సునీల్ కోసం త్రివిక్రమ్ రికమండేషన్.. ఆ స్టార్ దర్శకుడి సినిమాలో స్పెషల్ రోల్!
ఒకప్పుడు స్టార్ కమెడియన్ గా తీరిక లేకుండా బిజీగా ఉన్న వారిలో సునీల్ ఒకరు. అప్పట్లో సునీల్ ఎంత బిజీగా ఉండేవడంటే కొన్ని సినిమా షెడ్యూల్స్ స్పెషల్ గా అతని కోసమె సెట్ చేసుకునే విధంగా ఉండేవారు. అయితే ఎప్పుడైతే సునీల్ హీరోగా కెరీర్ స్టార్ట్ చేశాడో గాని పెద్దగా బిజీగా కనిపించలేదు. వారుసగా సినిమాలు డిజాస్టర్ కావడంతో మళ్ళీ మొదటి లానే కమెడియన్ స్టేజ్ కి వచ్చేశాడు.
కానీ సునీల్ కి ఇప్పుడు సరైన పాత్రలు తగలడం లేదు. ఒకప్పటి కామెడీ సునీల్ కనిపించడం లేదని కామెంట్స్ కూడా వస్తున్నాయి. అరవింద సమేత, అల.. వైకుంటపురములో సినిమాలలో ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు గాని వర్కౌట్ కాలేదు. ఇక ఇటీవల త్రివిక్రమ్ తన స్నేహితుడి కోసం రికామండేషన్స్ కూడా స్టార్ట్ చేస్తున్నట్లు తెలుస్తోంది. అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న పుష్ప సినిమాలో సునీల్ ఒక కీలక పాత్రలో కనిపించనున్నాడు.

అయితే ఆ పాత్ర సునీల్ కి త్రివిక్రమ్ ద్వారానే వచ్చిందట. అది ఎలాగంటే.. అల్లు అర్జున్ పుష్ప కథ గురించి కొన్నిసార్లు త్రివిక్రమ్ తో మాట్లాడగా అందులో ఒక ఒక కమెడియన్ రోల్ కి సునీల్ అయితే కరెక్ట్ గా సెట్టవుతాడాని చెప్పగా బన్నీ సుకుమార్ కి చెప్పినట్లు టాక్.
ఇక సుకుమార్ కూడా బెటర్ ఆప్షన్ అంటూ అంతుకుముందు మరో నటుడిని అనుకున్నప్పటికి కమిట్మెంట్ ఇవ్వకముందే సునీల్ ని ఫైనల్ చేశారట. ప్రస్తుతం ఈ న్యూస్ ఫిల్మ్ నగర్ లో అయితే వైరల్ గా మారింది. ఇక త్రివిక్రమ్ స్నేహితుడి కెరీర్ కి వీలైనంత వరకు మళ్ళీ బూస్ట్ ఇవ్వాలని ప్రయత్నాలు చేస్తున్నట్లుగా సమాచారం.


Click it and Unblock the Notifications











