కష్టాల్లో ఉన్న కుర్చి మడతపెట్టి తాతకు సినిమా ఆఫర్.. కానీ!

ఈ మధ్య కాలంలో చాలా మంది ఒక్క రోజులోనే సెలబ్రిటీలు అయిపోతున్నారు. వారు చెప్పే చిన్న డైలాగ్, డ్యాన్స్, పాటలు, మాటలు.. ఇలా ఏది చేసినా వైరల్ అవుతుండడంతో విపరీతమైన క్రేజ్ తెచ్చుకుంటున్నారు. ఎంతో కష్టపడినా రాని క్రేజ్ వస్తుండండంతో ఒక్క నైట్ లోనే సెలబ్రిటీలుగా మారిపోతున్నారు. అలాంటి కోవలోకే వస్తాడు కుర్చి మడత పెట్టి తాత. ఓ ఇంటర్వ్యూలో ఈ డైలాగ్ చెప్పిన ఆ తాత ఫుల్ వైరల్ అయిపోయాడు. ఇక అప్పటి నుంచి చాలా మంది ఆయన్ను ఇంటర్వ్యూలు చేస్తూనే ఉన్నారు.

అయితే ఈ తాతకు అదృష్టం ఎక్కువయి.. తన డైలాగ్ ను ఏకంగా సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమాలోనే వాడుకుంటామని చెప్పారట. చెప్పడే కాదు వాడుకుని ఆ పాటను కూడా విడుదల చేశారు. పాట ప్రోమో విడుదల కాగా విపరీతమైన ట్రోలింగ్స్ జరిగాయి. ముఖ్యంగా ఓ బూతు డైలాగ్ ను సూపర్ స్టార్ సినిమాలో పెట్టడం ఏంటి.. అలాంటి దరిద్రపు పాటకు మహేష్ బాబు డ్యాన్స్ చేయడం ఏంటంటూ చాలా మంది ఫైర్ అయ్యారు. కానీ ఆ పాట విడుదల అయ్యాక మాత్రం గొడవంతా సద్దుమణిగింది.

Recommended Video

కష్టాల్లో ఉన్న Kurchi Madatha Petti తాతకు సినిమా ఆఫర్ | Guntur Kaaram | Telugu Filmibeat

Trivikram Srinivas Give A Special Character For Kurchi Madathapetti Tata in Guntur Kaaram Movie Check Details

అందుకు కారణం ఒక్కటే. పాటలోని లిరిక్స్ లో ఏమాత్రం బూతులు ఉండకపోవడం. అందులోనూ పాటు మాస్ మసాలాను అందించడం. ఆ సాంగ్ కు తగ్గట్లుగానే సూపర్ స్టార్, శ్రీలీలలు డ్యాన్స్ చేయడం. అయితే ఈ పాట వచ్చిన తర్వాత నుంచి ఈ డైలాగ్ చెప్పిన తాత రేంజ్ మరింత పెరిగిపోయింది. ముఖ్యంగా ఈ పాట కోసం మ్యూజిక్ డైరెక్టర్ థమన్ ఈ తాత వద్ద పర్మిషన్ తీసుకున్నారట. అలాగే ఓ ఐదు వేల రూపాయలను ఆయన చేతిలో పెట్టారట. ఇదంతా తనకు చాలా సంతోషంగా ఉందని.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న తాత చెప్పాడు.

ముఖ్యంగా ఈ డైలాగ్ పర్మిషన్ కోసం మాత్రమే కాకుండా.. గుంటూరు కారం సినిమాలో అవకాశం ఇస్తామని మూవీ టీం వచ్చారట. కానీ సాంగ్ షూటింగ్ జరుగుతున్న సమయంలో ఈ తాత వరంగల్ కు వచ్చేశాడట. ఈయన ఎక్కడ ఉంటాడు అన్న ఇన్ఫర్మేషన్ తెలియకపోవడంతో సాంగ్ షూటింగ్ కూడా చేసేసుకున్నారట. అలా కుర్చి మడత పెట్టి తాత ఈ సినిమాలో అవకాశాన్ని కోల్పోయాడు. కానీ చిత్రబృందం.. ముఖ్యంగా తమన్ తన వద్దకు వచ్చి పర్మిషన్ తీసుకోవడం, డబ్బులు ఇవ్వడమే తనకు చాలా సంతోషాన్ని ఇచ్చిందని వెల్లడించాడు.

Trivikram Srinivas Give A Special Character For Kurchi Madathapetti Tata in Guntur Kaaram Movie Check Details

ముందు ముందు ఏవైనా సినిమాల్లో అవకాశాలు వస్తే తాను కచ్చితంగా నటిస్తానని కుర్చి మడతపెట్టి తాత వెల్లడించాడు. ఆరోగ్య పరంగా తనకు చాలానే అనారోగ్య సమస్యలు ఉన్నాయని.. ప్రస్తుతం మందులు వాడుతున్నట్లు వివరించాడు. చూడాలి మరి ఈ నైట్ స్టార్ ఫ్యూచర్ లోనైనా సినిమా అవకాశాలు దక్కించుకుని తన టాలెంట్ ను ప్రూవ్ చేసుకుంటాడా లేదా అనేది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X