక సినిమా మొదటి పుట్టినరోజు అంటూ చిత్ర యూనిట్ రీ యూనియన్ ఈవెంట్ తో ఆనందాన్ని మరోసారి పంచుకుంది. పూజా హెగ్డే బాయ్ ఫ్రెండ్, హైదరాబాద్ లో కొత్త ఇల్లు.. అనే కామెంట్స్ ఈ వేడుకలో హైలెట్ అయ్యాయి.

స్పెషల్ ఎట్రాక్షన్ గా పూజా హగ్డే
అల.. వైకుంఠపురములో సినిమా ఏ స్థాయిలో విజయాన్ని అందుకుందో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. అయితే అంతకంటే హై రేంజ్ లో చిత్ర యూనిట్ సెలబ్రేషన్స్ చేసుకుంటోంది. ఎందుకంటే సినిమాకు సంబంధించిన ఎదో రికార్డు సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంది. ఇక పూజా హెగ్డే వేడుకలో స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలువగా ఆమెపై చిత్ర యూనిట్ సభ్యులు సరదాగా పంచ్ లు వేశారు.

తెలుగబ్బాయినే పెళ్లి చేసుకోవాలని..
మొదట మాట్లాడిన అల్లు అరవింద్ పూజా హెగ్డేపై ఎన్నో పాజిటివ్ కామెంట్స్ చేశారు. ఆమె బాలీవుడ్ లో ఆఫర్స్ అందుకుంటుండగా తెలుగులో కూడా ఇంకా చాలా సినిమాలు చేయాలని అన్నారు. ఇక ఇక్కడే స్థిరపడలని కోరుకుంటూ కుదిరితే తెలుగు అబ్బాయినే పెళ్లి చేసుకోవాలని అన్నారు.

పూజా హెగ్డే కొత్త ఇల్లు
హైదరాబాద్ లోనే ఉండాలని మాట్లాడుతుండగా ఆమె కొత్త ఇల్లు కొంటున్న విషయాన్ని కూడా అల్లు అరవింద్ బయటకు చెప్పేశాడు. గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో పూజా హగ్డే కొత్త ఇల్లు కొనుక్కుంటున్నట్లు రూమర్స్ వస్తున్న విషయం తెలిసిందే. అయితే అవి రూమర్స్ అని టాక్ రాగా ఇప్పుడు అల్లు అరవింద్ క్లారిటీ ఇవ్వడంతో నిజమని తేలిపోయింది.

పూజ బాయ్ ఫ్రెండ్.. నా అసోసియేట్
ఇక దర్శకుడు త్రివిక్రమ్ కూడా చిత్ర యూనిట్ సభ్యులందరి కష్టాన్ని గుర్తు చేస్తూ తనదైన శైలిలో మాటలతో ఆకట్టుకున్నారు. పూజా హెగ్డేకు ఓ బాయ్ ఫ్రెండ్ ఉన్నాడని అనడంతో ఒక్క సెకన్ అందరిని షాక్ కు గురి చేసింది. అతను మరెవరో కాదు. తన అసోసియేట్ డైరెక్టర్ అని చెప్పేశాడు. చిత్ర యూనిట్ సభ్యులు అందరూ నవ్వుతూ ఉండగా గురూజీ మళ్ళీ క్లారిటీ ఇచ్చేశాడు.

కథ వింటే నిద్రపోయేది..
సినిమా షూటింగ్ జరిగినన్ని రోజులు కూడా పూజా హగ్దేకు ఎక్కువ సార్లు కథ వినిపించింది నా అసోసియేట్ డైరెక్టర్ ఆనంద్ అంటూ.. ఉదయం లేవగానే ఆమెకు కాథను మొత్తం వినిపిస్తే నిద్దరవచ్చేది అని అంతలా ఆమెకు అలాంటి ఫీల్ ను కలిగించాడని త్రివిక్రమ్ సరదాగా వివరణ ఇచ్చారు. ఇక సినిమాకు తన అసిస్టెంట్ డైరెక్టర్స్ చాలా కష్టపడ్డారని కూడా మాటల మాంత్రికుడు ప్రతి ఒక్కరి కష్టం గురించి వివరణ ఇచ్చాడు.


Click it and Unblock the Notifications











