ఎన్టీఆర్‌తో త్రివిక్రమ్ భారీ పౌరాణికం.. ఇండియన్ హిస్టరీలో రానటువంటి మూవీకి ప్లాన్.. నాగవంశీ
తెలుగు సినిమా దగ్గర ఉన్నటువంటి టాప్ మోస్ట్ దర్శకుల్లో అంతా పాన్ ఇండియా సినిమా వైపు వెళుతున్నారు కానీ ఎప్పుడో వరల్డ్ క్లాస్ థాట్ ప్రాసెస్ తో సినిమాలు చేసిన దర్శకుడు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ మాత్రం ఇప్పటికీ వెనుకబడి ఉండడం అనేది తన అభిమానులకి కొంచెం ఇబ్బందికర అంశమే అనిక్ చెప్పక తప్పదు. కాగా త్రివిక్రమ్, రాజమౌళి అలానే సుకుమార్ ఈ ముగ్గురూ తెలుగు సినిమా దగ్గర వేసుకున్న ముద్ర వేరు.
ముగ్గురూ సెపరేట్ లీగ్ తో తమ మార్క్ సినిమాలు తీసి అలరించారు. ఇక ముగ్గురులో రాజమౌళి త్రివిక్రమ్ నడుమ కొన్ని అంశాలు కలుస్తాయి. ఇద్దరికీ చరిత్ర కోసం ముఖ్యంగా మన పురాణాలు నుంచి ప్రేరణ చెందడం వారి సినిమాల్లో ఎన్నో సీన్స్ లో కనిపిస్తూ ఉంటాయి. అయితే రాజమౌళి ఇలా పలు హిస్టారికల్ సినిమాలు వాటిలో వాటి ఛాయలు పెట్టి చేశారు కానీ ఇంకా త్రివిక్రమ్ నుంచి ఇలాంటి సినిమాలు ఇంకా పడలేదు.

సో దీనితో గురూజీ నుంచి ఒక సరైన సినిమా ఎప్పుడు పడుతుందా అని చూస్తున్న వారికి మాత్రం త్రివిక్రమ్ ఇచ్చే సమాధానం మామూలు రీతిలో ఉండదు అని తన ఆస్థాన నిర్మాత సూర్య దేవర నాగవంశీ చెబుతున్నారు. కాగా నాగవంశీ త్రివిక్రమ్ కాంబినేషన్ లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, జూనియర్ ఎన్టీఆర్ తో ఇద్దరితో సినిమాలు ఉన్నాయి.
కాగా ఈ ఇద్దరిలో ఒక సినిమా మాత్రం వచ్చాక మొత్తం ఇండియన్ సినిమా మాట్లాడుకునే రేంజ్ లో ఉంటుంది అని చెబుతున్నారు. కాగా పలు ఇతిహాస సినిమాలు ఇపుడు తక్కువ అవుతున్నాయి అనే ప్రశ్నకి త్రివిక్రమ్ ప్లాన్ చేస్తున్న సినిమా అయితే అసలు అటు రామాయణం, మహాభారతం లతో సంబంధం లేకుండా ఇపుడు వరకు రాని కొత్త సినిమాగా తీసుకొచ్చేలా ప్లాన్ చేస్తున్నట్టుగా తెలిపారు.
ఇండియన్ సినిమా దగ్గర ఎవరికీ తెలియని ఒక కొత్త పాత్రని హీరోగా మన పురాణాల నుంచే తీసుకొని పరిచయం చేస్తున్నట్టుగా తెలిపారు. దీనితో త్రివిక్రమ్ గేమ్ లోకి కొంచెం లేట్ గానే వస్తున్నప్పటికీ ఇండియన్ సినిమా దగ్గర దిమ్మ తిరిగిపోయే సినిమాతో రాబోతున్నారని చెప్పవచ్చు. కాగా త్రివిక్రమ్ కి మహారభారతం, రామాయణ ఇతిహాసాలపై ఉన్న పట్టు ఏ పాటిదో తన పాత ఇంటర్వ్యూలు చూస్తే తెలుస్తుంది.
అంత అవగాహనా ఉన్న త్రివిక్రమ్ మంచి క్లారిటీతో ఓ సినిమా చేస్తే దాని ఇంపాక్ట్ ఖచ్చితంగా మరో లెవెల్లో ఉంటుంది. సో తన నుంచి ఆ చిత్రం ఎపుడు వస్తుందో ఏ హీరోతో వస్తుందో అనేది ఇప్పుడుకి సస్పెన్స్ గానే నిలిచింది. సో వేచి చూడాలి ఈ ప్రాజెక్ట్ ఏంటి ఎవరితో అనేది. కాగా త్రివిక్రమ్ నుంచి గత ఏడాదిలో సూపర్ స్టార్ మహేష్ బాబుతో గుంటూరు కారం సినిమా వచ్చింది. ఆ సినిమా తర్వాత అల్లు అర్జున్ తో సినిమా స్టార్ట్ కావాల్సి ఉంది కానీ ఈ సినిమా ప్రస్తుతానికి హోల్డ్ లో ఉందట.


Click it and Unblock the Notifications











