SSMB28: ఫ్యాన్స్‌లో జోష్ నింపనున్న మహేశ్.. ఆమె ఓకే అంటే ఆగేదేలేదట

అప్పట్లో కొన్ని డిజాస్టర్లతో ఇబ్బందులు పడ్డా.. ఈ మధ్య కాలంలో వరుసగా హిట్లు మీద హిట్లు కొడుతూ కెరీర్‌లో మునుపెన్నడూ లేనంత ఫామ్‌తో కనిపిస్తున్నాడు టాలీవుడ్ బడా హీరో సూపర్ స్టార్ మహేశ్ బాబు. ఈ జోష్‌తోనే అతడు ఒకటి పట్టాలపై ఉండగానే మరొకటి అన్నట్లుగా సినిమాల చేస్తున్నాడు. ఈ క్రమంలోనే ఈ ఏడాది ఆరంభంలో 'సర్కారు వారి పాట' అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. దీనికి టాక్ బాగానే ఉన్నా కలెక్షన్లు మాత్రం పూర్తి స్థాయిలో రాలేదు. అయినప్పటికీ ఆ ఫలితాన్ని పట్టించుకోకుండా ఇప్పుడు మహేశ్.. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో ఓ సినిమాను మొదలు పెట్టేశాడు.

దాదాపు పన్నెండేళ్ల తర్వాత సూపర్ స్టార్ మహేశ్ బాబు - త్రివిక్రమ్ శ్రీనివాస్ కలయికలో రాబోతున్న ఈ సినిమా ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందుతోంది. ఈ సినిమాకు సంబంధించిన రెగ్యూలర్ షూటింగ్ ఇప్పటికే ప్రారంభం అయింది. ఫస్ట్ షెడ్యూల్‌లో అదిరిపోయే యాక్షన్ సీక్వెన్స్‌ను షూట్ చేశారు. ఇదంతా అదిరిపోయేలా వచ్చిందని తెలుస్తోంది. ఇక, తల్లి ఇందిరా దేవి మరణంతో మహేశ్ బాబు తన సినిమా షూటింగ్‌కు కాస్త విరామం ప్రకటించాడు. ఇప్పుడు మళ్లీ పూజా హెగ్డే వల్ల సినిమాకు గ్యాప్ వచ్చింది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ చిత్రం గురించి ఓ న్యూస్ బయటకు వచ్చింది.

Trivikram and Mahesh Babu Movie New Schedule From November 3rd Week

క్రేజీ కాంబోలో ఎంతో ప్రతిష్టాత్మకంగా రాబోతున్న ఈ సినిమా కొత్త షెడ్యూల్‌ను నవంబర్ 3వ వారం నుంచి మొదలు పెట్టబోతున్నారట. ప్రస్తుతం గాయంతో బాధ పడుతోన్న పూజా హెగ్డే అప్పటికి కోలుకుంటుందని, అందుకే అంత సమయం తీసుకుంటున్నారని తెలుస్తోంది. ఇక, ఈ మూవీ షూటింగ్ మొదలైన తర్వాత ఏమాత్రం బ్రేకులు లేకుండా సాగేలా ప్లాన్ చేసుకున్నారని అంటున్నారు. అంతేకాదు, వరుసగా షెడ్యూళ్లను జరుపుతూ మరికొన్ని నెలల్లోనే దీన్ని పూర్తి చేయాలని మహేశ్ బాబు ప్లాన్ చేసుకున్నాడన్న మాట. ఇది ఒకరకంగా ఫ్యాన్స్‌కు గుడ్ న్యూసే అని చెప్పొచ్చు.

Trivikram and Mahesh Babu Movie New Schedule From November 3rd Week

మహేశ్ బాబు హీరోగా త్రివిక్రమ్ రూపొందిస్తోన్న ఈ చిత్రాన్ని హారిక హాసినీ క్రియేషన్స్ బ్యానర్‌పై రాధాకృష్ణ నిర్మిస్తున్నారు. పూజా హెగ్డే ఇందులో హీరోయిన్‌గా చేస్తోంది. థమన్ దీనికి సంగీతం అందిస్తున్నాడు. ఇక, దీనికి 'అర్జునుడు', 'అతడే పార్థు' వంటి టైటిళ్లు పరిశీలనలో ఉన్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X