సమంతపై మనసుపడ్డ అల్లు అర్జున్.. త్రివిక్రమ్‌తో ఏం చెప్పారంటే?
ఆలియా భట్ నటించిన జిగ్రా హిందీ చిత్రం తెలుగు వెర్షన్‌లో రిలీజ్‌కు సిద్దమవుతున్నది. ఈ సినిమా దసరా కానుకగా అక్టోబర్ 11వ తేదీన రిలీజ్ అవుతున్నది. ఈ సినిమా కోసం దేశవ్యాప్తంగా ఆలియా ప్రమోషన్స్ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఈ క్రమంలో సినిమా యూనిట్ అంతా హైదరాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్బంగా త్రివిక్రమ్ శ్రీనివాస్ భావోద్వేగంతో మాట్లాడిన స్పీచ్ అందర్నీ ఆకట్టుకొన్నది. ఆ వివరాల్లోకి వెళితే..
జిగ్రా హిందీ సినిమా తెలుగు వెర్షన్ ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్‌లోని ప్రముఖ హోటల్‌లో జరిగింది. ఈ వేడుకలో సమంత రుత్ ప్రభు, త్రివిక్రమ్ శ్రీనివాస్, రానా దగ్గుబాటి, రాహుల్ రవీంద్రన్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహిళా శక్తి గురించి త్రివిక్రమ్ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతున్నాయి.

త్రివిక్రమ్ మాట్లాడుతూ.. సమంత, ఆలియా భట్ హీరోయిన్లు కాదు. మీరు ఎప్పుడో హీరోలు. ఆలియా భట్‌కు, సమంతకు చాలా దగ్గరిపోలికలు ఉన్నాయి. సెట్‌లో ఆమె డైనమెట్‌లా ఉంటుంది. ఎప్పుడూ నవ్వుతూ ఉంటూనే... చనిపోయే సినిమాలో అలా సులభంగా చనిపోయినట్టు నటిస్తుంది. ట్రైలర్ చూస్తే.. ఆలియా భట్ కూడా అలానే అనిపించింది. ఈ సినిమా కోసం ఆలియా భట్ శారీరకంగా చాలా కష్టపడినట్టు కనిపించింది అని త్రివిక్రమ్ అన్నారు.
సమంత మాట్లాడుతూ.. ఈ సినిమాకు మీరే హీరో అన్నారు. మీరు ఎప్పుడో హీరోలు. సమంత నటించిన ఏం మాయ చేశావో సినిమా రిలీజ్ అయినప్పుడు నాకు అల్లు అర్జున్ ఫోన్ చేశాడు. ఆ సినిమా చూసిన తర్వాత నాతో మాట్లాడుతూ.. ఇండస్ట్రీలోకి సమంత ఓ హీరోయిన్ వచ్చింది. మీరు నా కోసమైనా ఆ అమ్మాయిని చూసేందుకు ఆ సినిమా చూడండని నాకు చెప్పారు. సమంతకు బన్నీ పెద్ద ఫ్యాన్ అని త్రివిక్రమ్ చెప్పారు.

ఇక మీరంతా శక్తి స్వరూపులు. మా అమ్మ లేకపోతే మేము లేము. మీరు లేకపోతే భవిష్యత్ తరం లేదు. మీకు పవర్ అవసరం లేదు. మీకు ఎవ్వరో చైతన్యం కలిగించాల్సిన అవసరం లేదు. స్త్రీ అంటే శక్తి. మీరే మాకు శక్తి ఇవ్వాలి. మీరే మమ్మల్ని చైతన్య పరచాలి. స్త్రీ సంతోషంగా ఉంటే కుటుంబం, యూనిట్ అంతా సంతోషంగా ఉంటుంది. అప్పుడే వసుదైక కుటుంబంగా మారుతుంది అని అన్నారు.


Click it and Unblock the Notifications











