త్రివిక్రమ్, అల్లు అర్జున్ మూవీకి క్రేజీ టైటిల్.. మళ్లీ లేడీస్ సెంటిమెంట్‌తో!

టాలీవుడ్‌లో పదునైన, చామత్కారంతో కూడిన మాటలతో దడదడలాడించాలంటే అదే దర్శకుడు త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌కే చెల్లుతుంది. అలాగే ప్రేక్షకుల్లో ఆసక్తిని కలిగించే టైటిల్స్ పెట్టడంలో ఆయనకు ఆయనే సాటి. మహిళలకు అత్యంత ప్రాధాన్యం ఇచ్చే టైటిల్స్ పెట్టడం ఆయన నైజం. మహిళా సాధికారితకు ఆయన ప్రోత్సాహం ఉందో లేదో తెలియదు గానీ.. ఆయన సినిమా టైటిల్స్ విషయంలో అది వంద శాతం కనిపిస్తుంటుంది. తాజాగా అల్లు అర్జున్‌తో రూపొందించే సినిమా కోసం ఓ క్రేజీ టైటిల్‌ను పెట్టబోతున్నారనే విషయం ఆసక్తిగా మారింది. విస్తృతంగా ప్రచారంలో ఉన్న టైటిల్ ఏమిటంటే..

 క్రేజీ టైటిల్స్‌తో త్రివిక్రమ్ శ్రీనివాస్

క్రేజీ టైటిల్స్‌తో త్రివిక్రమ్ శ్రీనివాస్

గతంలో త్రివిక్రమ్ తీసిన సినిమాలు, పనిచేసిన చిత్రాల్లో ఎక్కువ మహిళా ప్రధాన్యం ఉన్న టైటిల్స్, కథలు కనిపిస్తాయి. అరవింద సమేత వీర రాఘవ, అత్తారింటికి దారేది, మళ్లీశ్వరి లాంటి సినిమాల టైటిల్స్ ప్రేక్షకులకు కొత్త అనుభూతిని కలుగు జేశాయి. అత్తారింటికి దారేది సినిమా టైటిల్ పెట్టిన సమయంలో కొంత మంది ఇదేం టైటిల్ అనే పెదవి విరిచిన సందర్భాలు ఉన్నాయి. పవన్ కల్యాణ్ లాంటి హీరోను పెట్టి ఆ టైటిల్ పెడుతారా అనే గుసగుసలు వినిపించాయి. ఆ తర్వాత ఆ టైటిల్ ఎంత క్రేజీగా మారిందో అందరికి తెలిసిందే.

లేడీస్ సెంటిమెంట్‌తో మాటల మాంత్రికుడు

లేడీస్ సెంటిమెంట్‌తో మాటల మాంత్రికుడు

త్రివిక్రమ్ శ్రీనివాస్ చిత్రాలను పరిశీలిస్తే ప్రతీ చిత్రంలోనూ లేడీస్ సెంటిమెంట్ చుట్టూ కథ తిరుగుతాయి. అరవింద సమేత కథంతా మహిళా పాత్రల చుట్టు తిరిగేదే. అజాతవాసిలో ఖుష్భూ, అలాగే అత్తారింటికి దారేదిలో నదియా పాత్రలకు కథకు బలంగా మారాయి. తాజాగా అల్లు అర్జున్‌తో రూపొందించే సినిమాలో టబు కీలక పాత్రలో కనిపించనున్నారు.

 అలకనంద టైటిల్‌తో అల్లు అర్జున్

అలకనంద టైటిల్‌తో అల్లు అర్జున్

తాజాగా అల్లు అర్జున్‌తో త్రివిక్రమ్‌ ప్రారంభించిన సినిమాకు అలకనంద పేరును పెట్టే ఆలోచనలో ఉన్నట్టు సమాచారం. అలకనంద టైటిల్ పూజా హెగ్డేకు పెట్టనున్నారా? లేక టబు పాత్ర పేరా అనేది ఆసక్తిగా మారింది. ఇంతకు అలకనంద ఎవరనేది త్వరలోనే బయటకు వచ్చే అవకాశం ఉంది. యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణతో ఈ సినిమా షూటింగ్ బుధవారం హైదరాబాద్‌లో ప్రారంభమైంది.

ఇద్దరు టాప్ హీరోయిన్లతో

త్రివిక్రమ్ శ్రీనివాస్ మూవీలో దాదాపు ఇద్దరు హీరోయిన్లు ఉండటం కామన్. ఈ చిత్రంలోనూ పూజాహెగ్డేతోపాటు హన్సిక కూడా మరో హీరోయిన్‌గా కనిపించనున్నారనేది టాలీవుడ్ వర్గాల టాక్. రెండో హీరోయిన్ ఎంపిక ఇంకా పూర్తి కాలేదు. ప్రస్తుతం చర్చల దశలోనే ఉన్నట్టు సమాచారం.

 నటీనటులు, సాంకేతిక వర్గం

నటీనటులు, సాంకేతిక వర్గం

నటీనటులు: అల్లు అర్జున్, పూజా హెగ్డే, టబు, సత్యరాజ్, రాజేంద్ర ప్రసాద్, సునీల్, నవదీప్, బ్రహ్మాజీ, రావు రమేష్, మురళీ శర్మ, రాహుల్ రామకృష్ణ
దర్శకత్వం: త్రివిక్రమ్ శ్రీనివాస్
నిర్మాత: అల్లు అరవింద్, ఎస్ రాధాకృష్ణ (చినబాబు)
సినిమాటోగ్రఫి: పీఎస్ వినోద్
మ్యూజిక్: ఎస్ థమన్
ఎడిటర్: నవీన్ నూలి
ఆర్ట్ డైరెక్టర్: ఏఎస్ ప్రకాశ్
స్టంట్స్: రామ్ లక్ష్మణ్
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: పీడీవీ ప్రసాద్
బ్యానర్: హరికా అండ్ హాసిని, గీతా ఆర్ట్స్

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X