Guntur Kaaram: ‘గుంటూరు కారం’ సక్సెస్ సెలబ్రేషన్స్‌లో త్రివిక్రమ్, తమన్ మిస్సింగ్... కారణం అదేనా?
ఈ సంక్రాంతి బరిలోకి వచ్చిన చిత్రాల్లో సూపర్ స్టార్ మహేశ్ బాబు నటించిన చిత్రం గుంటూరు కారం ఒకటి. ఇక ఈ చిత్రానికి మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహించారు. జనవరి 12న ఈ సినిమా థియేటర్లోకి వచ్చి ప్రేక్షకులను అలరిస్తుంది. ఇక ఈ మూవీకి మిక్స్ డ్ టాక్ లభించినా... బాక్సాఫీస్ వద్ద కలెక్షన్లు మాత్రం బాగానే వసూలు చేస్తుంది. ఈ నేపథ్యంలోనే సంక్రాంతి రోజున గుంటూరు కారం యూనిట్ సక్సెస్ సెలబ్రేషన్స్ జరుపుకున్నారు. అయితే ఈ సెలబ్రేషన్స్ లో త్రివిక్రమ్ మిస్ అయ్యారు. ఆ వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.
గత ఏడాది సంక్రాంతి బరిలో రెండు తెలుగు చిత్రాలు ఉండగా.. రెండు తమిళ చిత్రాలు ఉన్నాయి. అయితే నిరుడు సంక్రాంతి కంటే.. ఈ సంక్రాంతి బాక్సాఫీస్ ఫైట్ రసవత్తరంగా సాగింది. ఈ సారి పండగ బరిలో నాలుగు చిత్రాలు నిలిచాయి. తేజ సజ్జా ప్రశాంత్ వర్మ కాంబోలో వచ్చిన హనుమాన్, వెంకటేష్ 75వ చిత్రం సైంధవ్, నాగార్జున నా సామిరంగ చిత్రాలకు పోటీగా.. మహేశ్ బాబు త్రివిక్రమ్ కాంబోలో వచ్చిన గుంటూరు కారం నిలిచింది.

అయితే గుంటూరు కారం సినిమాకు మొదటి ఆట నుంచి మిక్స్ డ్ టాక్ వచ్చినప్పటికీ.. బాక్సాఫీస్ వద్ద కలెక్షన్లు బాగానే వస్తున్నాయి. ఇక ఈ చిత్రంలో శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటించగా.. తమన్ సంగీతం అందించారు. ఇక ఈ సినిమాను హారికా అండ్ హాసినీ బ్యానర్లపై రాధాకృష్ణ నిర్మించారు. అయితే జనవరి 12న రిలీజ్ అయిన ఈ సినిమా నాలుగు రోజుల్లో 175 కోట్లకు పైగానే వసూలు చేసింది.
ఈ క్రమంలోనే గుంటూరు కారం చిత్ర యూనిట్ సక్సెస్ సెలబ్రేషన్స్ జరుపుకుంది. అయితే కేవలం కొంతమంది మాత్రమే ప్రైవేట్ పార్టీలా సెలబ్రేట్ చేసుకున్నారు. జనవరి 15న సంక్రాంతి కూడా కావడంతో చిత్రయూనిట్ మహేష్ ఇంట్లో ఈ సక్సెస్ సెలబ్రేషన్స్ జరుపుకున్నారు. ఈ సెలబ్రేషన్స్ లో మహేష్ బాబు ఫ్యామిలీతో పాటు దిల్ రాజు ఫ్యామిలీ, నాగవంశీ ఫ్యామిలీ ఉన్నారు. వీరితో పాటుగా హీరోయిన్లు శ్రీలీల, మీనాక్షి చౌదరి కూడా హాజరయ్యారు.

మహేష్, శ్రీలీల, నమ్రత ఈ సక్సెస్ పార్టీ ఫోటోలను తమ సోషల్ మీడియా ఖాతాల్లో అభిమానులతో పంచుకున్నారు. అయితే ఈ పార్టీ ఫొటోల్లో త్రివిక్రమ్ లేకపోవడంతో గురూజీ ఎక్కడ అని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. డైరెక్టర్ లేకుండా పార్టీ చేసేసుకుంటున్నారా.. అని అడుగుతున్నారు. ఇక వీరితో పాటు తమన్ కూడా హాజరు కాలేదు. వీరిద్దరు ఈ పార్టీలో లేకపోవడం ఇప్పుడు నెట్టింట హాట్ టాపిక్ గా మారింది.

అయితే త్రివిక్రమ్ శ్రీనివాస్ ఆ పార్టీకి రాకపోవడానికి ఓ భారీ కారణం ఉందని తెలుస్తోంది. ఆయన పండక్కి ఊరుకు వెళ్లారని తెలుస్తోంది. త్రివిక్రమ్ సొంత గ్రామానికి వెళ్లి పండగను ఫ్యామిలీని జరుపుకున్నారని సమాచారం. ఇక తమన్ ఎందుకు రాలేదో క్లారిటీ లేదు. కానీ వీరు ఇద్దరు రాకపోడవంతో.. సినిమాకు మిక్స్ డ్ టాక్ రావడం వల్లే రాలేదా అనే సందేహం వ్యక్తం చేస్తున్నారు నెటిజన్స్. ఇక ఈ విషయంపై క్లారటీ రావాల్సి ఉంది.


Click it and Unblock the Notifications











