త్రివిక్రమ్, ఎన్టీఆర్ మూవీలో బాలీవుడ్ సీనియర్ హీరో.. విలన్ అంటున్నారే?

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ మొత్తానికి బాక్సాఫీస్ వద్ద చాలా కాలం తరువాత అసలైన విజయాన్ని అందుకున్నాడు. అల..వైకుంఠపురములో.. డబుల్ ప్రాఫిట్స్ ని అందించడంతో త్రివిక్రమ్ మళ్ళీ ఫామ్ లోకి వచ్చాడని కామెంట్స్ అందుతున్నాయి. ఆజ్ఞతవాసి అనంతరం అరవింద సమేత అనుకున్నంతగా విజయాన్ని అందుకోలేకపోయింది. దీంతో త్రివిక్రమ్ పనైపోయిందనే నెగిటివ్ కామెంట్స్ వచ్చాయి.

అయితే విమర్శలకు కౌంటర్ ఇచ్చేలా అల.. బాక్సాఫీస్ వద్ద రికార్డులను క్రియేట్ చేసింది. అసలు మ్యాటర్ లోకి వస్తే.. నెక్స్ట్ త్రివిక్రమ్ .. ఎన్టీఆర్ తో మరో సినిమా చేయబోతున్న విషయం తెలిసిందే. ఆ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనుల్లో త్రివిక్రమ్ తన టీమ్ తో రోజు చర్చలు జరుపుతున్నారు. ఇక సినిమాలో విలన్ పాత్ర కోసం ఒక బాలీవుడ్ స్టార్ ని సంప్రదించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అతనెవరో కాదు.. బాలీవుడ్ మున్నాభాయ్ సంజయ్ దత్.

Trivikram special target on ntr upcoming movie villain role

సంజయ్ KGFలో మెయిన్ విలన్ గా నటిస్తున్నపటి నుంచి సౌత్ లో చాలా ఆఫర్స్ వస్తున్నాయి. కానీ సంజయ్ అంత ఈజీగా ఒప్పుకోవడం లేదు. కేవలం తనకు సెట్టయ్యే మంచి పాత్రలనే ఎంచుకుంటున్నారట. ఇక సినిమాలో విలన్ పాత్ర బలంగా ఉండాలని త్రివిక్రమ్ సంజయ్ దత్ ని మైండ్ లో ఫిక్స్ చేసుకున్నాడట. త్వరలోనే ఆయనతో మాట్లాడి ఫైనల్ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మరి ఇది ఎంతవరకు నిజమో తెలియాలంటే లాక్ డౌన్ ముగిసేవరకు వెయిట్ చేయాల్సిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X