Allu Arjun త్రివిక్రమ్ కలయికలో రాబోతున్న సినిమా.. అలాంటి సబ్జెక్ట్ తో నేవ్వర్ బిఫోరే అనేలా బిగ్ ప్లాన్
మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ అల్లు అర్జున్ తో మరో సినిమా చేయబోతున్నట్లు అధికారికంగా ప్రకటన ఇచ్చిన విషయం తెలిసిందే. హారిక హాసిని గీతా ఆర్ట్స్ ప్రొడక్షన్లో తెరపైకి రాబోతున్న ఈ సినిమాపై చాలా రోజులుగా అనేక రకాల రూమర్స్ అయితే వస్తున్నాయి.
ఇక మొత్తానికి సినిమాపై అధికారికంగా క్లారిటీ అయితే ఇచ్చారు. అయితే ఈ సినిమా ఎప్పుడు మొదలవుతుంది అలాగే ఎలా ఉండబోతుంది అనే విషయంలో మాత్రం ఇంకా ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. కానీ ప్రస్తుతం మాత్రం ఒక టాక్ అయితే వైరల్ అవుతుంది. ఆ వివరాలలోకి వెళితే..

మహేష్ బాబుతో బిజీగా: త్రివిక్రమ్ శ్రీనివాస్ ప్రస్తుతం మహేష్ బాబుతో గుంటూరు కారం అనే సినిమా చేస్తున్నాడు. ఇప్పటికే అనేక సార్లు షూటింగ్ దశలోనే సమస్యలను ఎదుర్కొన్న ఈ సినిమా మొత్తానికి ఇటీవల కాస్త స్పీడ్ పెంచుకుంది. తప్పకుండా సంక్రాంతి కనుకగా సినిమాను విడుదల చేయాలి అని చిత్ర యూనిట్ సభ్యులు గట్టిగానే ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ఆ సినిమా షూటింగ్ ఇంకా 50% పూర్తవకుండానే త్రివిక్రమ్ మరో ప్రాజెక్టును అధికారికంగా అనౌన్స్ అయితే చేసేసాడు.

మరోసారి బిగ్ కాంబినేషన్లో: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తో త్రివిక్రమ్ శ్రీనివాస్ మరోసారి జతకట్టబోతున్నాడు అని తెలియగానే అంచనాలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. ఇదివరకే వీరి కలయికలో మూడు సినిమాలు వచ్చాయి. జులాయి, ఆ తర్వాత సన్నాఫ్ సత్యమూర్తి రెండు కూడా బ్యాక్ టు బ్యాక్ సక్సెస్ కాగా ఆ తర్వాత మూడవ సారి వచ్చిన అల..వైకుంఠపురములో.. కూడా మంచి విజయాన్ని అందుకుంది. ఏకంగా ఈ సినిమా ఇండస్ట్రీ హిట్స్ లో ఒకటిగా నిలిచింది.

త్రివిక్రమ్ టార్గెట్: అయితే అల..వైకుంఠపురములో సినిమా తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్ వెంటనే మహేష్ బాబుతో కొత్త సినిమాను మొదలుపెట్టాలని అనుకున్నాడు. కానీ అనేక కారణాల వలన ఆ సినిమా షూటింగ్ వాయిదాలు పడుతూ వస్తోంది. ఇక మొత్తానికి ఇటీవల రెగ్యులర్ షూటింగ్ మొదలుపెట్టేశారు. తప్పకుండా ఈ ఏడాది నవంబర్ లో ఫినిష్ చేయాలని అనుకుంటున్నారు. కానీ ఇప్పటివరకు అయితే సినిమా షూటింగ్ ఇంకా 50% కూడా పూర్తి కాలేదు.
ఆ బ్యాక్ డ్రాప్ లో కొత్త సినిమా: అయితే మహేష్ బాబు గుంటూరు కారం సినిమా షూటింగ్ దశలో ఉండగానే అల్లు అర్జున్ తో సినిమా చేయబోతున్నట్లు త్రివిక్రమ్ ప్రకటన ఇవ్వడం ఒక విధంగా ఫ్యాన్స్ కు మంచి కిక్ అయితే ఇస్తుంది. అయితే ఈ సినిమా ఏ విధంగా ఉండబోతుంది అనే విషయంలో కూడా ఒక టాక్ వైరల్ అవుతుంది.
త్రివిక్రమ్ గతంలో ఎప్పుడూ లేనివిధంగా ఈసారి సోషియో ఫాంటసీ బ్యాక్ డ్రాప్ లో ఒక కొత్త సినిమాను తెరపైకి తీసుకురాబోతున్నట్లుగా ఇండస్ట్రీలో ఒక టాక్ అయితే ఇప్పుడు వైరల్ గా మారుతోంది. ఇక ఇది ఎంతవరకు నిజం అనేది ఎవరు క్లారిటీ ఇవ్వలేదు. కానీ ఈసారి మాత్రం అంతకుమించి అనేలా ఉంటుంది అని హింట్ అయితే ఇచ్చారు. మరి ఈ సినిమా ఎప్పుడు సెట్స్ పైకి వస్తుందో చూడాలి.


Click it and Unblock the Notifications











