ఈవెంట్ల మీద ఈవెంట్లు.. ‘రంగ్ దే’ జోరు మామూలుగా లేదు!

నితిన్ రంగ్ దే సినిమాపై ఇప్పుడు ఎంతటి అంచనాలున్నాయో అందరికీ తెలిసిందే. నిన్న విడుదల చేసిన ట్రైలర్‌తో సినిమాపై అంచనాలు రెట్టింపయ్యాయి. హీరో హీరోయిన్ల మధ్యఉన్న గిల్లికజ్జాలు, టాం అండ్ జెర్రీ వార్, రొమాన్స్, ఇద్దరి కెమిస్ట్రీ అన్నీ కూడా వర్కవుట్ అయినట్టే కనిపించాయి. ఇక కావాల్సినంత కామెడీ, యాక్షన్ కూడా ఉన్నట్టు తెలుస్తోంది. అన్నింటి కంటే ముఖ్యంగా ఇది ఫ్యామిలీ మూవీ అని అర్థమవుతోంది.

అలా నితిన్ రంగ్ దే సినిమాపై ఇప్పుడు మంచి హైప్ ఏర్పడింది. ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌ కర్నూలు నడిబొడ్డున చేయగా.. అది బాగా సక్సెస్ అయింది. అయితే ఈ ఈవెంట్‌ కాకుండా రంగ్ దే యూనిట్ మరో ఈవెంట్‌ను గట్టిగానే ప్లాన్ చేసింది. వరుసగా ఈవెంట్లు చేస్తూ సినిమాను ఓ రేంజ్‌లో ప్రమోట్ చేస్తున్నారు. తాజాగా రంగ్ దే మూవీకి సంబంధించిన అప్డేట్ ఒకటి వచ్చింది. ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ అప్డేట్ ఇప్పుడు వైరల్ అవుతోంది.

Trivikram guest for Nithin Rangde Pre release event on 21st march

రంగ్ దే మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ మార్చి 21న సాయంత్రం ఆరు గంటలకు ప్రారంభం అవుతుందని తెలిపారు. శిల్పా కళా వేదికగా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగబోతోందని ప్రకటించారు. అయితే ఈ వేడుకలకు ఎన్టీఆర్ ముఖ్య అతిథిగా రాబోతోన్నాడంటూ రూమర్లు వచ్చాయి. కానీ వాటిపై చిత్రయూనిట్ అధికారికంగా స్పందించలేదు. అయితే ఈ ఈవెంట్‌కు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ ముఖ్య అతిథిగా రాబోతోన్నారని ప్రకటించారు. వెంకీ అట్లూరి దర్శకత్వంలో రాబోతోన్న ఈ మూవీ మార్చి 26న విడుదల కాబోతోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X