Mahesh Babu ఫ్యాన్స్‌కు శుభవార్త.. SSMB28 ఫస్ట్ లుక్ ఎప్పుడంటే?
సూపర్ స్టార్ మహేష్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో వస్తున్న SSMB28 చిత్రం శరవేగంగా షూటింగ్ జరుపుకొంటున్నది. ఇటీవల హైదరాబాద్‌లో ప్రారంభమైన షూటింగ్‌లో కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. అయితే ఏప్రిల్ చివరి వారంలో టాకీ పార్ట్ షూట్ పూర్తి అవుతుందని యూనిట్ సభ్యులు తెలిపారు. ఈ సినిమాకు సంబంధించిన టైటిల్ విషయంలో టీమ్ వర్క్ చేస్తున్నది. అలాగే త్వరలోనే ఫస్ట్ లుక్‌ను రిలీజ్ చేసేందుకు యూనిట్ రెడీ అవుతున్నది. ఫస్ట్ లుక్ ఎప్పుడు రిలీజ్ అంటే..

త్రివిక్రమ్ రూపొందించే సినిమాలకు అ.. ఆ అనే అక్షరాలతో సాధారణంగా టైటిల్స్ ఉంటాయి. అతడు.. అఆ.. అల వైకుంఠపురంలో లాంటి టైటిల్స్‌తో సెంటిమెంట్‌ను కొనసాగిస్తున్నారు. అయితే మహేష్ బాబు సినిమాకు కూడా అ అనే అక్షరంతో పెట్టిన రెండు టైటిల్స్‌ను వినిపించారని.. కానీ మహేష్ బాబుకు నచ్చకపోవడంతో వాటిని రిజెక్ట్ చేశారని మాట వినిపిస్తున్నది.
SSMB28 సినిమాకు త్రివిక్రమ్ అమ్మకథ అనే టైటిల్‌ను సూచించారు. కానీ ఆ టైటిల్ మహేష్‌కు నచ్చలేదు. దాంతో క్యాచీగా ఉండే వేరే టైటిల్‌ను పరిశీలించాలని సూచించారు. దాంతో ఆరంభం అనే టైటిల్‌ను పెట్టాలనే ఆలోచనలో త్రివిక్రమ్ ఉన్నారు అనే వార్త మీడియాలో చక్కర్లు కొడుతున్నది.
ఇదిలా ఉండగా, త్రివిక్రమ్, మహేష్ బాబు సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్‌ను ఉగాది సందర్భంగా విడుదల చేయాలని ప్లాన్ జరుగుతుంది. త్వరలోనే టైటిల్‌పై ఒక నిర్ణయానికి వచ్చి.. దానికి సంబంధించిన ప్రోమో కూడా రిలీజ్ చేస్తారు అనే వార్త వైరల్ అయింది. త్వరలోనే మహేష్ బాబు అభిమానులకు పండుగ లాంటి వార్త అందబోతున్నది.


Click it and Unblock the Notifications











