భీమ్లా నాయక్ లో త్రివిక్రమ్ పవర్ఫుల్ సెంటిమెంట్.. ఆ స్టార్ కమెడియన్ తో స్పెషల్ రోల్?

టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో మెగా, పవర్ స్టార్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా భీమ్లా నాయక్. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన పాటలు అన్నీ కూడా యూ ట్యూబ్ లో భారీ స్థాయిలో వ్యూవ్స్ కూడా అందుకుంటున్నాయి. అయితే ఈ సినిమాకు సంబంధించిన అన్ని పనులను కూడా దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దగ్గరుండి చూసుకుంటున్నాడు. మాటలు మాత్రమే అందించినప్పటికి కీలక సన్నివేశాల్లో మాత్రం తన స్టైల్ ఉండేలా చూసుకున్నాడట. అయితే ఎప్పటిలాగే తన సినిమాల్లో మాదిరిగా త్రివిక్రమ్ భీమ్లా నాయక్ సినిమా కోసం కూడా ఒక పవర్ఫుల్ సెంటిమెంట్ ను బలంగా ఫాలో అయినట్లుగా తెలుస్తోంది. ఆ వివరాల్లోకి వెళితే..

Recommended Video

Bheemla Nayak Trailer Records భీమ్లా నాయక్ రికార్డుల బీభత్సం Pre Booking Status | Filmibeat Telugu
బాక్సాఫీస్ హిట్ అందుకోవాలని..

బాక్సాఫీస్ హిట్ అందుకోవాలని..

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఎలాంటి సినిమా చేసినా కూడా అందులో కమర్షియల్ గా అన్ని అంశాలు కూడా హైలెట్ అయ్యేలా చూసుకుంటాడు. ఇక పవన్ కళ్యాణ్ కు సంబంధించిన ప్రతి సినిమా విషయంలో కూడా త్రివిక్రమ్ ఆలోచనలను అందిస్తున్న విషయం తెలిసిందే. అంతే కాకుండా సినిమా మొదటి నుంచి చివరి వరకు కూడా తన ప్రమేయం ఉండేలా చూసుకుంటున్నాడు. వీలైనంత వరకు పవన్ కళ్యాణ్ బాక్సాఫీస్ వద్ద మంచి విజయాలను సాధించాలని త్రివిక్రమ్ ఆలోచిస్తున్నారు అర్థమవుతోంది.

త్రివిక్రమ్ సెంటిమెంట్స్

త్రివిక్రమ్ సెంటిమెంట్స్

ఇక ప్రస్తుతం అందరి ఫోకస్ అయితే భీమ్లా నాయక్ సినిమా పైనే ఉంది. తప్పకుండా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఒక సరికొత్త రికార్డు క్రియేట్ చేస్తుంది అని నమ్ముతున్నారు. అయితే ఈ సినిమా కోసం కూడా త్రివిక్రమ్ శ్రీనివాస్ ఒక సెంటిమెంట్ ను ఫాలో అయినట్లుగా తెలుస్తోంది. సాధారణంగా త్రివిక్రమ్ తన సినిమాలకు సంబంధించిన టైటిల్ విషయంలో మొదట అ అక్షరం వచ్చేలా జాగ్రత్తలు తీసుకుంటాడు అని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అంతే కాకుండా ఇద్దరు హీరోయిన్స్ సెంటిమెంట్ కూడా ఎప్పటినుంచో ఫాలో అవుతున్నారు.

బ్రహ్మానందం పాత్ర హైలెట్ అయ్యేలా

బ్రహ్మానందం పాత్ర హైలెట్ అయ్యేలా

ఇక త్రివిక్రమ్ శ్రీనివాస్ చాలావరకు పవన్ కళ్యాణ్ చేస్తున్న సినిమాలలో కూడా ఎంతో కొంత తన సెంటిమెంట్స్ ను అయితే ఫాలో అవుతున్నాడు. భీమ్లా నాయక్ సినిమాలో కామెడీ పాత్రలకు పెద్దగా అవకాశం లేకపోయినప్పటికీ బ్రహ్మానందం పాత్రను ప్రత్యేకంగా డిజైన్ చేసినట్లు సమాచారం. అయ్యప్పనుమ్ కొశీయుమ్ కథ కు రీమేక్ గా వస్తున్న ఈ సినిమా లో బ్రహ్మానందం పాత్ర చాలా హైలెట్ కానున్నట్లు తెలుస్తోంది. కామెడీ కింగ్ బ్రహ్మానందం గత కొంతకాలంగా అంతగా పవర్ఫుల్ పాత్రలో అయితే కనిపించలేదు. కానీ మన భీమ్లా నాయక్ లో మాత్రం ఆయన పాత్ర చాలా బాగా నవ్విస్తుంది అని టాక్ అయితే వస్తుంది

అలా ఫాలో అవుతున్న త్రివిక్రమ్

అలా ఫాలో అవుతున్న త్రివిక్రమ్

గతంలో త్రివిక్రమ్ శ్రీనివాస్ చాలావరకు కొంతమంది నటీనటులను సెంటిమెంట్గా కొనసాగిస్తూ వస్తున్నాడు. ఇక అందులో బ్రహ్మానందం కూడా ఒకరు. అల.. వైకుంఠపురం సినిమాలో ఆయన పాత్రకు అవకాశం లేకుండ పోయినప్పటికీ రాము లో రాము లో పాటలు ప్రత్యేకంగా కనిపించిన విషయం తెలిసిందే. ఏదో ఒక విధంగా బ్రహ్మానందం సినిమాల్లో ఉండాలని త్రివిక్రమ్ ఆలోచిస్తున్నాడు. అదే సెంటిమెంట్ సినిమాలు కూడా ఫాలో అవుతున్నట్లు తెలుస్తోంది. మరి ఈ ఫార్మాట్ సినిమాకు ఎంతవరకు అడ్వాంటేజ్ అవుతుందో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X