SSMB28: మహేశ్ బాబు మూవీ విషయంలో త్రివిక్రమ్ యూటర్న్.. నిర్మాతల కోరిక వల్ల వెనకడుగు
ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ ఉన్నా.. హ్యాండ్సమ్ లుక్స్.. అదిరిపోయే యాక్టింగ్‌తో చాలా తక్కువ సమయంలోనే స్టార్ హీరో స్టేటస్‌ను సొంతం చేసుకున్నాడు టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు. కెరీర్ ఆరంభం నుంచీ కమర్షియల్ చిత్రాల్లోనే కాకుండా ప్రయోగాలు కూడా చేస్తున్నాడు. ఇలా హిట్లు ప్లాపులతో ఏమాత్రం సంబంధం లేకుండా వరుస పెట్టి సినిమాల మీద సినిమాలు చేస్తూనే ఉన్నాడు. ఈ క్రమంలోనే ఇటీవలి కాలంలో ఫుల్ ఫామ్‌లో ఉన్నాడు. ఈ ఉత్సాహంతోనే ఒకటి పట్టాలపై ఉండగానే మరొకటి అన్నట్లు ప్రాజెక్టులను లైన్‌లో పెట్టుకుంటున్నాడు. అందులో త్రివిక్రమ్ శ్రీనివాస్ తీసే సినిమా ఒకటి. తాజాగా దీని గురించి ఓ అదిరిపోయే న్యూస్ బయటకు వచ్చింది. ఆ వివరాలు మీకోసం!

వరుస హిట్లతో హ్యాట్రిక్ కొట్టిన మహేశ్
ఆ మధ్య రెండు మూడు భారీ డిజాస్టర్లతో ఇబ్బందులు పడ్డ సూపర్ స్టార్ మహేశ్ బాబు సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ కొరటాల శివతో చేసిన 'భరత్ అనే నేను'తో హిట్ ట్రాక్ ఎక్కాడు. ఆ వెంటనే వంశీ పైడిపల్లి రూపొందించిన 'మహర్షి', యంగ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి తీసిన 'సరిలేరు నీకెవ్వరు'తో వరుసగా మూడు విజయాలను అందుకుని హ్యాట్రిక్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు.
బెడ్‌పై బ్రాతో బాలయ్య హీరోయిన్: దారుణమైన ఫోజులతో అందాల ఆరబోత.. చూసి తట్టుకోవడం కష్టమే
https://telugu.filmibeat.com/heroine/heroine-sonal-chauhan-glamorous-photo-gone-viral-104214.html

సర్కారు వారి పాట అంటోన్న మహేశ్
మహేశ్ బాబు ప్రస్తుతం కుటుంబ కథా చిత్రాల దర్శకుడిగా పేరొందిన పరశురాంతో 'సర్కారు వారి పాట' అనే సినిమా చేస్తున్నాడు. మూవీలో మహానటి కీర్తి సురేష్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థలతో కలిసి మహేశ్ స్వయంగా నిర్మిస్తున్నాడు. యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ థమన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు.

11 ఏళ్ల తర్వాత ఆ దర్శకుడితో మూవీ
'సర్కారు వారి పాట' సినిమా పట్టాలపై ఉండగానే మహేశ్ బాబు ఫ్యూచర్ ప్రాజెక్టులను లైన్‌లో పెట్టుకున్నాడు. అందులో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో ఓ సినిమా చేయబోతున్నాడు. ఇప్పటికే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వెలువడింది. దాదాపు 11 ఏళ్ల తర్వాత వీళ్ల కాంబోలో సినిమా రాబోతుండడంతో అంచనాలు భారీగా ఉన్నాయి.
Unstoppable: బాబుకు టీడీపీని ఎందుకిచ్చావ్ అన్న మోహన్ బాబు.. చిరును లాగుతూ బాలయ్య షాకింగ్ రియాక్షన్
https://telugu.filmibeat.com/news/balakrishna-s-unstoppable-with-nbk-show-1st-episode-promo-released-104216.html

అప్పుడే పనులన్నీ పూర్తి చేసేశారుగా
'అతడు', 'ఖలేజా' తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో జత కట్టాడు మహేశ్ బాబు. ఎంతో ప్రతిష్టాత్మకంగా రాబోతున్న ఈ సినిమాను అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా తెరకెక్కించబోతున్నారు. ఈ మూవీ కోసం త్రివిక్రమ్ ఇప్పటికే ఫుల్ స్క్రిప్టును రెడీ చేసేశాడట. అంతేకాదు, దీనికి డైలాగ్ వెర్షన్‌ను కూడా కంప్లీట్ చేశాడట. అలాగే, థమన్ కూడా కొన్ని పాటలు రెడీ చేశాడని తెలిసింది.

కీలక నిర్ణయం తీసుకున్న త్రివిక్రమ్
ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందుతోన్న ఈ సినిమా కోసం త్రివిక్రమ్ శ్రీనివాస్ మొత్తంగా పోస్ట్ ప్రొడక్షన్ పనులను పూర్తి చేసేశాడట. ఇప్పటికే హీరోయిన్‌గా పూజా హెగ్డేతో పాటు టెక్నీషియన్లను కూడా ఎంపిక చేసుకున్నాడు. ఇక, త్వరలోనే ఈ సినిమా షూటింగ్‌ను కూడా ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో గురూజీ దీనిపై కీలక నిర్ణయం తీసుకున్నాడని టాక్.
Recommended Video

ఆ విషయంలో త్రివిక్రమ్ యూటర్న్
మహేశ్ బాబుతో చేయబోయే సినిమా విషయంలో త్రివిక్రమ్ శ్రీనివాస్ బడ్జెట్‌కు పరిమితులు పెట్టుకున్నాడని తెలుస్తోంది. నిర్మాతల కోరిక మేరకు ఆయన ముందుగా అనుకున్న బడ్జెట్‌లో కోత విధించినట్లు ఓ న్యూస్ తాజాగా వైరల్ అవుతోంది. దీనికి మహేశ్ బాబు సైతం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఇప్పుడు ఆ బడ్జెట్‌కు సంబంధించిన లెక్కలపై గురూజీ ఫోకస్ చేస్తున్నాడని సమాచారం.


Click it and Unblock the Notifications











