twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    సిరివెన్నెల సీతారామశాస్త్రి ఆరోగ్యంపై అభిమానుల్లో ఆందోళన.. స్పందించిన త్రివిక్రమ్ ఫ్యామిలీ!

    |

    తెలుగు చిత్ర పరిశ్రమలో అర్థవంతంగా ఎన్నో మధురమైన పాటలను రాస్తున్న అతికొద్ది మంది రచయితలలో సిరివెన్నెల సీతారామశాస్త్రి టాప్ లో ఉంటారని చెప్పవచ్చు. కాలానికి తగ్గట్టుగా కూడా సాహిత్యాన్ని కూడా మార్చుతూ వస్తున్నారు. ఆయన ఎలాంటి సాహిత్యం అందించినా కూడా అందరిని ఆలోచింపజేసేలా ఉంటాయి. ఇక ఇటీవల ఆయన హఠాత్తుగా అనారోగ్యానికి గురైనట్లు అనేక రకాల వార్తలు వెలువడ్డాయి.
    పద్మశ్రీ అవార్డు గ్రహీత, సాహితీవేత్త సిరివెన్నెల సీతారామశాస్త్రి న్యుమోనియాతో బాధపడుతూ హైదరాబాద్‌లోని ఆసుపత్రిలో చేరారు అంటూ ఆయన పరిస్థితి విషమంగా ఉన్నట్లు కొన్ని మీడియా ఛానళ్లు మరియు సోషల్ మీడియా వెబ్‌సైట్‌లు నివేదించాయి. కానీ ప్రస్తుతం చికిత్స పొందుతూ బాగానే ఉన్నారని కుటుంబ సభ్యులు క్లారిటీ ఇచ్చారు. అబద్ధపు ప్రచారాలను కూడా నమ్మవద్దని అన్నారు.

     ఆరోగ్యంపై రూమర్స్

    ఆరోగ్యంపై రూమర్స్

    సిరివెన్నెల సినిమాతో సిరివెన్నెల సీతారామశాస్త్రిగా మంచి గుర్తింపు అందుకున్న ఈ తెలుగు రచయితకు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా వివిధ రకాల భాషల్లో కూడా అనేకమంది అభిమానులు ఉన్నారు. విదేశాల్లో కూడా ఆయనకు మంచి క్రేజ్ ఉంది. అయితే ఇటీవల ఆయన కొంత అనారోగ్యంతో బాధపడుతున్నట్లు టాక్ వచ్చింది. ఈ విషయంలో అనేక రకాల రూమర్స్ అభిమానుల్లో ఆందోళనకు గురి చేశాయి.

     అవన్నీ అబద్దాలే..

    అవన్నీ అబద్దాలే..

    అయితే గత కొన్నిరోజులుగా వస్తున్న పుకార్లను తోసిపుచ్చుతూ, సీతారామశాస్త్రి కుటుంబ సభ్యులు క్లారిటీ ఇచ్చారు. అలాంటి అబద్ధపు ప్రచారాలు పోస్ట్ చేయడం మానేయాలని ప్రతి ఒక్కరినీ అభ్యర్థించారు. ప్రముఖ గీత రచయిత సిరివెన్నెల ప్రస్తుతం ఆరోగ్యంగానే ఉన్నారని, అలాగే కోలుకుంటున్నారని అందరికీ భరోసా ఇచ్చారు. ఈ విషయంలో పలువురు సెలబ్రెటీలు కూడా సీతారామ శాస్త్రి ఆరోగ్యంగానే ఉన్నట్లు వివరణ ఇచ్చారు.

    అభిమానుల మద్దతు

    అభిమానుల మద్దతు

    అయితే ఒకరి ఆరోగ్యంపై ఇలాంటి రూమర్స్ పోస్ట్ చేసే ముందు, కుటుంబ సభ్యులు పడే బాధను ఆవేదన గురించి ముందే తెలుసుకోవాలి అని.. అబద్ధపు పోస్ట్‌లపై, అనేక మంది అభిమానులు ఆందోళన వ్యక్తం చేశారు. అంతే కాకుండా సిరివెన్నెల సీతారామశాస్త్రి త్వరగా కోలుకోవాలని కూడా అంహిమనుకు సోషల్ మీడియాలో ప్రత్యేకంగా పోస్టులు చేశారు.

    3000 పైగా పాటలు

    3000 పైగా పాటలు


    సిరివెన్నెల సీతారామ శాస్త్రి దాదాపు 3000 పాటలకు సాహిత్యాన్ని రచించారు. ఇక ప్రత్యేకంగా పొందుపరిచిన అతని పాటలు అతని రూపకాలు, ఛందస్సు, కవిత్వ మీటర్ మరియు ప్రాసలకు ప్రసిద్ధి చెందాయి. తెలుగు సాహిత్యంలో నేటి తరానికి అర్థమయ్యేలా పాటలు రచించడంలో ఆయన స్టైల్ చాలా డిఫరెంట్ గా ఉంటుంది.

    Recommended Video

    Bheemla Nayak : Trivikram Srinivas Charges Rs 15 Crore For Pawan's Movie || Filmibeat Telugu
     త్రివిక్రమ్ తో అనుబంధం

    త్రివిక్రమ్ తో అనుబంధం


    ఇక త్రివిక్రమ్ శ్రీనివాస్ ఆయనకు వరుసకు అల్లుడు అవుతారని అందరికి తెలిసిన విషయమే. త్రివిక్రమ్ టాలెంట్ ను రచయితగా ఉన్నప్పుడే గుర్తించిన సీతారామశాస్త్రి ఆయన సోదరుడు కూతురిని ఇచ్చి వివాహం చేశారు. అనంతరం వారి బంధం మరింత దగ్గరయ్యింది. ఇక త్రివిక్రమ్ ఇప్పటికి కూడా సీతారామశాస్త్రిని ఒక గాడ్ ఫాదర్ తరహాలో గౌరవిస్తూ ఉంటారు. ఇక సీతారామశాస్త్రి ఆరోగ్యంపై అనేక రకాల రూమర్స్ వస్తున్న సమయంలో త్రివిక్రమ్ కుటుంబ సభ్యులు అవి అబద్దమని కొట్టి పారేశారు. ఆయన ఆరోగ్యంగానే ఉన్నారని అలాంటి అబద్ధపు ప్రచారాలను నమ్మవద్దని అభిమానులకు క్లారిటీ ఇచ్చారు.

    English summary
    Trivikram family clarification on lyricist Sirivennala Seetharama Sastry health,
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X