జూనియర్ ఎన్టీఆర్ తో త్రివిక్రమ్ ఊహించని ప్రాజెక్ట్.. ముందే లీక్ చేసిన యువ నిర్మాత!
మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ప్రస్తుతం మహేష్ బాబు తో ఒక సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. చాలా గ్యాప్ తర్వాత ఈ కాంబినేషన్ తెరపైకి రాబోతూ ఉండడంతో అంచనాలు అయితే గట్టిగానే ఉన్నాయి. ఇదివరకే త్రివిక్రమ్ అల.. వైకుంఠపురములో సినిమాతో సక్సెస్ అందుకోవడంతో ఇప్పుడు ఈ ప్రాజెక్టు ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుంది అనేది అందరిలో ఎంతో ఆసక్తిని కలిగిస్తోంద.
అయితే ఈ ప్రాజెక్టు పూర్తయిన తర్వాత త్రివిక్రమ్ ఎవరితో వర్క్ చేస్తాడో అనే విషయంలో అయితే ఇంతవరకు క్లారిటీ లేదు. కానీ త్రివిక్రమ్ తో వరుసగా సినిమాలు నిర్మిస్తూ వస్తున్న హారిక హాసిని సీతారా ఎంటర్టైన్మెంట్స్ నిర్మాత నాగ వంశీ ఇటీవల ఒక క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. ముఖ్యంగా గతంలో కూడా ప్రభాస్ తో ఒక సినిమా అనుకుంటున్నట్లుగా చెప్పారు. అయితే ఈసారి జూనియర్ ఎన్టీఆర్ తో కూడా మరో సినిమా చేసేందుకు ఆలోచనలో ఉన్నట్లు తెలియజేశారు.

ఇదివరకే వీరి కలయికలో అరవింద సమేత సినిమా వచ్చిన విషయం తెలిసిందే. ఆ సినిమా కమర్షియల్ గా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది. అయితే నాగావంశీ ఇటీవల ఇంటర్వ్యూలో మాత్రం ఎన్టీఆర్ త్రివిక్రమ్ కాంబినేషన్లో ఒక పౌరాణిక సినిమా చేయాలని ఆలోచిస్తున్నట్లుగా తెలిపారు. ఆ సినిమా ఊహించని స్థాయిలో ఉంటుంది అని కూడా ముందే అంచనాలను క్రియేట్ చేశారు.
ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ అతిపెద్ద పాన్ ఇండియా సినిమాలను తెరపైకి తీసుకువచ్చే ప్రయత్నం చేస్తున్నాడు. ఇక త్రివిక్రమ్ శ్రీనివాస్ తో కూడా అతనికి మంచి అనుబంధము ఉంది. అసలైతే అల..వైకుంఠపురములో సినిమా తర్వాత త్రివిక్రమ్ జూనియర్ ఎన్టీఆర్ తోనే ఒక సినిమా చేయాలని అనుకున్నాడు. కానీ ఎందుకో ఆ కాంబినేషన్ లో ప్రాజెక్ట్ సరిగ్గా సెట్ అవ్వలేదు. అయినప్పటికీ జూనియర్ ఎన్టీఆర్ మాత్రం త్రివిక్రమ్ తో మరో సినిమా చేయాలని అనుకుంటున్నాడు. మరి వీరి కాంబినేషన్లో వచ్చే ప్రాజెక్టు ఎలా ఉంటుందో చూడాలి. ఇక జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 30వ సినిమా చేస్తున్నాడు. అలాగే లైనప్ లో ప్రశాంత నీల్ తో కూడా ఒక సినిమా చేయబోతున్నాడు.


Click it and Unblock the Notifications











