సమంతకు దారి చూపిస్తున్న త్రివిక్రమ్!
బాలీవుడ్‌లో ప్రముఖ నిర్మాణ సంస్థలు వాయాకామ్ స్టూడియోస్, ధర్మ ప్రొడక్షన్స్, ఎటర్నల్ సన్‌షైన్ ప్రొడక్షన్స్ సమర్పణలో ధర్మ ప్రొడక్షన్స్ రూపొందించిన చిత్రం జిగ్రా. వాసన్ బాలా దర్శకత్వం వహించిన ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఆలియా భట్, యువ హీరో వేదాంగ్ రైనా, దక్షిణాది నటుడు, దర్శకుడు రాహుల్ రవీంద్రన్ తదితరులు నటించారు. డ్రగ్స్ వాడకం కథాంశంగా యాక్షన్ డ్రామాగా రూపొందిన ఈ సినిమాను ఆలియా భట్, కరణ్ జోహర్, అపూర్వ మెహత, షాహీన్ భట్, సోమెశ్ మిశ్రా తదితరులు నటించారు.
జిగ్రా సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్‌లో గ్రాండ్‌గా జరిగింది. ఈ వేడుకలో సమంత రుత్ ప్రభు, త్రివిక్రమ్ శ్రీనివాస్, ఆలియా భట్, రాహుల్ రవీంద్రన్, వేదాంగ్ రైనా, వాసన్ రైనా తదితరులు పాల్గొన్నారు. ఈ సినిమా వేడుకలో త్రివిక్రమ్ శ్రీనివాస్ మాట్లాడుతూ ఆలియా, సమంతను హీరోగా వర్ణించారు. త్రివిక్రమ్ ఇంకా ఏం మాట్లాడారంటే..

సమంతను ఉద్దేశించి త్రివిక్రమ్ భావోద్వేగంగా మాట్లాడారు. ఆమె గురించి మాట్లాడుతూ.. మీరు బాంబేలోనే ఉండకండి. హైదరాబాద్‌కు కూడా రండి అని అన్నారు. దాంతో ఆమె స్పందిస్తూ.. నా కోసం కథలు రాస్తే వస్తాను అంటూ సైగలు చేసింది. దాంతో నేను రాస్తాను. నేను రాస్తే మీరు చేస్తారా? మీరు చేస్తారో లేదో అనే భయంతో రాయడం లేదు అని త్రివిక్రమ్ అన్నారు. దానికి జవాబు ఇస్తూ మీరు రాస్తే తప్పకుండా నేను నటిస్తాను అని సమంత చెప్పింది.

సమంతతో అత్తారింటికి దారేదో సినిమా తీశాను. ఇప్పుడు ఆమెకు హైదరాబాద్‌కు దారేదో చెప్పండి ఆవిడకు. అభిమానులందరూ సమంతకు హైదరాబాద్ దారి చూపించాలి. తెలుగు వారందరూ ఆమెకు దారి చూపిస్తూ ఓ హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ చేయాలి. ఆమె వచ్చేలా ట్విట్టర్, సోషల్ మీడియాలో ఏదో ఒక ట్రెండ్ చేద్దాం అని త్రివిక్రమ్ అన్నారు.

RRR సినిమాతో తెలుగు వారింట్లోకి వచ్చారు. ఇప్పుడు విజయదశమికి ఆమె మరోసారి తెలుగు ప్రేక్షకుల వద్దకు వస్తున్నారు. ఆమెకు విజయదశమి కానుకగా విజయాన్ని అందించి.. తెలుగింటి ఆడబిడ్డగా గుర్తించి ఆమెను పంపించేద్దా. ఈ సినిమా యూనిట్ అందరికి విజయం కలుగాలని నేను కోరుకొంటున్నాను. ఈ సినిమా మంచి విజయం సాధిస్తుందనే నమ్మకం ఉంది అని అన్నారు.


Click it and Unblock the Notifications











