బర్త్ డే స్పెషల్: అల్లు అర్జున్ టీమ్ హంగామా.. త్రివిక్రమ్‌తో ఫుల్ ఎంజాయ్ చేసిన పూజా హెగ్డే
నేడు (నవంబర్ 7) మాటల మాంత్రికుడు క్రేజీ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ పుట్టిన రోజు. 1971 సంవత్సరంలో భీమవరంలో జన్మించిన ఈయన 48 ఏట నుంచి 49 వ పడిలోకి అడుగు పెడుతున్నారు. ఈ సందర్బంగా ఆయనకు సినీ ప్రముఖుల నుంచి పెద్ద ఎత్తున శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. అలాగే త్రివిక్రమ్ బర్త్ డే పురస్కరించుకొని అల.. వైకుంఠపురములో టీమ్ ఫుల్లుగా ఎంజాయ్ చేసింది. ఆ వివరాలేంటో చూద్దామా..

టాలెంటెడ్ త్రివిక్రమ్.. పండుగలా సెలెబ్రేషన్స్
మాటలతో మాయ చేయడంలో దిట్ట అని టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు త్రివిక్రమ్. డైలాగ్ రైటర్‌గా త్రివిక్రమ్ క్రేజే వేరు. అక్షరం ఇంత అందంగా ఉంటుందా? ప్రతీ అక్షరంలో ఇంత అర్థం ఉంటుందా? అన్నట్లుగా డైలాగ్స్ రాసి.. ప్రేక్షకుల చేత చప్పట్లు కొట్టించుకోవడం ఒక్క త్రివిక్రమ్‌కే చెల్లుతుంది. అంతటి టాలెంట్ బర్త్ డే రావడంతో ఇదో పండుగలా సెలెబ్రేట్ చేసుకున్నారు అల.. వైకుంఠపురములో టీమ్ సభ్యులు.

త్రివిక్రమ్‌తో ఎంజాయ్ చేసిన బన్నీ, పూజా హెగ్డే
తమ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ పుట్టిన రోజు సందర్బంగా ఆయనతో కేట్ కట్ చేయించి సంబరాలు చేసుకున్నారు 'అల.. వైకుంఠపురములో' యూనిట్ సభ్యులు. గత రాత్రి జరిగిన ఈ కార్యక్రమంలో హీరోహీరోయిన్లు అల్లు అర్జున్, పూజా హెగ్డే సహా మ్యూజిక్ డైరెక్టర్ థమన్, ఇతర టీమ్ అంతా కలిసి ఎంజాయ్ చేశారు.

త్రివిక్రమ్‌కి బన్నీ బెస్ట్ విషెస్..
త్రివిక్రమ్ శ్రీనివాస్ పుట్టిన రోజు సందర్బంగా ఆయనకు తన బెస్ట్ విషెస్ తెలుపుతూ సోషల్ మీడియాలో ట్వీట్ పెట్టారు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్. హ్యాపీ బర్త్ డే త్రివిక్రమ్ గారు అని పేర్కొంటూ గత రాత్రి జరిగిన సెలబ్రేషన్ తాలూకు పిక్స్ షేర్ చేశారు. దీంతో ఈ పిక్స్ చూసిన బన్నీ అభిమానులు ఆయనకు పెద్ద ఎత్తున శుభాకాంక్షలు తెలుపుతూ కామెంట్స్ చేస్తున్నారు.

శరవేగంగా అల.. వైకుంఠపురములో
అల్లు అర్జున్ హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతోంది 'అల.. వైకుంఠపురములో' మూవీ. ఈ చిత్రంలో బన్నీ సరసన పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తుండగా.. సీనియర్ హీరోయిన్ టబు కీలక పాత్ర పోషిస్తోంది. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాను సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల చేయనున్నారు.


Click it and Unblock the Notifications











