సూపర్ స్టార్‌తో త్రివిక్రమ్ మూడోసారి.. రెడీ అవుతున్న క్రేజీ కాంబినేషన్!
మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తో సినిమా చేయాలని ప్రతి హీరో భావిస్తాడు. త్రివిక్రమ్ చిత్రాల్లో పేజీల కొద్దీ డైలాగులు ఉండవు. సింపుల్ గా ఉండే డైలాగులని సైతం త్రివిక్రమ్ చాలా పదునుగా రాయగలరు. గత ఏడాది త్రివిక్రమ్ శ్రీనివాస్ అరవింద సమేత చిత్రంతో విజయం అందుకున్నాడు. ప్రస్తుతం స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తో ఓ చిత్రం చేస్తున్నాడు. త్రివిక్రమ్ తదుపరి చిత్రాల విషయంలో ఆసక్తికర వార్తలు వస్తున్నాయి.
సూపర్ స్టార్ మహేష్ బాబు త్రివిక్రమ్ దర్శత్వంలో మూడవసారి నటించేందుకు సిద్ధం అవుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. మహేష్ బాబు నటించిన మహర్షి చిత్రం మే 9న విడుదల కానుంది. ఈ చిత్రం తర్వాత మహేష్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో చిత్రాన్ని ప్రారంభించాడు. ఆ తర్వాత మహేష్ చేయబోయే చిత్రాల జాబితాలో త్రివిక్రమ్ చిత్రం కూడా ఉన్నట్లు తెలుస్తోంది. త్రివిక్రమ్, మహేష్ కాంబోలో గతంలో అతడు, ఖలేజా చిత్రాలు వచ్చాయి.

త్రివిక్రమ్ శ్రీనివాస్ తాను ముందుగా కమిటైన ప్రాజెక్ట్స్ పూర్తి చేసిన తర్వాత మహేష్ చిత్రాన్ని ప్రారంభించనున్నట్లు వార్తలు వస్తున్నాయి. అల్లు అర్జున్ చిత్రం తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్ మెగాస్టార్ చిరంజీవితో ఓ చిత్రం చేయనున్నాడు. వినయ విధేయ రామ ప్రీరిలీజ్ ఈవెంట్ లో చిరంజీవి ఈ విషయాన్ని స్వయంగా ప్రకటించిన సంగతి తెలిసిందే.


Click it and Unblock the Notifications











