For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  మహేశ్ బాబు కోసం త్రివిక్రమ్ సూపర్ ప్లాన్: మళ్లీ ఆ సెంటిమెంట్‌ను ఫాలో అవుతాడట

  |

  ఈ మధ్య కాలంలో వరుస విజయాలను అందుకుంటూ గతంలో ఎన్నడూ చూడనంత జోష్‌తో కనిపిస్తున్నాడు టాలీవుడ్ టాప్ హీరో సూపర్ స్టార్ మహేశ్ బాబు. హిట్లు మీద హిట్లు కొడుతూ ఇప్పటికే హ్యాట్రిక్‌ను తన ఖాతాలో వేసుకున్న అతడు.. మరిన్ని ప్రాజెక్టులను లైన్‌లో పెట్టుకుంటూనే ఉన్నాడు. ఈ క్రమంలోనే ఇప్పటికే కుటుంబ కథా చిత్రాల దర్శకుడిగా పేరొందిన పరశురాంతో కలిసి 'సర్కారు వారి పాట' అనే సినిమాను చేస్తున్నాడు. ఈ చిత్రం చాలా వరకూ షూటింగ్‌ను పూర్తి చేసుకుంది. ఇది పట్టాలపై ఉన్న సమయంలోనే మరో ప్రాజెక్టును కూడా ప్రకటించాడు మహేశ్.

  కొత్తలో నరకం అనుభవించా.. దానివల్ల పిల్లలు కూడా పుట్టరని భయపడ్డా: రోజా సంచలన వ్యాఖ్యలు

  'సర్కారు వారి పాట' షూటింగ్ జరుగుతోన్న సమయంలోనే సూపర్ స్టార్ మహేశ్ బాబు నటించబోయే తదుపరి సినిమా గురించి ఎన్నో రకాల చర్చలు జరిగాయి. ఈ క్రమంలోనే ఎంతో మంది దర్శకుల పేర్లు కూడా తెరపైకి వచ్చాయి. దీంతో అసలు మహేశ్ ఎవరితో సినిమా చేస్తాడన్నది మాత్రం సస్పెన్స్‌గా మారిపోయింది. ఇలాంటి పరిస్థితుల్లో ఈ స్టార్ హీరో తన 28వ చిత్రాన్ని స్టార్ డైరెక్టర్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో చేయబోతున్నట్లు వెల్లడించాడు. సూపర్ స్టార్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వెలువడింది.

  Trivikram Srinivas Two Heroine Sentiment for Mahesh Babu Movie

  మహేశ్ బాబు 'అతడు', 'ఖలేజా' వంటి డీసెంట్ మూవీల తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో జత కట్టాడు. ఎంతో ప్రతిష్టాత్మకంగా రాబోతున్న ఈ సినిమాను అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా తెరకెక్కించబోతున్నాడని ప్రచారం జరుగుతోంది. మహేశ్‌తో చేసే ఈ మూవీ కోసం త్రివిక్రమ్ ఇప్పటికే ఫుల్ స్క్రిప్టును రెడీ చేసేశాడట. అంతేకాదు, దీనికి డైలాగ్ వెర్షన్‌ను కూడా కంప్లీట్ చేసేశాడని అంటున్నారు. అలాగే, థమన్ కూడా ఈ చిత్రం కోసం అప్పుడే మూడు నాలుగు పాటలను రెడీ చేసి పెట్టాడని అంటున్నారు. మొత్తం ప్రీ ప్రొడక్షన్‌తో పాటు మరిన్ని పనులు కంప్లీట్ అయ్యాయి.

  క్రేజీ కాంబినేషన్‌లో ఎంతో ప్రతిష్టాత్మకంగా రాబోతున్న ఈ సినిమా గురించి తాజాగా ఓ ఆసక్తికరమైన వార్త బయటకు వచ్చింది. టాలీవుడ్‌లో చాలా మంది సెంటిమెంట్లను నమ్ముతూ ఉంటారు. అందులో త్రివిక్రమ్ శ్రీనివాస్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే ఆయన మహేశ్ బాబుతో తీసే సినిమాలోనూ ఇద్దరు హీరోయిన్ల సెంటిమెంట్‌ను ఫాలో అవుతున్నాడట. ఇప్పటికే ఇందులో ఒక హీరోయిన్‌గా పూజా హెగ్డేను ఫైనల్ చేశారు. ఇక, మరో భామ కోసం ఆయన అన్వేషిస్తున్నాడని తెలుస్తోంది. ఇంకొకరు కూడా ఫిక్స్ అయిన తర్వాత ప్రకటిస్తారనే టాక్ వినిపిస్తోంది.

  బ్రా ఒక్కటే ధరించి విష్ణుప్రియ రచ్చ: ఇంతకు ముందెన్నడూ చూడనంత ఘాటు ఫోజులతో!

  భారీ స్థాయిలో రాబోయే ఈ సినిమా రెగ్యూలర్ షూటింగ్ అక్టోబర్ నుంచి ప్రారంభం కాబోతున్నట్లు చాలా రోజులుగా ప్రచారం జరుగుతోంది. ఇందులో మహేశ్ బాబు రా ఏజెంట్‌గా కనిపిస్తాడని అంటున్నారు. అలాగే, అతడి లుక్‌ కూడా సరికొత్తగా ఉండబోతుందట. ఇందులో సూపర్ స్టార్ సరసన బుట్టబొమ్మ పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ చిత్రాన్ని హారిక హాసినీ క్రియేషన్స్ బ్యానర్‌పై రాధాకృష్ణ నిర్మిస్తున్నారు. ఇక, ఈ సినిమాకు 'పార్థు', 'అతడే పార్థు' అనే టైటిళ్లు పరిశీలనలో ఉన్నాయని తెలుస్తోంది. దీనికి ఎడిటర్‌గా నవీన్ నూలి, ఆర్ట్ డైరెక్టర్‌గా ఏఎస్ ప్రకాశ్, కెమెరామెన్‌గా మథి, మ్యూజిక్ డైరెక్టర్‌గా ఎస్ థమన్ చేస్తున్నారు.

  English summary
  Mahesh Babu recently Announced his 28 film with Trivikram Srinivas. Now This Director Follows Two Heroines Sentiment for This Movie.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X